MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Woman
  • యోని దురద, చికాకు, నొప్పికి కారణాలు ఇవే..!

యోని దురద, చికాకు, నొప్పికి కారణాలు ఇవే..!

యోనిలో దురద వచ్చే సమస్య చాలా మందిని వేధిస్తుంటుంది. కానీ ఇది ప్రధానంగా పరిశుభ్రత లేకపోవడం వల్లే వస్తుందని నిపుణులు అంటుాన్నుు. దురద అనేది ఒక సాధారణ సమస్య. కానీ కొన్నిసార్లు ఈ దురద విపరీతమైన నొప్పి, వాపు, గాయాలకు కూడా కారణమవుతుంది. అందుకే దీన్ని లైట్ తీసుకోకూడదు.   

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 30 2023, 02:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యోనిలో దురద వచ్చే సమస్య చాలా మందిని వేధిస్తుంటుంది. కానీ ఇది ప్రధానంగా పరిశుభ్రత లేకపోవడం వల్లే వస్తుందని నిపుణులు అంటుాన్నుు. దురద అనేది ఒక సాధారణ సమస్య. కానీ కొన్నిసార్లు ఈ దురద విపరీతమైన నొప్పి, వాపు, గాయాలకు కూడా కారణమవుతుంది. అందుకే దీన్ని లైట్ తీసుకోకూడదు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
vagina

vagina

కానీ చాలా మంది ఆడవారు ఈ సమస్య గురించి బహిరంగంగా మాట్లాడలేకపోతుంటారు. కొంతమంది ఎంత ఇబ్బంది అయినా సరే హాస్పటల్ కు వెళ్లకుండా అలాగే ఉంటారు. ఈ తప్పు వల్లే సమస్య మరింత పెద్దది అవుతుంది. యోనిలో దురద రావడానికి బ్యాక్టీరియా, ఈస్ట్ ఇన్ఫెక్షన్ లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు కూడా కారణం కావొచ్చు. అందుకే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. అసలు యోని దురదకు కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

36
vagina

vagina

దురద లేదా చికాకు కలిగించే విషయాలు

చికాకు కలిగించే రసాయనాలు కూడా యోని దురదకు కారణమవుతాయి. ఇవి అలెర్జీ ప్రతిచర్యకు కారణమవుతాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది యోనిని శుభ్రంగా ఉంచడానికి టీవీలో చూపించే యోని వాష్ లను ఉపయోగిస్తున్నారు. కానీ ప్రొడక్ట్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఉపయోగించడం వల్ల ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని నిపుణులు అంటున్నారు. ఈ యోని వాష్ లు యోని దురదకు కూడా కారణమవుతాయి. వీటితో పాటుగా సబ్బు, బబుల్ బాత్, ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్, ఆరోమాటిక్ టాయిలెట్ పేపర్, సింథటిక్ కోటింగ్ ఉన్న శానిటరీ న్యాప్కిన్లు కూడా దురదకు కారణమవుతాయి.
 

46

ఈస్ట్ ఇన్ఫెక్షన్

యోనిలో సహజ ఈస్ట్ ఉంటుంది. ఇదేం ప్రమాదకరం కాదు. కానీ ఈ ఈస్ట్ ఎక్కువగా పెరిగినప్పుడు అది సంక్రమణకు కారణమవుతుంది. దీనిని యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటారు. దీని వల్ల దురద వస్తుంది. 
 

56


లైంగిక సంక్రమణ వ్యాధి 

శారీరక సంబంధం పెట్టుకునేటప్పుడు సేఫ్టీ పద్ధతులను పాటించకపోవడం వల్ల ఎన్నో రకాల లైంగిక సంక్రమణ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇది యోనిలో దురదకు కూడా కారణమవుతుంది. వీటిలో క్లామిడియా, జననేంద్రియ మొటిమలు, గోనేరియా, జననేంద్రియ హెర్పెస్ వంటి వ్యాధులు ఉన్నాయి. దురదతో పాటుగా ఈ వ్యాధులు ఆకుపచ్చ లేదా పసుపు ఉత్సర్గను కూడా కలిగిస్తాయి. అలాగే మూత్ర విసర్జన చేసేటప్పుడు చికాకుతో పాటుగా నొప్పిని కూడా కలిగిస్తాయి. 
 

66

రుతువిరతి

రుతువిరతి ముగిసిన తర్వాత కూడా యోనిలో దురద వస్తుంది. దీనికి కారణం ఈస్ట్రోజెన్ హార్మోన్ లేకపోవడం. ఇది శ్లేష్మ పొర పొడిబారడానికి కారణమవుతుంది. దీని వల్ల దురద కలుగుతుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved