21 తర్వాత పెళ్లి చేసుకుంటే.. ఎన్ని లాభాలున్నాయో తెలుసా?
18ఏళ్లకు పెళ్లి అంటే.. దాదాపు.. చాలా మంది అమ్మాయిల చదువు కూడా పూర్తి అవ్వదు. దాని వల్ల చాలా మంది.. వారి తర్వాత కెరీర్ ని కొనసాగించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది
మన దేశంలో గతంలో.. ఆడ పిల్లలకు 18ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే పెళ్లి చేయాలి అనే రూల్ ఉండేది. కానీ... ఇప్పుడు ఈ రూల్ ని మర్చేశారు. ఇప్పుడు మన దేశంలో పెళ్లి చేయాలి అంటే ఆడ పిల్లలకు కచ్చితంగా 21ఏళ్లు రావాల్సిందే. 21ఏళ్లు నిండిన మేజర్లకు మాత్రమే.. పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. అయితే.. ఈ నియమంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ రూల్ సంగతి పక్కన పెడితే.. అసలు ఆడపిల్ల 21ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఓసారి చూద్దాం...।
ఆడపిల్లలకు తొందరగా పెళ్లి చేయడం వల్ల.. పిల్లలను కనే విషయంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అబార్షన్లు అవ్వడం.. లేదా ఇంకేదైనా సమస్యలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. కానీ 21ఏళ్ల తర్వాత చేసుకోవడం వల్ల.. ఆ తర్వాత సంతానం కలిగే సమయంలోనూ ఈ సమస్యలు వచ్చే అవకాశం చాలా అంటే.. చాలా తక్కువగా ఉంటుంది.
bride
18ఏళ్లకు పెళ్లి అంటే.. దాదాపు.. చాలా మంది అమ్మాయిల చదువు కూడా పూర్తి అవ్వదు. దాని వల్ల చాలా మంది.. వారి తర్వాత కెరీర్ ని కొనసాగించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అలా కాకుండా.. 21 అంటే.. దాదాపు చదువులు పూర్తౌతాయి. వారు కోరుకున్న ఉద్యోగాన్ని వెతుక్కునే అవకాశం కూడా ఉంటుంది.
అంతేకాదు.., 21 సంవత్సరాలు వచ్చాయి అంటే.. దాదాపు మెచ్యూరిటీ లెవల్స్ బాగా పెరిగిపోతాయి. ఎలాంటి పరిస్థితిని అయినా అర్థం చేసుకోగలరు. కుటుంబాన్ని చక్కగా చూసుకోగల సామర్థ్యం కూడా పెరుగుతుంది.
అంతేకాదు.. కుటుంబాన్ని ఎలా ఆర్థికంగా చక్కపెట్టగలం అనే విషయాన్ని కూడా ఆ వయసుకు కాస్త అర్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలపై అవగాహన పెరుగుతుంది.
టీనేజ్ లో పెళ్లి చేయడం వల్ల.. అవి లేవు.. ఇవి లేవు.. అంటూ చాలా డిప్రెషన్ కి గురౌతుంటారు. కానీ.. మెచ్యూరిటీ పెరగడం వల్ల.. అలా కాకుండా.. నిజం వారికి ఏది కావాలి అనే క్లారిటీ వస్తుంది.
చిన్న వయసులో పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల.. పెళ్లికి అసలైన అర్థం తెలుసుకోలేరు. చిన్న తనంలోనే పిల్లలు.. కుటుంబ బాధ్యతలు.. జీవితంపై విరక్తి కలిగిస్తాయి. అలా కాకుండా.. 21 తర్వాత పెళ్లి చేసుకోవడం వల్ల ఆ సమస్య కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.