Face Glow: ఇదొక్కటి వాడినా కూడా మీ వయసు పదేళ్లు తగ్గడం ఖాయం..!
Face Glow: రూపాయి ఖర్చులేకుండా మీ అందాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నారా? అయితే, కేవలం మందార పూలను వాడితే సరిపోతుంది. ఈ మందారపూలతో మరికొన్నింటిని కలిపి ముఖానికి రాస్తే చాలు అందం రెట్టింపు అవుతుంది.

Face Glow
వయసు పెరుగుతుంటే అందం తగ్గడం సహజం. కానీ, అలా అందం తగ్గడం అందరికీ నచ్చదు. దానిని కవర్ చేయడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఖరీదైన క్రీములు, సీరమ్స్ రాయడం చేస్తూ ఉంటారు. అంతేకాదు.. ఖరీదైన ఫేషియల్స్ , ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు. అయితే, అవేమీ లేకపోయినా... రూపాయి ఖర్చు లేకుండా కూడా వయసు తగ్గించుకోవచ్చు. ముఖంపై ముడతలు రాకుండా చూసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం....
మనకు మందారపూలు చాలా సహజంగా, ఈజీగా లభిస్తాయి. ఈ మందార పూలను చాలా మంది జుట్టు సంరక్షణ కోసం వాడుతూ ఉంటారు. కానీ.. ఇవే పూలు మన అందాన్ని కూడా పెంచడంలో కూడా హెల్ప్ చేస్తాయి.
కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది...
వయసు పెరుగుతుంటే కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీని వల్ల ముఖంపై ముడతలు రావడం మొదలౌతాయి. అయితే... మందార పూలలో ఉండే ప్రత్యేక ఎంజైమ్ లు, యాంటీ ఆక్సిడెంట్లు.. కొల్లాజెన్ ఉత్పత్తిని సహజంగా పెంచుతాయి. దీని వల్ల చర్మం దృఢంగా, యవ్వనంగా, ప్రకాశవంతంగా మారుతుంది.
డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది...
మందారలో AHA, BHA అనే సహజ ఎక్స్‌ఫోలియేటింగ్ ఆమ్లాలు ఉంటాయి. ఇవి చనిపోయిన చర్మ కణాలను నెమ్మదిగా తొలగించి, మూసుకుపోయిన రంధ్రాలను శుభ్రపరుస్తాయి. దీని వల్ల చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.
వృద్ధాప్య లక్షణాలను నియంత్రిస్తుంది
పర్యావరణ కాలుష్యం, సన్ డ్యామేజ్ వలన వచ్చే అకాల వృద్ధాప్యాన్ని మందారలోని యాంటీఆక్సిడెంట్లు సమర్థవంతంగా అడ్డుకుంటాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే ముడతలు, చర్మం బిగుతుగా తగ్గటం, డల్‌నెస్‌ను తగ్గించి యవ్వన కాంతిని తిరిగి ఇస్తాయి.
4. మొటిమలను తగ్గిస్తుంది
మందారకు సహజ క్రిమినాశక, శోథ నిరోధక గుణాలు ఉన్నాయి. ఇవి ముఖంపై పేరుకుపోయిన అదనపు నూనెను తొలగించడానికి, మొటిమల సమస్యను తగ్గించడానికి కూడా సహాయపడతాయి.
5. చర్మంలోని మంటను తగ్గిస్తుంది
సున్నితమైన చర్మం ఉన్నవారికి మందార గొప్ప సహజ ఉపశమనం. ఇది చర్మంలోని ఎర్రదనం, ఇరిటేషన్, మంటలను తగ్గిస్తుంది.
చర్మ కాంతిని పెంచుతుంది
మందార పువ్వులో విటమిన్ C సహా పలు పోషకాలు ఉండటం వల్ల నల్ల మచ్చలను తగ్గించి చర్మ రంగును సమపాళ్లలో ఉంచుతుంది. దీని వల్ల చర్మం సహజంగా మెరిసిపోతుంది.
చర్మానికి లోతైన హైడ్రేషన్ అందిస్తుంది
పొడి చర్మం ఉన్నవారికి మందార ఒక బ్లెస్సింగ్. ఇది చర్మంలో తేమ నిల్వ ఉండేలా చేసి, రోజంతా మృదువుగా ఉంచుతుంది.
మందార పూలను ముఖానికి ఎలా వాడాలంటే....
1.మందార ఫేస్ ప్యాక్....
ఈ ఫేస్ ప్యాక్ కోసం రెండు మందార పూలు, ఒక టీ స్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ కుంకుమ పువ్వు నీరు లేదా రోజ్ వాటర్ ఉంటే చాలు. దీని కోసం... ముందుగా మందార పూలను బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. దీనిలోనే పెరుగు, రోజ్ వాటర్ కూడా కలపాలి. ఇప్పుడు ముందుగా ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకొని.. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్ రెగ్యులర్ గా వాడటం వల్ల ముఖం మెరుస్తూ కనపడుతుంది.
2.మందార టోనర్...
మందార పూలను నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత... వీటిని నీటిలో వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసి స్ప్రే బాటిల్ లో నిల్వ చేసుకోవాలి. ఈ టోనర్ ని రాత్రి పూట ముఖానికి స్ప్రే చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి. ముఖం తాజాగా, యవ్వనంగా కూడా కనపడుతుంది.
3.మందార,కలబంద జెల్...
దీని కోసం 3 మందార పూలు, 2 టేబుల్ స్పూన్ల కలబంద జెల్ ఉంటే చాలు. మందార పూలను పేస్టులా మార్చి దానికి కలబంద జెల్ కూడా చేర్చాలి. దీనిని ఉదయం, సాయంత్రం మాయిశ్చరైజర్ లా వాడితే సరిపోతుంది. ఇలా వాడటం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. మెరుస్తూ కనపడుతుంది.

