ఇది రాత్రి రాస్తే.. ఉదయానికి ముఖం మెరిసిపోతుంది.. ఎలానో తెలుసా?
బొప్పాయిలో..విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది.. చర్మాన్ని అందంగా మార్చడంలో సహాయపడుతుంది.
అందంగా కనిపించాలనే కోరిక లేని వాళ్లు ఎవరు ఉంటారు..? దానికోసం మార్కెట్లో దొరికే చాలా రకాల క్రీములు, ఆయిల్స్ వాడేస్తూ ఉంటాం. వాటి వల్ల కూడా ఫలితం రావచ్చు. కానీ.. వెంటనే కనపడకపోవచ్చు. కానీ.. మనం... రాత్రికి రాత్రే.. మెరిసిపోయేలా చేసే బెస్ట్ చిట్కా ఒకటి ఉంది. మీరు.. ఇది కనుక రాత్రిపూట రాస్తే.. ఉదయానికి.. ఫేస్ మెరిసిపోవడం ఖాయం. మరి అదేంటో.. దానిని ముఖానికి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం...
ఆరోగ్యం కోసం మనలో చాలా మంది రెగ్యులర్ గా బొప్పాయి తింటూ ఉంటారు. అదే.. బొప్పాయిని మనం తినడమే కాకుండా.. ఒక చిన్న ముక్క ముఖానికి రాస్తే.. ఫేషియల్ చేసినట్లు ముఖం మెరిసిపోతుందని మీకు తెలుసా? ఎందుకంటే.. బొప్పాయిలో..విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది.. చర్మాన్ని అందంగా మార్చడంలో సహాయపడుతుంది.
papaya face packs
బొప్పాయిలో విటమిన్ సి తో పాటు.. పపైన్ అనే ఒక సమ్మేళనం ఉంటుంది. ఇది.. మన చర్మాన్ని సహజంగా ఎక్స్ఫోలియంట్ చేయడానికి సహాయపడుతుంది. దీని వల్ల.. మన ముఖం చాలా స్మూత్ గా మారుతుంది. అంతేకాదు.. చర్మం సహజంగా మెరిసిపోవడంతో పాటు... ముఖం పై వయసు రిత్యా వచ్చే ముడతలను కూడా పూర్తిగా తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.
papaya face pack
కాలంతో సంబంధం లేకుండా మన బొప్పాయి లభిస్తుంది. ఆ బొప్పాయిని మనం ముఖానికి అప్లై చేయడం వల్ల.. చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. బొప్పాయిలో విటమిన్ ఏ, విటమిన్ ఈ ఉంటాయి. ఈ రెండూ మన స్కిన్ డ్రై గా.. వాడిపోయినట్లుగా కాకుండా.. చక్కగా తేమగా ఉండేలా చేయడంలో , మంచిగా గ్లోగా కనిపించడానికి సహాయం చేస్తాయి.
చాలా మంది రంగు కోసం తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాటి కోసం ఏవేవో క్రీములు వాడతారు. కానీ.. బొప్పాయి.. మన స్కిన్ కలర్ ని లైటెన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ముఖంపై మొటిమలు, వాటి తాలుకా మచ్చలను కూడా కనిపించకుండా చేయగలవు.
చాలా మందికి ఎండ తగిలినప్పుడు.. స్కిన్ రెడ్ గా మారడం, ఇరిటేషన్, దురద లాంటివి వస్తాయి కానీ.. బొప్పాయి గుజ్జు రాస్తే.. ఆ సమస్య వెంటనే తగ్గిపోతుంది.
అంతేనా.. రెగ్యులర్ గా ముఖానికి బొప్పాయి గుజ్జు రాయడం వల్ల మీ వయసు పెరిగినా.. ఆ ఛాయలు మీ ముఖాన కనిపించకుండా చేస్తాయి. యవ్వనంగా కనిపించడానికి సహాయం చేస్తాయి. ఎన్ని క్రీములు రాసినా రాని ఫలితం మీకు ఈ బొప్పాయి ఇవ్వగలదు. రెగ్యులర్ గా రాయడం వల్ల.. అసలు మొటిమలు రాకుండా కూడా కంట్రోల్ చేయగలవు.