చలికాలంలో అలోవెరా... అందాన్ని రెట్టింపు చేస్తుంది...!
అవి చర్మం బయటి పొరను తాత్కాలికంగా తేమ అందిస్తాయి. కానీ ఈ ప్రభావం తాత్కాలికమైనది. వాటి స్థానంలో అలోవెరాని ఉపయోగించాలి.
అందాన్ని రెట్టింపు చేయడంలో అలోవెరా( కలబంద) కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో దీనిని ఉపయోగించడం వల్ల... అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కలబంద సహజంగా మాయిశ్చరైజర్ లా పని చేస్తుంది. ఇది పొడి చర్మానికి ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది.
చలికాలంలో చల్లటి గాలి వల్ల చర్మం తేమను కోల్పోతుంది. దీని వలన చర్మం డల్ గా, డ్రైగా మారుతుంది. చలికాలంలో మీ ముఖంలో గ్లో మెయింటైన్ చేయడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా ఉంచుకోవడానికి ఈ రూల్స్ పాటించండి.
రసాయన మాయిశ్చరైజర్లు తాత్కాలికంగా మాత్రమే పరిష్కారం చూపిస్తాయి. అవి చర్మం బయటి పొరను తాత్కాలికంగా తేమ అందిస్తాయి. కానీ ఈ ప్రభావం తాత్కాలికమైనది. వాటి స్థానంలో అలోవెరాని ఉపయోగించాలి.
అలోవెరా జెల్: చర్మ సమస్యలను (Skin problems) తగ్గించడానికి, చర్మానికి మంచి నిగారింపును అందించడానికి అలోవెరా జెల్ ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. రాత్రి పడుకునే ముందు ముఖానికి అలోవెరా జెల్ (Aloevera gel) ను అప్లై చేసుకుని ఉదయాన్నే ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు ప్రయత్నిస్తే చర్మం నలుపుదనం తగ్గి చర్మానికి మంచినిగారింపు అందుతుంది.
అలోవేరా జెల్, విటమిన్ ఇ క్యాప్సిల్: ఒక కప్పులో అలోవెరా జెల్ (Aloevera gel), విటమిన్ ఇ క్యాప్సిల్ (Vitamin E capsule) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంగు మచ్చలపై అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకుంటే మంగు మచ్చలు తగ్గడంతో పాటు మొటిమలు, నల్లటి వలయాలు వంటి చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.
అలోవెరా లిక్విడ్ సోప్ మార్కెట్లో అందుబాటులో ఉంటోంది. ఇది చర్మం తేమను కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనిని కుటుంబంలోని అందరు సభ్యులు ఉపయోగించవచ్చు. ఇది చక్కని క్లెన్సర్ లా ఉపయోగపడుతుంది. ఆర్గాన్ ఆయిల్ విటమిన్ E,సహజ కొవ్వు ఆమ్లాలను ఆరోగ్యవంతమైన చర్మానికి ఉపయోగపడతాయి. కలబంద చర్మాన్ని శాంతపరుస్తుంది. మృదువుగా చేస్తుంది.
అలో బాడీ వాష్ అనేది తేలికపాటి, ప్రభావవంతమైన క్లెన్సర్, ఇది చర్మాన్ని కూడా కండిషన్ చేస్తుంది. అలో బాడీ వాష్ మీ చర్మాన్ని ఉత్తమమైన ప్రకృతితో పోషించి శుభ్రపరుస్తుంది.
మొటిమల నివారణ కోసం: ఒక కప్పులో కొద్దిగా టూత్ పేస్ట్ (Toothpaste) ను తీసుకోవాలి. దానికి సమానంగా అలోవెరా జెల్ (Aloevera gel) ను కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు మొటిమల మీద అప్లై చేసుకొని రాత్రంతా అలాగే ఉండనివ్వాలి. తర్వాత ఉదయం గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
కలబంద: కలబంద (Aloevera) కొలాజిన్ (Collagen) నిర్మాణాన్ని మెరుగుపరిచి వేగంగా నల్ల మచ్చలను నయం చేయడానికి సహాయపడుతుంది. కనుక కలబంద గుజ్జును నాలుకపై నల్ల మచ్చలు ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకుంటే నల్లమచ్చలు క్రమంగా తగ్గే అవకాశం. కలబంద జ్యూస్ తాగినా మంచి ఫలితం ఉంటుంది.
కలబంద మన చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చర్మంపై ఉన్న చనిపోయిన కణాలను తొలగిస్తుంది. గ్లోను పెంచుతుంది. చర్మం తేమగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జులో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ రంగు మారకుండా చూస్తుంది. ఇందుకోసం కలబంద గుజ్జును తీసుకుని ముఖానికి మెడకు అప్లై చేయాలి. కావాలనుకుంటే దీన్ని చేతులకు కూడా పెట్టొచ్చు. ఒక పది నిమిషాల తర్వాత నీటితో కడిగేస్తే చర్మం అందంగా మెరిసిపోతుంది.
జుట్టు ఆరోగ్యానికి కూడా కలబంద మేలు చేస్తుంది.
కలబంద, తేనె, కొబ్బరి నూనెతో చేసిన ప్యాక్ జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ హెయిర్ ప్యాక్ జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. ఇందుకోసం ముందుగా కలబంద గుజ్జును తీసుకుని అందులో తేనె, కొబ్బరి నూనె వేసి బాగా కలపండి. ఈ ప్యాక్ ను మాడు నుంచి జుట్టు చివర్ల వరకు అప్లై చేయండి. ఒక 20 నిమిషాల తర్వాత షాంపూతో శుభ్రం చేయండి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు త్వరగా పెరుగుతుంది.