ఆడవాళ్లకు జుట్టు ఎందుకు రాలుతుందో తెలుసా?
మగవాళ్లు, ఆడవాళ్లు అంటు తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ జుట్టు రాలిపోతుంది. ఇది చాలా కామన్ విషయం. కానీ ఆడవాళ్లకు జుట్టు రాలడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అవేంటంటే?
చాలా కొద్ది మందికి మాత్రమే వెంట్రుకలు పొడుగ్గా, మందంగా ఉంటాయి. కానీ చాలా మందికి మాత్రం జుట్టు పల్చగా, పొట్టిగా ఉంటుంది. దీనికి జుట్టు రాలడమే కారణం. కానీ హెయిర్ ఫాల్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది మహిళలను ప్రభావితం చేస్తోంది. జుట్టు రాలడమనే సమస్య మగవాళ్లకు, ఆడవాళ్లకు సర్వ సాధారణ విషయం. కానీ ఆడవాళ్ల వెంట్రుకలు రాలడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అసలు ఆడవాళ్ల జుట్టు ఊడిపోవడం వెనకున్న అసలు కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జెనెటిక్స్ కారకాలు
ఆడవాళ్లకు జుట్టు రాలడానికి ఆండ్రోజెనెటిక్ అలోపేసియా సర్వ సాధారణ కారణాలలో ఒకటని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది వంశపారంపర్యంగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆడవాళ్లలో చిన్న మొత్తంలో కనిపించే మగ హార్మోన్ ఆండ్రోజెన్ల వల్ల జుట్టు తగ్గుతుంది. ఈ హార్మోన్లు జుట్టు పెరుగుదలను తగ్గిస్తాయి.
హార్మోన్ల మార్పులు
హార్మోన్ల మార్పుల వల్ల కూడా ఆడవాళ్ల జుట్టు విపరీతంగా రాలుతుంది. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పిసిఒఎస్), ప్రెగ్నెన్సీ, రుతువిరతి, థైరాయిడ్ రుగ్మతలు వంటివి అన్నీ హార్మోన్ల సమతుల్యతకు ఆటంకం కలిగిస్తాయి. అలాగే వెంట్రుకలు రాలడానికి దారితీస్తాయి.
పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్ల స్థాయిలు తగ్గడం వల్ల కూడా జుట్టు రాలుతుందని నిపుణులు చెబుతున్నారు. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఉన్నవారికి కూడా జుట్టు బాగా రాలుతుంది. ఇది హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుంది.
hair falling
ఒత్తిడి
ఒత్తిడి కూడా ఆడవాళ్ల జుట్టు రాలడానికి దారితీస్తుంది. టెలోజెన్ ఎఫ్లూవియం వంటి సమస్యలు కూడా జుట్టు రాలడానికి దారితీస్తాయి. ఇది మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. ఒత్తిడి బాగా పెరిగితే జుట్టు చాలా రాలుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడే కాకుండా ఇతర కారణాలు కూడా జుట్టు రాలడానికి దారితీస్తాయి.
మందులు, చికిత్సలు
కొన్ని రకాల మందుల దుష్ప్రభావం వల్ల జుట్టు రాలుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కీమోథెరపీ మందులు హెయిర్ ఫాల్ కు దారితీస్తాయని నిపుణులు అంటున్నారు. కానీ అధిక రక్తపోటు, యాంగ్జైటీ, గర్భనిరోధకాలతో పాటుగా ఇతర మందులు కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి.