MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • Parenting Tips : మీ పిల్లలు మట్టి తింటున్నారా? దానికి కారణమిదే

Parenting Tips : మీ పిల్లలు మట్టి తింటున్నారా? దానికి కారణమిదే

Parenting Tips : చాలా మంది పిల్లలు మట్టిని చూడగానే నోట్లో పెట్టుకుని తింటుంటారు. కొట్టినా మట్టిని తినే అలవాటును మాత్రం మానుకోరు. అసలు పిల్లలు మట్టిని తినడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Oct 11 2025, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పిల్లలు మట్టిని ఎందుకు తింటారు
Image Credit : istockphoto

పిల్లలు మట్టిని ఎందుకు తింటారు

ఏడాది వయసున్న పిల్లల నుంచి రెండేండ్ల వయసున్న పిల్లలు మట్టిని చూస్తే నోట్లో పెట్టుకోకుండా ఉండలేరు. కొంతమంది పిల్లలు ఈ అలవాటును మానుకున్నా కొందరు పిల్లలు మాత్రం ఈ అలవాటును కొన్నేండ్ల వరకు కొనసాగిస్తారు. ఇలాంటి పిల్లలు బెదిరించినా, బుజ్జగించి చెప్పినా, కొట్టినా మట్టిని తినకుండా అస్సలు ఉండలేరు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మట్టిని తినే అలవాటును మాన్పే చిట్కాలు కూడా ఉన్నాయి. 

24
ఐరన్ లోపం
Image Credit : istockphoto

ఐరన్ లోపం

పిల్లలు మట్టిని తినడానికి అసలు కారణం వారిలో ఐరన్ లోపించడమే అంటున్నారు నిపుణులు. ఈ ఐరన్ లోపాన్ని భర్తీ చేయడానికి మట్టిని తినాలనిపిస్తుందట. ఐరన్ తో పాటుగా శరీరంలో కాల్షియం, జింక్ లు లోపించడం వల్ల కూడా పిల్లలు మట్టిని తినడానికి అలవాటు పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ లోపాలను గనుక సరిచేస్తే పిల్లలు మట్టిని తినడం మానేస్తారు. 

Related Articles

Related image1
మీ పిల్లలు పొట్టిగా ఉన్నారా? ఈ కూరగాయలు పెట్టండి హైట్ బాగా పెరుగుతారు
Related image2
ఈ ఒక్కటి పెట్టినా రాగి పాత్రలు కొత్తవాటిలా తళ తళా మెరుస్తాయి
34
ఒత్తిడి, ఆందోళన
Image Credit : istockphoto

ఒత్తిడి, ఆందోళన

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొంతమంది పిల్లలు మట్టిని తినడానికి ఒత్తిడి, ఆందోళన, విసుగు కూడా కారణం కావొచ్చు. పిల్లలు విసుగు చెందినా, ఒత్తిడికి గురైనా మట్టిని తిని ఉపశమనం పొందుతారు. ఇది వారికి ఒక రకమైన ఉపశమనాన్ని ఇస్తుందట. అలాగే తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించడానికి కూడా పిల్లలు ఇలా చేస్తారు. దీన్ని గుర్తిస్తే మీరు పిల్లలు మట్టిని తినకుండా చేయొచ్చు.

44
ఈ టెస్ట్ లు చేయించాలి
Image Credit : istockphoto

ఈ టెస్ట్ లు చేయించాలి

మీ పిల్లలు మట్టిని తింటున్నట్టు గుర్తిస్తే గనుక వెంటనే హాస్పటల్ కు తీసుకెళ్లడం మంచిది. దీనివల్ల మీ పిల్లలకు బ్లడ్ టెస్ట్ చేసి వారిలో ఐరన్ లోపం ఉందో? జింక్ లోపం ఉందో తెలుస్తుంది. దీనివల్ల మట్టిని తినే అలవాటును తొందరగా మాన్పించొచ్చు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting Psychology: పేరెంట్స్ స్ట్రెస్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా?
Recommended image2
Child Psychology: పిల్లల్ని పదే పదే చెంపపై కొడుతున్నారా? వాళ్లు ఎలా మారిపోతారో తెలుసా?
Recommended image3
Modern Parenting : 9 ఏళ్లు దాటిన పిల్లలకు తల్లి ఎలాంటి విషయాలు నేర్పించాలో తెలుసా?
Related Stories
Recommended image1
మీ పిల్లలు పొట్టిగా ఉన్నారా? ఈ కూరగాయలు పెట్టండి హైట్ బాగా పెరుగుతారు
Recommended image2
ఈ ఒక్కటి పెట్టినా రాగి పాత్రలు కొత్తవాటిలా తళ తళా మెరుస్తాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved