గాజులు అందానికా? ఆరోగ్యానికా?
హిందూమతం ప్రకారం.. పెళ్లైనా మహిళలు గాజులు ధరించడం ఆనవాయితీ. పురాతన కాలం నుంచి.. మహిళలు రాగి, వెండి, బంగారం, గాజు వంటి వివిధ లోహాలతో చేసిన గాజులను ధరిస్తూ వస్తున్నారు. కానీ మహిళలు గాజులు ధరించడానికి ఉన్న శాస్త్రీయ కారణమేంటో తెలుసా?
గాజులు కేవలం అందానికి సంబంధించిన వస్తువుగానే చూస్తారు చాలా మంది. కానీ ఇది అందానికి సంబంధించింది కాదు. ఇది మన సంప్రదాయం. సంస్కృతిలో ఒక భాగం. గాజులను వేసుకోవడం వల్ల మహిళలు అందంగా కనిపించడమే కాకుండా అపారమైన ప్రయోజనాలను కూడా పొందుతారు. గాజులు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
Bangles
రక్తప్రసరణ
ఆడవారు చేతులకు గాజులు వేసుకోవడం వల్ల మణికట్టు ప్రాంతానికి రక్తప్రసరణ పెరుగుతుంది. అలాగే శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. మణికట్టు ప్రాంతంలో ఘర్షణ రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. అది వీరిని మరింత ఆరోగ్యంగా ఉంచుతుంది.
గర్భిణీ స్త్రీలకు మంచిది
గర్భిణులు రెండు చేతులకు గాజులను ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే గాజుల శబ్దం గర్భంలో ఉన్న బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు ఇది పిల్లల వినికిడిని కూడా మెరుగుపరుస్తుంది. చేతులకు గాజులు వేసుకోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. గాజుల శబ్దం.. ఇది తల్లి, పుట్టబోయే బిడ్డపై ఒత్తిడిని తగ్గిస్తుంది.
ప్రయోజనాలు
గాజులను ముందుకు, వెనుకకు కదిలించడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో శక్తి పరిమాణం కూడా పెరుగుతుంది. అలాగే ఒత్తిడి, అలసట, నొప్పిని తట్టుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. మట్టి గాజులు శరీరంలోని అధిక వేడిని తొలగించడానికి సహాయపడతాయి.
మీకు తెలుసా? గాజులు వాతావరణం నుంచి మంచిని, స్వచ్ఛతను గ్రహిస్తాయి. గాజులు వేసుకున్న వ్యక్తికి సహజ వాతావరణంలో ఉండటానికి శక్తిని ఇస్తుంది. ఇది చుట్టుపక్కల వారి మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది.
రెండు రకాల గాజులు ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. గాజులు ఎక్కువగా ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. ఆకుపచ్చ గాజులను సాధారణంగా దక్షిణ భారత రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలలో ఎక్కువగా ధరిస్తారు. పంజాబ్, యూపీ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఎరుపు రంగును విరివిగా వాడుతారు. ఆకుపచ్చ సాధారణంగా ఆధ్యాత్మికత, శాంతిని సూచిస్తుంది.
కాగా చెడును నాశనం చేసే శక్తి ఎరుపునకు ఉందని నమ్ముతారు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. గాజులు వేసుకునే మహిళలు మరింత భావోద్వేగానికి లోనవుతారు. వీళ్లు ఎప్పుడూ సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు.