రాత్రి పడుకునే ముందు జుట్టు దువ్వితే ఏమౌతుంది?
రాత్రిపూట జుట్టు దువ్వుకుంటే..మరింత ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? ఆ ప్రయోజనాలేంటో చూద్దాం..
combing your hair
జుట్టు అందంగా, ఒత్తుగా ఉండాలని, తమ జుట్టు ఊడిపోకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం ఎవరికి తోచిన ప్రయత్నాలు వాళ్లు చేస్తూ ఉంటారు. ఇక.. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే తమ జుట్టును అందంగా, నీట్ గా దువ్వుకుంటారు. కానీ, ఎప్పుడైనా రాత్రి దువ్వుకున్నారా? రాత్రి పడుకునే ముందు ఎవరు చూస్తారు అని లైట్ తీసుకుంటాం. కానీ.. రాత్రిపూట జుట్టు దువ్వుకుంటే..మరింత ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? ఆ ప్రయోజనాలేంటో చూద్దాం..
నిజానికి మనలో చాలా మంది ఇంట్లో నుంచి బయటకు వెళ్లే సమయంలో మాత్రమే జుట్టు దువ్వుకుంటూ ఉంటారు. కానీ, రాత్రి పడుకునేముందు మాత్రం జుట్టు దువ్వుకోవాలట. దానివల్ల.. మీ జుట్టు అందంగా పెరుగుతుందట.
రాత్రిపూట జుట్టు దువ్వుకోవడం వల్ల తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుందట. ఇలా రక్త ప్రసరణ బాగా జరగడం వల్ల జుట్టు స్కాల్ప్ హెల్దీగా మారుతుంది. స్పాల్ప్ ఆరోగ్యంగా ఉంటే.. జుట్టు బలంగా మారుతుంది.
hair
ఈరోజుల్లో ఎక్కువ మంది హెయిర్ లూస్ గా వదిలేస్తున్నారు. అల్లుకునేవాళ్లు తక్కువ. కానీ అలా రోజంతా జుట్టు లూస్ గా వదిలేయడం వల్ల దుమ్మంతా హెయిర్ కి పట్టేస్తుంది. స్కాల్ప్ అలాంటి సమయంలో రాత్రి జుట్టు దవ్వడం వల్ల దుమ్ము పోయే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా జుట్టు హెల్దీగా ఉంటుంది.
రాత్రి పడుకునే ముందు జుట్టు దువ్వుకోవడం వల్ల జుట్టు ఎక్కువగా చిక్కులు పడకుండా ఉంటుంది. దాని వల్ల మరుసటి రోజు జుట్టు దువ్వినప్పుడు ఎక్కువగా ఊడిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. జుట్టు కూడా రూట్స్ నుంచి హెల్దీగా మారుతుంది.
Handle hair gently
మీకు తలలో చుండ్రు ఉంటే కచ్చితంగా రాత్రిపూట జుట్టు దువ్వాల్సిందే. అలా దువ్వడం వల్ల కూడా చుండ్రు తొందరగా వదిలే అవకాశం ఉంటుంది. దురద సమస్య కూడా ఉండదు.
రాత్రి పడుకునే ముందు జుట్టు దువ్వడం వల్ల.. జుట్టు మరింత మెరుస్తూ కనపడుతుంది. జుట్టు ఎక్కువగా చిక్కుళ్లు ఉండవు. రాత్రి దువ్వడం వల్ల… మళ్లీ ఉదయం దువ్వుకోవడం ఈజీగా ఉంటుంది.