Beauty Tips: ముల్తానీ మట్టిని ఇలా పెట్టారంటే మీ ముఖం ఎంత అందంగా కనిపిస్తుందో..!
Beauty Tips:ముల్తానీ మట్టి చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది ముఖంపై మొటిమల మచ్చలను పూర్తిగా పోగొట్టి.. చర్మం నుంచి అదనపు నూనెను తొలగిస్తుంది. అలాగే నల్ల మచ్చలను కూడా పోగొడుతుంది.
multani mitti
సౌందర్య సంరక్షణకు సహజసిద్ధమైన పద్దతులనే ఉపయోగించడం మంచిదంటారు నిపుణులు. ఎందుకంటే వీటిలో ఎలాంటి కెమికల్స్ ఉండవు. వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలాంటి సహజసిద్దమైన బ్యూటీ ప్రొడక్ట్స్ లో ముల్తానీ మట్టి ఒకటి. ముల్తానీ మట్టి మొటిమల మచ్చలను తగ్గించడానికి, చర్మం నుంచి అదనపు నూనెను తొలగించడానికి, నల్ల మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది. ముల్తానీ మిట్టిని చర్మానికి అప్లై చేయడం వల్ల సన్ టాన్ తొలగిపోయి నలుపు, ముడతలు తగ్గుతాయి. మరి ముల్తానీ మట్టితో ఫేస్ ప్యాక్ ను ఎలా తయారుచేసుకోవాలో ఇప్పడు తెలుసుకుందాం పదండి.
1. కావల్సిన పదార్థాలు
ముల్తానీ మిట్టి - 2 టీస్పూన్లు
రోజ్ వాటర్ - 2 టీస్పూన్లు
ఎలా తయారు చేయాలి..
ముల్తానీ మట్టిని, రోజ్ వాటర్ ను బాగా కలపండి. తర్వాత ఈ ప్యాక్ ను ముఖానికి, మెడకు సమానంగా అప్లై చేయాండి. ఈ ఫేస్ ప్యాక్ ఆరిపోయే వరకు అలాగే ఉంచుకోవాలి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ ప్యాక్ ను వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేయొచ్చు. ఈ ప్యాక్ చర్మం పీహెచ్ స్థాయిని సమతుల్యం చేయడానికి, అదనపు నూనెను తొలగించడానికి సహాయపడుతుంది.
2. కావల్సిన పదార్థాలు...
టొమాటో జ్యూస్ - 1 టేబుల్ స్పూన్
ముల్తానీ మిట్టి - 1 టేబుల్ స్పూన్
గంధం పొడి - 1/2 టీస్పూన్
పసుపు - 1/2 టీస్పూన్
పసుపు - 1/2 టీస్పూన్
Image: Getty Images
ఎలా తయారు చేయాలి..
ఈ నాలుగు పదార్థాలను బాగా కలిపి పేస్ట్ లా తయారుచేయండి. ఆ తర్వాత ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి రాసుకుని కాసేపు అలాగే ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయండి. ఈ ప్యాక్ ను వారానికి రెండు లేదా మూడు సార్లు వేసుకోవచ్చు. ముఖంపై ముడతలను తగ్గించడానికి ఈ ప్యాక్ ఎఫెక్టీవ్ గా ఉపయోగపడుతుంది.