MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • ఆఫీస్ క్రిస్మస్ పార్టీలో డిఫరెంట్ గా కనిపించాలనుకుంటున్నారా? అయితే ఈ ట్రెండీ డ్రెస్సులను ట్రై చేయండి

ఆఫీస్ క్రిస్మస్ పార్టీలో డిఫరెంట్ గా కనిపించాలనుకుంటున్నారా? అయితే ఈ ట్రెండీ డ్రెస్సులను ట్రై చేయండి

Christmas 2023: క్రిస్మస్ కు ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. ఇక ఆఫీసుల్లో ఈ పార్టీకి ఏర్పాట్లు కూడా షురూ అవుతుంటాయి. అయితే ఈ పార్టీకి ఎలాంటి డ్రెస్సులను వేసుకెళ్లాలి అమ్మాయిలు తెగ గాబరా పడిపోతుంటారు. మరి ఈ పార్టీలో మీరు అందంగా కనిపించాలంటే ఎలాంటి ట్రెండీ డ్రెస్సులను ట్రై చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 15 2023, 09:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
క్రిస్మస్

క్రిస్మస్

రోజూ ఆఫీసుకు వెళ్లడం సర్వ సాధారణ విషయం. అయితే ఆఫీసుకు మాత్రం ఫార్మల్ డ్రెస్సులనే వేసుకెళ్తారు. కానీ పార్టీ ఉన్నప్పుడు మాత్రం డిఫరెంట్ డ్రెస్సులను వేసుకోవాలనుకుంటాం. ముందే క్రిస్మస్ పండుగ వచ్చేస్తోంది. ఈ సందర్భంగా ఆఫీసుల్లో పార్టీలు చేస్తుంటారు. మరి ఈ పార్టీలో మీరు రోజులా కాకుండా డిఫరెంట్ గా కనిపించాలంటే మాత్రం కొత్త ట్రెండ్ డ్రెస్సులను వేసుకోవాలి. ఇవి మీరు అందంగా, రోజులా కాకుండా డిఫరెంట్ లుక్ లో కనిపించేలా చేస్తాయి. మీరు కూడా ఇలా కనిపించాలనుకుంటే ఎలాంటి డ్రెస్సులను ట్రై చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Christmas

Christmas

ప్యాంటుతో స్లిట్ కట్ టాప్

ఆఫీస్ పార్టీలో స్టైల్ గా కనిపించాలంటే మాత్రం మీరు స్లిట్ కట్ టాప్ ప్యాంట్ ను ట్రై చేయొచ్చు. ఈ డ్రెస్సులో మీ లుక్ అదిరిపోతుంది. ఈ రోజుల్లో ఈ రకమైన డ్రస్సులే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. అలాగే ఇవి చాలా క్లాసీగా కూడా కనిపిస్తాయి. అందుకే ఈ క్రిస్మస్ పార్టీకి మీరు వీటిని వేసుకోవచ్చు. వీటికున్న ప్రత్యేకత ఏమిటంటే ఇవి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. ముఖ్యంగా ఆఫీస్ పార్టీకి ఇవి పర్ఫెక్ట్ గా సరిపోతాయి. వీటిలో ఎన్నో రకాల డిజైన్లు ఉంటాయి. మార్కెట్ లో రూ. 1000 నుంచి 2000 వరకు ఇలాంటి కో-బేసి సెట్లు దొరుకుతాయి. ఈ రకమైన డ్రెస్సుల పైకి ముత్యాల చెవిపోగులు, అందమైన నెక్లెస్ సెట్ లను వేసుకుంటే మీ అందానికి ఎవరూ వంక పెట్టరు. 

34

టాప్ తో స్కర్ట్

మీరు ఏదైనా స్పెషల్ గా ట్రై చేయాలనుకుంటే టాప్ లో స్కర్ట్ ను ధరించండి. ఆఫీస్ పార్టీ.. అంటే బీచ్ పార్టీ లుక్ కోసం ఇలాంటి డ్రెస్సులు బాగుంటాయి. ఈ లుక్ ను మీరు మరింత స్టైలిష్ గా మార్చుకోవాలంటే.. దీనితో షర్క్ వేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ట్రెండ్ బాగా నడుస్తోంది. దీనిలో మీరు వెల్వెట్ టాప్ ను వేసుకోవచ్చు. దీనివల్ల మీకు పెద్దగా చలిగా అనిపించదు. మార్కెట్లో ఈ రకం దుస్తులు రూ.1000 నుంచి రూ.2000 వరకు దొరుకుతాయి. దీనితో మీరు స్టోన్ వర్క్ ఆభరణాలు, స్మోకీ ఐ మేకప్ వేసుకుంటే బ్యూటిఫుల్ గా కనిపిస్తారు. 
 

44

బాడీకాన్ డ్రెస్

సరికొత్తగా కనిపించాలనుకుంటే ఈ క్రిస్మస్ పార్టీకి మీరు బాడీకాన్ డ్రెస్ ను వేసుకోవచ్చు. ఈ డ్రెస్సులో మీ లుక్ చాలా క్లాసీగా కనిపిస్తుంది. మీరు తెలుపు లేదా ఎరుపు, తెలుపు కలయికతో ఉన్న బాడీకాన్ డ్రెస్సులను కొనొచ్చు. పార్టీకి అనుగుణంగా మీరు కనిపించేలా చేస్తుంది. ఈ రకం దుస్తులు మార్కెట్లో రూ.500 నుంచి రూ.1000 వరకు దొరుకుతాయి. ఈ డ్రెస్సు పైకి మీరు హూప్స్ చెవిపోగులు, ఓపెన్ హెయిర్ స్టైల్స్ లో వెళితే అందంగా కనిపిస్తారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
క్రిస్మస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Heavy Jhumka: ఇలాంటి జుంకాలు పెట్టుకుంటే అందరి కళ్లు మీ వైపే ఉంటాయ్..!
Recommended image2
Jhumka: చీర కట్టుకున్నప్పుడు ఈ జుంకాలు పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది
Recommended image3
Stone Toe Rings: రంగు రంగుల రాళ్ల మెట్టెలు...పాదాలకు మెరిసే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved