బెల్లం ఒక్క వంటకే.. ముఖానికి కూడా వాడొచ్చు.. దేనికోసమంటే?
బెల్లంతో తీరొక్క వంటలు చేసి తింటుంటాం. నిజానికి చాలా మంది బెల్లాన్ని ఒక్క వంటకు మాత్రమే ఉపయోగిస్తారు. ఇది ఈ ఒక్క దానికి మాత్రమే పనికొస్తుందని అనుకుంటుంటారు. కానీ బెల్లంతో మనం ఎన్నో చర్మ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు తెలుసా?
jaggery
ప్రతి ఒక్క అమ్మాయి అందంగా కనిపించాలని ఖచ్చితంగా అనుకుంటుంది. ఇందుకోసం ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ ను కూడా వాడుతుంటారు. కానీ కెమికల్స్ ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్ మన అందాన్ని పాడు చేస్తాయి. నేచురల్ అందాన్ని తగ్గిస్తాయి. కానీ మీరు వీటికి బదులుగా హోం మేడ్ ప్రొడక్ట్స్ ను వాడితే గనుక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ పడవు.
మనం కేవలం వంటలకు మాత్రమే ఉపయోగించే బెల్లాన్ని ఉపయోగించి అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. నిపుణుల ప్రకారం.. బెల్లం ఎన్నో చర్మ సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీకు చర్మ సమస్యలు ఉంటే గనుక ఎలాంటి నష్టాన్ని కలిగించని బెల్లాన్ని వాడండి.
బెల్లం మన చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతగానో సహాయపడుతుంది. దీన్ని మన ముఖానికి అప్లై చేసి.. మన చర్మం ఆరోగ్యంగా మెరిసేలా చేయొచ్చు. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బెల్లం వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. అలాగే ముఖంపై ఉండే నల్ల మచ్చలను, మొటిమలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.
మీకు తెలుసా? బెల్లంలో మాయిశ్చరైజింగ్ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది మన చర్మాన్ని ఎప్పుడూ హైడ్రేట్ గా ఉంచుతుంది. అంతేకాకుండా బెల్లం మన ముఖంపై ముడతలను, గీతలను తగ్గిస్తుంది. అంతేకాకుండా బెల్లం.. ముఖం పొడిబారడం, దురదను సమస్యలను కూడా తగ్గిస్తుంది. అందుకే ముఖం అందంగా కనిపించడానికి బెల్లం ఫేస్ ప్యాక్ ను వాడాలి అంటారు. మరి ఈ ప్యాక్ ఎలా తయారుచేయాలంటే?
బెల్లం, శనగపిండి
బెల్లం, శెనగపిండి ఫేస్ ప్యాక్ ను తయారుచేయడానికి ఒక చెంచా బెల్లం తీసుకుని అందులో ఒక చెంచా శెనగపిండి, పాలు బాగా మిక్స్ చేసి పేస్ట్ లా తయారుచేయండి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి.
బెల్లం, తేనె, నిమ్మరసం
ఒక చెంచా బెల్లం తీసుకుని అందులో ఒక చెంచా తేనె, నిమ్మరసం వేసి కలపండి. ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేయండి. 5 నిముషాలు అలాగే ఉంచి కడిగేసుకుంటే సరిపోతుంది.