Hair Care: ఆముదంలో ఇవి కలిపి రాస్తే...జుట్టు స్మూత్ గా పట్టుకుచ్చులా మారడం పక్కా..!
Hair Care: ఆముదం జుట్టును రిపేర్ చేయడానికి చాలా శక్తివంతంగా పని చేస్తుంది. దానిలో ఉండే పోషకాలు... జుట్టు రాలిపోవడం, జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం లాంటి సమస్యలను తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. దీని వల్ల సహజంగా జుట్టు మెరుస్తుంది.

hair care
ఈ రోజుల్లో జుట్టు కి ఉపయోగించడానికి మార్కెట్లో చాలా రకాల నూనెలు ఉన్నాయి. కానీ, పూర్వం అమ్మమ్మల కాలంలో ఎక్కువగా ఆముదం మాత్రమే వాడేవారు. ఆ ఆముదం కారణంగానే.. వాళ్ల జుట్టు అంత అందంగా ఉండేది. కానీ.. ఆముదం చాలా జిడ్డుగా ఉంటుందని.. ఈ కాలం అమ్మాయిలు పెద్దగా ఇష్టపడటం లేదు. అయితే.... అచ్చంగా ఆముదం కాకుండా.. అందులో మరికొన్నింటిని కలిపి జుట్టుకు రాస్తే.. మీ జుట్టు అందంగా మారుతుంది.
ఆముదంలో ఏం కలిపి జుట్టుకు రాయాలి..?
1.కొబ్బరి నూనె..
ఆముదం చాలా మందంగా ఉంటుంది. దానిలో కొబ్బరి నూనె కలపడం వల్ల కాస్త పలచగా మారుతుంది. ఈ రెండూ కలిపి జుట్టుకు రాయాలి. కొబ్బరి నూనెలో ఉండే లౌరిక్ యాసిడ్ జుట్టును కుదుళ్ల నుంచి బలపరుస్తుంది. వారానికి రెండు సార్లు ఆముదం, కొబ్బరినూనె సమపాళ్లలో కలిపి కొద్దిగా వేడి చేసి తలకు మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. చాలా తక్కువ సమయంలో జుట్టు పెరగడానికి కూడా హెల్ప్ చేస్తుంది.
2.ఉల్లిపాయ రసం...
ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు రాలిపోవడాన్ని తగ్గించి, కొత్త హెయిర్ ఫాలికల్స్ ను ఉత్తేజపరుస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఆముదం తీసుకొని, దానిలో ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసం కలిపి తలకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత... తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. రెగ్యులర్ గా ఇలా చేయడం వల్ల జుట్టు చాలా వేగంగా పెరుగుతుంది.
3.కలబంద జెల్....
కలబందలో విటమిన్లు, ఎంజైమ్ లు పుష్కలంగా ఉంటాయి. ఆ కలబంద జెల్ ని ఆముదంలో కలిపి జుట్టుకు రాసి మంచిగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మెత్తగా, కాంతివంతంగా మారుతుంది. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.
4. విటమిన్ E ఆయిల్‌తో కలిపితే
విటమిన్ E తల చర్మానికి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది రక్తప్రసరణను మెరుగుపరచి జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల ఆముదంలో రెండు విటమిన్ E క్యాప్సూల్స్ లోపలి ద్రవాన్ని కలిపి తలకు మర్దనా చేయండి. ఇది జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. జుట్టు చిట్లిపోయే సమస్య తగ్గుతుంది.
5.మెంతులు...
మెంతుల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హెయిర్ ఫాల్‌ని తగ్గించి, తల చర్మాన్ని శుభ్రం చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఆముదంలో ఒక టేబుల్ స్పూన్ మెంతుల పొడి వేసి కలిపి, రాత్రంతా ఉంచి, మరుసటి రోజు రాసుకుని అరగంట తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు అందంగా మారుతుంది.
ఆముదం వాడటం వల్ల కలిగే లాభాలు...
ఆముదం రెగ్యులర్ గా వాడటం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. కొత్త జుట్టు పెరగడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మీ హెయిర్ మెత్తగా, మెరిసేలా చేస్తుంది.
ఆముదం సహజమైన నూనె అయినందున దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. క్రమంగా వాడడం వల్ల జుట్టు సహజ కాంతిని తిరిగి పొందుతుంది. అందుకే, రసాయన పదార్థాలతో నిండిన ఉత్పత్తుల కన్నా, ఆముదాన్ని సహజ పద్ధతిలో వాడటం ద్వారా ఆరోగ్యకరమైన, అందమైన జుట్టు పొందవచ్చు.