బాడీ లోషన్ ను రోజూ రాసుకుంటే ఏమౌతుందో తెలుసా?
కొంతమంది బాడీ లోషన్లను రోజూ ఉపయోగిస్తే.. మరికొంతమంది అస్సలు ఉపయోగించరు. కానీ దీన్ని ఉపయోగించడం వల్ల మీరు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో లాభాలను పొందుతారు.
బాడీ లోషన్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. బాడీ లోషన్ అనేది మన స్కిన్ కేర్ లో ఒక ముఖ్యమైన భాగం. దీనిని వాడితే మన చర్మానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కానీ ఇప్పటికీ చాలా మంది దీనిని అస్సలు వాడరు. కానీ మీరు గనుక దీనిని ఉపయోగిస్తే లెక్కలేనన్ని ప్రయోజనాలను పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చర్మం హైడ్రేట్ గా ఉంటుంది
కొంతమంది చర్మం ఎప్పుడూ డీహైడ్రేట్ గానే ఉంటుంది. ఎందుకంటే ఎన్నో పర్యావరణ కారకాల వల్ల మన చర్మం తేమను కోల్పోతుంది. దీనివల్ల చర్మం పొడిబారుతుంది. మీ చర్మం తిరిగి హైడ్రేట్ కావాలంటే మీరు పుష్కలంగా నీళ్లను తాగడంతో పాటుగా బాడీ లోషన్ ను ఖచ్చితంగా ఉపయోగించాలని నిపుణులు చెప్తారు. బాడీ లోషన్ పొడి చర్మానికి మంచి మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని తేమగా చేసి, ఆరోగ్యంగా ఉంచుతుంది.
చర్మం మృదువుగా ఉంటుంది
మీరు గమనించారో లేదో కానీ బాడీ లోషన్ ను వాడని వారి చర్మం ఎంతో కఠినంగా ఉంటుంది. ఇలాంటివారు తప్పకుండా బాడీ లోషన్స్ ను వాడాలి. ఎందుకంటే బాడీ లోషన్ కఠినమైన చర్మాన్ని సాఫ్ట్ గా చేస్తుంది. అలాగే దీనిని రెగ్యులర్ గా వాడితే మీ చర్మం తేమగా, మృదువుగా ఉంటుంది.
చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది
బాడీ లోషన్స్ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే ఇది చర్మ స్థితిస్థాపకతను పెంచుతుంది. బాడీ లోషన్లను ఉపయోగించడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. అయితే మీరు ఏదైనా హెర్బల్ లోషన్ ను గనుక వాడితే రఫ్ ప్యాచెస్ ను కూడా దీంతో సులువుగా తగ్గించుకోవచ్చు.
Body lotion
వృద్ధాప్య లక్షణాలు తగ్గుతాయి
యాంటీ ఏజింగ్ పదార్థాలున్న బాడీ లోషన్ ను ఉపయోగించే చర్మంపై ముడతలు, సన్నని గీతలు, పిగ్మెంటేషన్ వంటి వృద్ధాప్య సంకేతాలు కూడా తొందరగా తగ్గిపోతాయి. అలాగే మీ చర్మం యంగ్ గా కనిపించడం ప్రారంభిస్తుంది. అయితే మీ చర్మం పొడిబారడం, మొటిమలు అవ్వడం, తామర వంటి సమస్యలు ఉంటే.. ఈ సమస్యలను తగ్గించడానికి సహాయపడే బాడీ లోషన్ ను ఉపయోగించండి.
మంచి సువాసన
బాడీ లోషన్ కూడా మంచి వాసన వస్తుంటుంది. మంచి సువాసనతో కూడిన మృదువైన, క్రీమీ బాడీ లోషన్ మీ చర్మానికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. దీన్ని వాడటం వల్ల మీ బాడీ నుంచి కూడా మంచి వాసన వస్తుంది. ఇది మీకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తుంది.