ఇలా చేస్తే డ్రెస్ లకు అంటుకున్న పీరియడ్స్ మరకలు ఈజీగా పోతాయి
Period Stain: ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని సార్లు డ్రెస్ లకు పీరియడ్స్ మరకలు అంటుకుంటాయి. ఈ మరకలు అస్సలు పోవని చాలా మంది అనుకుంటారు. కానీ కొన్ని చిట్కాలతో ఈ మరకలను శాశ్వతంగా పోగొట్టొచ్చు.

పీరియడ్స్ మరకలను తొలగించే చిట్కాలు
పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, తిమ్మిరి, కాళ్లు చేతులు లాగడం, నడుపు నొప్పి, వాంతులు, విపరీతమైన అలసట, ఒత్తిడి వంటి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా డ్రెస్ కు ఖచ్చితంగా పీరియడ్స్ మరకలు అవుతాయి. ఈ మరకలను పోగొట్టడం నిజానికి పెద్ద టాస్క్ అనేచెప్పాలి. సబ్బుతో ఎంత రుద్ది శుభ్రం చేసినా ఇవి అస్సలు పోవు. అందుకే చాలా మంది ఈ మరకలు పోవని వాటిని అలాగే వదిలేస్తారు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ మరకలను సులువుగా పోగొట్టొచ్చు.
కుళాయి కింద కడగాలి
డ్రెప్ లకు పీరియడ్స్ మరకలు అంటుకుంటు వెంటనే దాన్ని పారే నీటిలో అంటే కుళాయి కింద ఆ మరకను శుభ్రం చేయండి. టిష్యూ పేపర్ ను లేదా క్లాత్ ను ఉపయోగించి దీన్ని తుడవండి. తర్వాత ఎప్పటిలాగే సబ్బుతో ఉతికి ఎండలో ఆరబెడితే మరక కనిపించదు.
ఎండిన మరకలను ఎలా తొలగించాలి
కొన్నిసార్లు పీరియడ్స్ మరకలను గమనించకపోవడంతో అది పూర్తిగా ఆరిపోతుంది. ఇలాంటి మరకను పోగొట్టడం కొంచెం కష్టమే. కానీ బేకింగ్ సోడాతో ఈ మరకను పోగొట్టొచ్చు. ఇందుకోసం మరక అంటిన డ్రెస్ ను కాసేపు బేకింగ్ సోడా వేసిన చల్ల నీళ్లలో నానబెట్టండి. తర్వాత సబ్బుతో ఉతకండి. దీంతో డ్రెస్ కు అంటుకున్న మరక పోతుంది. దుర్వాసన కూడా రాదు.
నిమ్మరసం
నిమ్మరసం కూడా డ్రెస్ లకు అంటిన పీరియడ్స్ మరకలను తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం డ్రెస్ కు అంటుకున్న పీరియడ్స్ మరకపై నిమ్మరసం రుద్దండి. దీన్ని కాసేపు అలాగే వదిలేసి తర్వాత సబ్బుతో ఉతకండి. దీనివల్ల పీరియడ్స్ మరక మసకబారుతుంది.
వేడి నీళ్లతో ఉతకొచ్చా
చాలామంది ఆడవారు పీరియడ్స్ మరకలను పోగొట్టడానికి వేడి నీళ్లలో డ్రెస్ లను నానబెట్టి ఉతుకుతుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడడదు. ఎందుకంటే వేడి నీళ్లలో నానబెట్టడం వల్ల పీరియడ్స్ మరకలు మరింత మొండిగా అవుతాయి. దీనివల్ల మీరు ఏం చేసినా ఈ మరకలను పోగొట్టలేరు. అలాగే కాటన్, సాఫ్ట్ దుస్తులను గట్టిగా రుద్దకూడదు.