Cooking Tips : కూరలు రుచిగా కావడం లేదా? కారణం ఇదే
Cooking Tips: కొంతమంది కూరలు టేస్టీగా కావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల మసాలా దినుసులు వేస్తుంటారు. అయినా కూర మాత్రం టేస్ట్ గా కాదు. ఇది వాళ్లను ఎంతో డిసప్పాయింట్ కు గురిచేస్తుంది. అసలు కూరలు ఎందుకు టేస్ట్ కావో తెలుసా?

కుకింగ్ టిప్స్
కూరలు చాలా టేస్టీగా కావాలని ఆడవాళ్లు ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఏవేవో మసాలా దినుసులను కూడా వేస్తుంటారు. కానీ కొంతమంది ఎంత ఓపిగ్గా, ఎన్ని మసాలా దినుసులు వేసి చేసినా అస్సలు టేస్ట్ కావు. ఇలా ఎందుకు అవుతుందో తెలియక చాలా మంది ఇక నాకు వంటలు రావని బాధ పడుతుంటారు.
కానీ కొంతమంది ఎలాంటి మసాలా దినుసులు వేయకున్నా చాలా టేస్టీగా అవుతుంటాయి. దీనికి కొన్ని సీక్రేట్స్ యే కారణమన్న సంగతి మీకు తెలుసా? అవును మీరు కూడా కొన్ని ట్రిక్స్ ను ఫాలో అయితే మీరు చేసిన ప్రతి వంటా ఎంతో టేస్టీగా అవుతుంది. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చల్లని నూనెలో టెంపరింగ్
చాలా మంది హడావుడిలో లేదా వేరే పని బిజీలో ఉండి నూనె వేడి కాకముందే పోపు దినుసులను, మసాలాలను వేస్తుంటారు. కానీ ఇలా చేస్తే కూర అస్సలు టేస్ట్ కాదు. నూనె వేడి కాకముందే జీలకర్ర, ఆవాలను వేస్తే అవి వాటి సువాసనను విడుదల చేయవు. దీనివల్ల వాటి సువాసన, రుచి కూరగాయలకు పట్టవు. అందుకే పోపును ఎప్పుడూ కూడా వేడి నూనెలోనే వేయాలి. అప్పుడే మీ కూర టేస్ట్ వస్తుంది. మంచి సువాసన వస్తుంది.
మసాలా దినుసులను బాగా వేయించకపోవడం
కూర టేస్ట్ కావాలంటే మీరు కేవలం అవసరమైన మసాలా దినుసులను వేస్తే సరిపోదు. వాటిని బాగా వేయించడం కూడా అవసరమే. ఎందుకంటే మసాలా దినుసుల్లో పచ్చిదనం అలాగే ఉండి కూరలు టేస్ట్ కావు. చాలా మంది కొత్తిమీర, పసుపు లేదా మిరపకాయలు వంటి మసాలా మసాలా దినుసులను వేయించరు. కానీ వీటిని తక్కువ మంట మీద రెండు నిమిషాలు ఖచ్చితంగా వేయించాలి. అప్పుడే అవి బాగా వేగి ఫుడ్ టేస్ట్ అవుతుంది.
సరైన సమయంలో ఉప్పు వేయడం
కూరలో ఉప్పు వేశామా? లేదా? అని కాకుండా సరైన సమయంలో వేస్తేనే మీ వంట టేస్ట్ అవుతుంది. అవును కూర మొత్తం అయిన తర్వాత ఉప్పు వేస్తే మీరు చేసిన కూరటేస్ట్ పాడవుతుంది. ఉప్పును ఎప్పుడైనా సరే కూర స్టార్టింగ్ లోనే వేయాలి. అప్పుడే ఉప్పు కూరగాయల్లో బాగా కలిసిపోతుంది. అదే మీరు లేట్ గా ఉప్పును వేస్తే ఉప్పు మొత్తం కరగదు. ఇది కాకుండా కూరలో ఉప్పును కూరగాయలు సగం ఉడికిన తర్వాత వేయడం బెటర్. ఇది కూరలో బాగా కరిగి రుచిని పెంచుతుంది.
మూతపెట్టాలి
చాలా మంది కూరపై మూత పెట్టకుండానే వంట చేస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. మీరు ఏ కూర చేసినా మూత ఖచ్చితంగా పెట్టాలి. లేదంటే మీరు చేసే కూర టేస్ట్ బాగుండదు. దీనివల్ల కూరగాయలు అతిగా ఉడికి టేస్ట్ పోతుంది. అందుకే ఏ కూర చేసినా మీరు గిన్నెపై మూత పెట్టి ప్రతి మూడు నాలుగు నిమిషాలకు ఒకసారి మూత తీసి కూరను కలుపుతూ ఉండండి.
ప్రతి కూరలో మసాలా దినుసులను వేయడం
కూరలు టేస్ట్ కావడానికి మసాలా దినుసులు కూడా బాగా ఉపయోగపడతాయి. అది సొరకాయ అయినా కావొచ్చు. బెండకాయ, దొండకాయ అయినా కావొచ్చు. ప్రతి కూరలో మసాలా దినుసులను వేసుకోవచ్చు. కానీ ఏ కూరలో ఏ మసాలా వేయాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏది పడితే అది వేస్తే కూడా టేస్ట్ మారుతుంది. కసూరి మేతి, ధనియా పౌడర్ వంటివి కూరల టేస్ట్ ను పెంచుతాయి.
ఫ్రెష్ నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం
కూరలు చేసేటప్పుడు తాజా పదార్థాలను ఉపయోగించాలి. ఎందుకంటే ఫ్రెష్ కూరగాయలతో కూర టేస్టీగా అవుతుంది. ఎప్పుడో తరిగిన కూరగాయలు, ఫ్రిజ్ లో ఉంచిన పాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వంటివి కూరను టేస్ట్ కాకుండా చేస్తుంటాయి. అందుకే ఫ్రెష్ కొత్తిమీద, ఫ్రెష్ అల్లం, వెల్లుల్లి పేస్ట్ వంటివి వాడండి. ఇవి కూర టేస్ట్ ను పెంచుతాయి.
ఉల్లిపాయలు, టమాటాలు సరిగ్గా ఉడికించకపోవడం
చాలా మంది ఉల్లిపాయ బంగారు గోధుమ రంగులోకి మారకుండానే టమాటాలను వేసి కలుపుతుంటాయి. దీనివల్ల ఉల్లిపాయ పచ్చిదనం పోదు. దీనివల్ల కూర టేస్ట్ కాదు. అందుకే ఉల్లిపాయ పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. అంతేకాకుండా టమాటాలు వేసిన వెంటనే మసాలా దినుసులను వేయడం మానుకోవాలి. దీనివల్ల టమాటాలు రుచిగా ఉండవు. కాబట్టి టమాటాలనే కాసేపు వేయించి తర్వాత మసాలా దినుసులను వేయాలి.