చలికాలంలో చర్మం మృదువుగా ఉండాలా..? చేయాల్సినవీ, చేయకూడనివీ ఇవే..!
ఈ చలికాలంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా పొడి చర్మం వారు చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి.. కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులుు సూచిస్తున్నారు. అసలు చలికాలంలో చర్మం కాపాడుకోవడానికి చేయాల్సినవి ఏంటి..? చేయకూడనివి ఏంటో ఇప్పుడు చూద్దాం..
చలికాలం వచ్చిందంటే చాలు... చర్మం పొడిబారి పోతుంది. మాయిశ్చరైజర్ రాసినా ఎక్కువ సేపు తేమ ఉండదు. చర్మంలో చాలా రకాలు ఉంటాయి. నార్మల్ చర్మం, పొడి చర్మం, జిడ్డు చర్మం, సున్నితమైన చర్మం.. ఇలా రకాలు ఉంటాయి. ఏ రకం చర్మం వారైనా.. ఈ చలికాలంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా పొడి చర్మం వారు చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి.. కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులుు సూచిస్తున్నారు. అసలు చలికాలంలో చర్మం కాపాడుకోవడానికి చేయాల్సినవి ఏంటి..? చేయకూడనివి ఏంటో ఇప్పుడు చూద్దాం..
చేయాల్సినవి..
చలికాలంలో మనకు దాహంగా అనిపించదు. దీంతో.. నీరు ఎక్కువగా తీసుకోము. దాని వల్ల కూడా చర్మం తొందరగా పొడిపారుతుంది. కాబట్టి.. ద్రవాలు ఎక్కవగా తీసుకోవాలి. దీని వల్ల చర్మం లో తేమ తయారౌతుంది.
అంతేకుండా మీ చర్మానికి సరిపడే నూనెలు, మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. ఇది.. పొడి చర్మం, పొట్టురాలడం వంటి సమస్యను తగ్గిస్తుంది. చర్మం మృదువుగా, తేమగా ఉండటానికి సహాయం చేస్తుంది.
ఇక.. ఎండాకాలంలో ఉపయోగించే స్కిన్ కేర్ రోటీన్ ని.. చలికాలంలో వాడకూడదు. వాతావరంలో మార్పులను బట్టి.. స్కిన్ కేర్ రోటీన్ ని మార్చాల్సి ఉంటుంది. చలికాలానికి సూటయ్యే స్కిన్ కేర్ ని ఎంచుకోవాలి. అప్పుడు.. చర్మం అందంగా కనపడుతుంది.
చేయకూడనివి...
ఓవర్-ఎక్స్‌ఫోలియేషన్‌ను నివారించండి: చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల చనిపోయిన చర్మ కణాలు, మలినాలను వదిలించుకోవడానికి ,రంధ్రాలను అన్‌క్లాగ్ చేయడంలో సహాయపడుతుంది. అయితే, ఇది చర్మం పొడిబారడానికి కూడా కారణమవుతుంది. మీకు పొడి చర్మం ఉన్నట్లయితే, ఓవర్ ఎక్స్‌ఫోలియేషన్‌ను నివారించండి. లేదంటే..చర్మం ఎర్రగా మారడటం, పొక్కులు, మంటలు రావడం లాంటివి జరుగుతాయి.
ఆల్కహాల్‌తో కూడిన ఉత్పత్తులను ఉపయోగించకుండా ఉండండి: మీ చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకునే ముందు పదార్థాలను తనిఖీ చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే టోనర్‌లు ,క్లెన్సర్‌లు వంటి వివిధ రకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఆల్కహాల్ ఉండవచ్చు. అటువంటి ఉత్పత్తులు.. చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తాయి
వేడి నీటితో స్నానం: చాలా మంది చలికాలం కదా.. అని వేడి నీటితో స్నానం చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ.. చలికాలంలో కూడా వేడి నీటితో స్నానం చేయడం మంచిది కాదట. దాని వల్ల తామర వంటి చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.