ఇంటిని ఎలా శుభ్రం చేయాలో తెలుసా?
ఇంటిని పరిశుభ్రంగా ఉంచడానికి ఆడవాళ్లు చేయగలిగినదంతా చేస్తుంటారు. కానీ కొన్ని ప్లేస్ లను మాత్రం మర్చిపోతుంటారు. దీనివల్లే ఇళ్లు మురికిగా కనిపిస్తుంది. అసలు ఇంటిని ఎలా క్లీన్ చేయాలో తెలుసా?
ఆడవాళ్లకు ఇళ్లంతా నీట్ గా ఉంటేనే నచ్చుతుంది. అందుకే ఎంత పని ఉన్నా.. ఇంటిని మాత్రం చక్కగా సర్దుతుంటారు. అలాగే క్లీన్ చేస్తుంటారు. కొన్ని కొన్ని సార్లు వేరే పనుల వల్ల చాలా మంది ఆడవారు ఇంటిని హడావిడిగా శుభ్రం చేసేస్తుంటారు. ఇలా మీరు క్లీన్ చేస్తే ఎలాంటి లాభం ఉండదు. అవును మీరు మీ ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కొన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. చాలాసార్లు తొందరపడి కొన్ని తప్పులు చేస్తుంటాం. దాని వల్ల మీరు పెద్ద నష్టాన్నే చవిచూడాల్సి వస్తుంది. అందుకే ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
సింక్ శుభ్రం
చాలాసార్లు మనం సింక్ లో ఉంచిన పాత్రలను హడావుడిగా శుభ్రం చేస్తుంటాం. పాత్రలు శుభ్రం చేసిన తర్వాత సింక్ ను మాత్రం శుభ్రం చేయరు. కానీ సింక్ మురికిగా ఉండటం వల్ల దానిలోకి బొద్దింకలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే పాత్రలను క్లీన్ చేసిన తర్వాత ఖచ్చితంగా సింక్ ను క్లీన్ చేయాలి.
మురికి బట్టలు వాడకూడదు
చాలా మంది తమ మురికి బట్టలను ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తుంటారు. కానీ ఇంటిని క్లీన్ చేయడానికి మురికి బట్టలను ఉపయోగించకూడదు. ఒకవేళ పాత మురికి బట్టలను ఉపయోగించాలనుకుంటే ముందు వాటిని నీట్ గా ఉతకండి. ఆ తర్వాతే ఇంటిని క్లీన్ చేయడానికి వాడండి.
మోప్
చాలామంది ఇంటి దుమ్ము దులిపిన తర్వాత హడావుడిలో పడి తుడవడం మర్చిపోతుంటారు. దుమ్మును కేవలం ఊకేస్తారు. కానీ ఇంటిని క్లీన్ చేసిన తర్వాత ఖచ్చితంగా తుడవాలి. జస్ట్ మీరు ఊకితే టైల్స్ కు అంటుకున్న దుమ్ము పూర్తిగా పోదు. అందుకే దుమ్ము దులిపిన తర్వాత ఇంటిని మోప్ తో క్లీన్ చేయాలి.
కిచెన్ కంపార్ట్ మెంట్ శుభ్రం
చాలా మంది హడావుడిగా మాత్రమే వంటగదిని శుభ్రం చేస్తుంటారు. దీనివల్ల వంటగదిలో ఉంచిన వస్తువులకు దుమ్ము దూళి అంటుకుంటుంది. అందుకే మీ వంటగదిని శుభ్రం చేసేటప్పుడు తొందరపడి కిచెన్ కంపార్ట్ మెంటును శుభ్రం చేయడం మర్చిపోకండి.