చర్మం మృదువుగా మెరవాలా.. ఇటాలియన్స్ బ్యూటీ టిప్స్ ఫాలో కావాల్సిందే..!
చర్మం ప్రతిరోజూ తేమగా ఉండేందుకు మనం మాయిశ్చరైజర్ రాసుకుంటాం. అయితే... వాళ్లు మాయిశ్చరైజర్ గా ఎలాంటి క్రీములు వాడకుండా ఆలివ్ ఆయిల్ వాడతారట. ఆలివ్ ఆయిల్ ని వారు గోల్డ్ ఆఫ్ గాడ్ గా భావిస్తారట.
చర్మం అందంగా మెరిసిపోవాలని అందరూ కోరుకుంటారు. అందుకే ఏవేవో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే.. కొన్ని రకాల బ్యూటీ టీప్స్ ఫాలో అయితే.. చర్మం మృదువుగా మారుతుందట. అవేంటో ఇప్పుడు చూద్దాం.
బయట క్రీమ్ లు, మేకప్ లు లేకుండా.. సహజంగా అందంగా కనిపించేందుకు ఇటాలియన్ బ్యూటీ సీక్రెట్స్ ఫాలో కావాలట. ఇటాలియన్స్.. తమ చర్మాన్ని అందంగా ఉంచేందుకు చాలా పద్దతులు అనుసరిస్తారట. అక్కడ అందరి చర్మం చాలా మృదువుగా.. సహజమైన అందంతో కలిసి ఉంటుందట. మరి వాళ్లు అంత అందంగా ఉండటానికి ఏం చేస్తారో చూద్దాం..
చర్మం ప్రతిరోజూ తేమగా ఉండేందుకు మనం మాయిశ్చరైజర్ రాసుకుంటాం. అయితే... వాళ్లు మాయిశ్చరైజర్ గా ఎలాంటి క్రీములు వాడకుండా ఆలివ్ ఆయిల్ వాడతారట. ఆలివ్ ఆయిల్ ని వారు గోల్డ్ ఆఫ్ గాడ్ గా భావిస్తారట.
ఈ ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఏజినింగ్ కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి.. ప్రతిరోజూ ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేసుకోవాలట. అలా ప్రతిరోజూ చేస్తే.. ముఖంలో గ్లో పెరుగుతుందట.
ఇక ఇటాలియన్స్.. ఫేస్ స్క్రబ్బర్ గా స్ట్రాబెర్రీని ఉపయోగిస్తారు. ఇది చర్మం మృదువుగా, అందంగా మార్చేందుకు సహకరిస్తుందట. 4-6 స్టాబ్రెర్రీస్ ని పేస్టులాగా చేసి.. అందులో ఒక స్పూన్ పంచదార, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపాలట. ఆ తర్వాత దానిని ముఖానికి రాసి మర్థన చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల అందంగా కనిపిస్తారట.
ఇక ఫేస్ మాస్క్ లు సైతం స్ట్రాబెర్రీ మాస్క్ ఉపయోగిస్తారట. స్ట్రాబెర్రీస్ లో ఆరెంజెస్ కన్నా... విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. ఈ స్ట్రాబెర్రీస్ లో ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టీస్పూన్ తేనె కలిపి.. ఆ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ గా ఉపయోగించాలి.
ఒక మరో ఫేస్ ప్యాక్ పెరుగుతో చేసుకోవాలి. రెండు టీ స్పూన్ల పెరుగులో కొద్దిగా తేనె కలపాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి సుకొని.. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల చర్మం అందంగా మారుతుందట.