Wearing Bra: అమ్మాయిలు బ్రా కచ్చితంగా వేసుకోవాలా..?
చిన్న వయసు నుంచే శరీరానికి బిగుతుగా ఉండే బ్రా, పెట్టికోటు వంటి లోదుస్తులు వేసుకోవడం మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

ఇంట్లో ఆడపిల్ల ఉంది అంటే చాలు... ఒక వయసు రాగానే వారిచేత బ్రా, పెట్టికోట్ అంటూ వేయిస్తూ ఉంటాం. వాటిని వేసుకోవడం వల్ల పిల్లలకు కంఫర్ట్ ఉందా లేదా అనే విషయం గురించి ఆలోచించరు. కచ్చితంగా వేసుకోవాల్సిందే అని వాటిని అలవాటు చేస్తూ ఉంటారు. కానీ.. చిన్న వయసు నుంచే శరీరానికి బిగుతుగా ఉండే బ్రా, పెట్టికోటు వంటి లోదుస్తులు వేసుకోవడం మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
ఒక వయసు రాగానే స్త్రీల శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయి. వాటిని సరిగా చూపించాలని.. ఏ డ్రెస్ వేసుకున్నా పర్ఫెక్ట్ లుక్ రావాలి అనే ఉద్దేశంతో బ్రాలు ధరించడం మొదలుపెడతారు. అవి కూడా బాడీకి అంటుకునేలా, బిగుతుగా ఉండేవి ధరించడం ఈ రోజుల్లో ఫ్యాషన్ గా మారిపోయింది. ఇలా బిగుతైన లోదుస్తులు వేయడం వల్ల మహిళల్లో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మహిళలు బ్రా ధరించడం చాలా కామన్. అయితే, ఈ బ్రాలు ధరించడం వల్ల మన లుక్ పర్ఫెక్ట్ గా ఉంటుందని అనుకుంటాం. కానీ, ఈ పర్ఫెక్ట్ లుక్ వెనక చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల దీర్ఘకాలిక మెడ, భుజం, చేతులు నొప్పి రావడానికి కారణం అవుతుందట. బ్రాలకు ఉండే స్ట్రాప్స్ కారణంగా కూడా చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
బ్రా స్ట్రాప్స్ గట్టిగా లేదా టైట్ గా ఉంటే, మీ రొమ్ములు భారీగా ఉంటే... ఈ స్ట్రాబ్స్ మీ భుజాల చుట్టూ ఉండే కణజాలాన్ని దెబ్బతీస్తాయి. క్లావికల్ బోన్ పై ఒత్తిడిని కలిగిస్తాయి. అందుకే.. మనం టైట్ గా ఉండే బ్రాలు ధరించకూడదు. అసలు.. ఎలాంటి బ్రా ధరించకుండా అయినా మేం కంఫర్ట్ గా ఫీలౌతాం అంటే వాటిని ధరించకుండా కూడా ఉండొచ్చు.
బ్రా సిండ్రోమ్ లక్షణాలు
బ్రా స్ట్రాప్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు తరచుగా మెడ లేదా భుజం ప్రాంతంలో నొప్పిని అనుభవిస్తారు. మీరు పని చేస్తున్నప్పుడు లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు, ముఖ్యంగా భారీ వస్తువులను మోసుకెళ్ళేటప్పుడు నొప్పి మరింత ఎక్కువగా ఉంటుంది.
ఈ నొప్పిని ఎలా పరిష్కరించాలి?
మీరు అటువంటి దీర్ఘకాలిక నొప్పిని ఎదుర్కొంటుంటే, సరైన రోగ నిర్ధారణ కోసం మీ వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. రోగులు స్ట్రాప్‌లెస్ బ్రాలు లేదా బ్రాడ్ స్ట్రాప్‌లు ఉన్న బ్రాలను ధరించాలని సూచించారు. వైద్యులు సూచించినవి పాటిస్తే, సమస్య నుంచి బయటపడతారు.