ఎండాకాలంలో ఇలా మాత్రం చేయకండి.. మీ చర్మం జాగ్రత్త..!
తెలిసీ తెలియక కొన్ని పొరపాట్లు చేయడం వల్ల.. చర్మం మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి.. పొరపాటున కూడా.. ఈ మండే ఎండల్లో మనం కొన్ని పొరపాట్లు చేయకూడదు. అవేంటో ఓసారి చూద్దాం..
skin care
ఎండాకాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం ఆరోగ్యం విషయంలో మాత్రమే కాదు... చర్మం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే.. స్కిన్ డ్యామేజ్ సమ్మర్ లో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. తెలిసీ తెలియక కొన్ని పొరపాట్లు చేయడం వల్ల.. చర్మం మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి.. పొరపాటున కూడా.. ఈ మండే ఎండల్లో మనం కొన్ని పొరపాట్లు చేయకూడదు. అవేంటో ఓసారి చూద్దాం..
స్కిన్ కేర్ రొటీన్ లో భాగంగా చాలా మంది రెగ్యులర్ గా మాయిశ్చరైజర్ రాస్తూ ఉంటారు. మాయిశ్చరైజర్ రాసుకోవడం మంచిదే. కానీ.. ఎక్కువగా జిడ్డుగా ఉండే దానిని మాత్రం ఎంచుకోకూడదు. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే క్రీములను ఎంచుకోవడం ఉత్తమం. కీరదోస, అలోవెరాలతో తయారు చేసిన టోనర్ లను ఎంచుకోవడం ఉత్తమం. అంతేకాదు.. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు మర్చిపోకుండా సన్ స్క్రీన్ రాయాలి. ఈ స్కిన్ కేర్ రొటీన్ ని కచ్చితంగా ఫాలో అవ్వాలి. అయితే.. చేయాల్సినవి మాత్రమే కాదు... చెయ్యకూడనివి కూడా తెలుసుకోవాలి
ఎండాకాలంలో చెమటలు చాలా ఎక్కువగా పడుతూ ఉంటాయి. మన చర్మం సహజంగా బ్రీత్ తీసుకునేలా ఉండనివ్వాలి. అందుకే.. ఎక్కువ మేకప్ లు వేయకూడదు. ఎండాకాలంలో ఎక్కువగా మేకప్ వేసుకోవడం వల్ల.. ముఖంపై మొటిమలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
Sunscreen
మీరు ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా కూడా కచ్చితంగా సన్ స్క్రీన్ రాసుకోవాలి. ఎండ ఉన్న సమయంలోనే రాసుకోవాలి అనుకోవద్దు. సాయంత్రం సమయంలో బయటకు వెళ్లినా కూడా సన్ స్క్రీన్ రాసుకోవడం మర్చిపోవద్దు.
ఎండాకాలంలో చర్మం చాలా జిడ్డుగా ఉంటుంది. అది చాలా సహజం. అయితే.. చర్మంగా జిడ్డుగా ఉందని ఊరుకూరికే ముఖాన్ని కడగకూడదు. అలా తరచూ కడగడం వల్ల,.. చర్మంలోని సహజ నూనెలు పోయి... చర్మం పొడిగా మారే ప్రమాదం ఉంది.
మీరు బయటకు వెళ్లే సమయంలో కూడా మర్చిపోకుండా వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. ఎందుకంటే.. ఎండాకాలంలో శరీరం డీ హైడ్రేటెడ్ గా మారుతుంది. అందుకే.. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి నీరు ఎక్కువగా తాగాలి. నీరు తాగడం వల్ల చర్మం కూడా తాజాగా కనపడుతుంది.
ఇక.. మీరు ఈ ఎండల్లో అందంగా కనిపించాలి అంటే.. తీసుకునే ఆహారంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయిల్ లో డీప్ ఫ్రై చేసే ఆహారాలను పొరపాటున కూడా ఈ ఎండల్లో తీసుకోకూడదు. ఆయిల్ ఫుడ్ తినడం వల్ల.. మన చర్మం నుంచి చెమట మరీ ఎక్కువగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అది చర్మానికి మంచిది కాదు. కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి.
ఇక మనం బయటకు వెళ్లినప్పుడు మన చర్మం ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. బయటి దుమ్ము, బ్యాక్టీరియా అన్నీ.. చర్మాన్ని పాడు చేస్తాయి. కాబట్టి.. రాత్రి పడుకునేముందు.. క్రమం తప్పకుండా ఫేస్ ని కడుగుతూ ఉండాలి. రాత్రిపూట స్కిన్ ని శుభ్రం చేసుకొని పడుకుంటే.. చర్మం తొందరగా పాడవ్వకుండా ఉంటుంది.