బాత్రూమ్ బకెట్లు, మగ్గులను దీనితో తోమితే కొత్తవాటిలా అయిపోతాయి
బాత్రూమ్ బకెట్లు, మగ్గులను క్లీన్ చేసే అలవాటు చాలా మందికి ఉండదు. దీనివల్లే ఇవి తొందరగా మురికిగా మారిపోతాయి. ముఖ్యంగా సబ్బు నురగ, వాటర్ వల్ల వాటిపై ఒకతెల్లని పొర ఏర్పడుతుంది. దీంతో అవి మురికిగా కనిపిస్తాయి.

చాలా మంది వారం వారం లేదా రెండు మూడు రోజులకోసారైనా ఖచ్చితంగా బాత్ రూంని శుభ్రం చేస్తుంటారు. ఎందుకంటే బాత్ రూంలో వాసన రాకూడదని, బాత్ రూంలో మురికి పేరుకుపోకూడదని. కానీ బాత్ రూంలో ఉన్న బకెట్ ను, మగ్గులను మాత్రం క్లీన్ చేయరు. అసలు వీటిని పట్టించుకోరు. దీనివల్లే అవి మురికిగా మారిపోతాయి. బాత్ రూంలోని మగ్గులను, బకెట్ ను శుభ్రం చేయకుండా వదిలేస్తే వాటిపై పసుపు, తెలుపు మురికి పొర ఏర్పడుతుంది. దీన్ని అలాగే వదిలేస్తే ఇవి బకెట్ నుంచి తొలగిపోవు. ఎంత క్లీన్ చేసినా వేస్టే అవుతుంది.
బాత్రూమ్ బకెట్లు, మగ్గులు మురికిగా మారితే ఏం చేయాలి?
బాత్రూమ్ బకెట్లను, మగ్గులను క్లీన్ చేయడానికి, మురికిని పోగొట్టడానికి మార్కెట్ లో ఎన్నో రకాల క్లీనర్లు అందుబాటులో ఉంటాయి. కానీ మీరు రూపాయి ఖర్చు లేకుండా మీ వంటింట్లో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి వీటిని చాలా సులువుగా క్లీన్ చేయొచ్చు. కొత్తవాటిలా కనిపించేలా చేయొచ్చు. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బేకింగ్ సోడా
బేకింగ్ సోడాను ఉపయోగించి మనం ఎన్నో చిన్న, చిన్న ఇంటి పనులను సులువుగా కంప్లీట్ చేయొచ్చు. దీన్ని మనం బాత్ రూం మగ్గులు, బకెట్లను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించొచ్చు. నిజానికి రూపాయి ఖర్చు లేకుండా క్లీన్ చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్.
ఇందుకోసం ఏం చేయాలంటే..ఒక గిన్నెలో బేకింగ్ సోడాను తీసుకొని అందులో కొంచెం నిమ్మకాయ రసం, డిష్ వాష్ సబ్బును వేసి కలపండి. దీన్ని బాగా మిక్స్ చేసి పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్ ను బ్రష్ తో బాత్ రూం బకెట్లు, మగ్గులకు రుద్దండి. 15 నిమిషాల పాటు దాన్ని అలాగే వదిలేయండి. తర్వాత క్లీన్ చేయండి. అంతే వాటికి పట్టిన మురికి మొత్తం పోయి కొత్తవాటిలా మెరిసిపోతాయి. శుభ్రంగా కనిపిస్తాయి.
ఈనోతో శుభ్రం చేయండి
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఈనోలు ఉంటున్నాయి. అయితే మీరు ఈ ఈనోను ఉపయోగించి కూడా బాత్ రూం బకెట్లను, మగ్గులను సులువుగా క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా నిమ్మకాయ రసంలో ఈనోను కలిపి మగ్గులకు, బకెట్లకు రుద్ది శుభ్రం చేయడమే. ఇది బకెట్లపై ఉన్న తెల్లని మరకలను పోగొట్టడానికి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
హైడ్రోజన్ పెరాక్సైడ్
చాలా సార్లు బాత్ రూం బకెట్లు, మగ్గులపై ఉప్పు నీటి మరకలు పేరుకుపోతాయి. ఇవి అంత సులువుగా పోవు. కానీ వీటిని హైడ్రోజన్ పెరాక్సైడ్ తో చాలా ఈజీగా పోగొట్టొచ్చు. ఇందుకోసం నీళ్లలో ఒక టీస్పూన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ను వేసి మంచి బ్రష్ తో బకెట్లు, మగ్గలకు రుద్దండి. అంతే మరకలు సులువుగా పోతాయి.
వెనిగర్
బేకింగ్ సోడాతోనే కాదు వెనిగర్ తో కూడా బాత్ రూం బకెట్లను, మగ్గులను చాలా సులువుగా క్లీన్ చేయొచ్చు. నిజానికి ఇది చాలా సులువైన మార్గం కూడా. ఇందుకోసం 2 టీస్పూన్ల వెనిగర్, 2 టీస్పూన్ల బేకింగ్ సోడా అవసరమవుతాయి. ఈ రెండింటిని మిక్స్ చేసి బకెట్, మగ్గులకు రుద్ది శుభ్రం చేయాలి.