MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • అంబానీ కొత్త కోడలు రాధిక.. అందంగా కనపడటానికి ఏం చేస్తుందో తెలుసా?

అంబానీ కొత్త కోడలు రాధిక.. అందంగా కనపడటానికి ఏం చేస్తుందో తెలుసా?

ఆమె  తన అందాన్ని ఎలా కాపాడుకుంటుంది..? ఎంత మందిలో ఉన్నా.. తనను తాను స్పెషల్ గా కనపడేలా ఉండటానికి ఏం చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 18 2024, 10:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అంబానీ కొత్త కోడలు రాధిక మర్చంట్.. ఇప్పుడు అందరికీ సుపరిచితమే. రీసెంట్ గా..ముకేష్ అంబానీ  చిన్న కుమారుడు అనంత్ అంబానీ తో రాధిక వివాహం జరిగింది. ఈ పెళ్లికి చాలా మంది సెలబ్రెటీలు హాజరై సందడి చేశారు. అయితే.. ఎంత మంది సెలబ్రెటీలు వచ్చినా.. రాధిక మాత్రం స్పెషల్ గానే కనపడింది. ఖరీదైన దుస్తులు, లగ్జరీ జ్యూవెలరీ మాత్రమే కాదు.. ఆమె ముఖంలోని గ్లో వల్ల అంత స్పెషల్ గా కనపడింది అని చెప్పొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

రాధిక.. తన దుస్తులు, జ్యువెలరీ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటుందో... తన లుక్స్ అందంగా కనపడేందుకు కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. పెళ్లిలో రాధిక ఏ డ్రెస్ వేసినా... ఆ డ్రెస్ కే అందాన్ని తెచ్చేలా కనపడింది. మరి.. ఆమె  తన అందాన్ని ఎలా కాపాడుకుంటుంది..? ఎంత మందిలో ఉన్నా.. తనను తాను స్పెషల్ గా కనపడేలా ఉండటానికి ఏం చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం..
 

37

మనం ఎంత గొప్ప, కాస్ట్ లీ దుస్తులు, జ్యువెలరీ ధరించినా.. ముఖంలో కళ, కాంతి లేకపోతే... అందం రాదు. అందుకే.. ఆ కళ పెంచుకోవడానికి రాధిక ప్రయత్నిస్తుందట. తన స్కిన్ ఫ్లా లెస్ గా ఉండేందుకు జాగ్రత్తపడుతుందట. అంటే.. ఎక్కువగా స్కిన్ కేర్ విషయంలో జాగ్రత్తపడుతుంది. రెగ్యులర్ గా స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతుందట.  స్కిన్ ఫ్లాలెస్ గా ఉన్నప్పుడే... ఎలాంటి మేకప్ వేసుకున్నా.. చక్కగా నప్పుతుంది. రాధిక ఇదే సీక్రెట్ ఫాలో అవుతుందట.

47

అంతేకాదు.. తాను ఏ దుస్తులు వేసుకున్నా.. జ్యూవెలరీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. నార్మల్ గా.. ఏవి పడితే అవి కాకుండా.. స్టేట్మెంట్  పీసెస్, అదేవిధంగా తమ సంప్రదాయానికి సూటయ్యేలాంటి జ్యూవెలరీ ఎంచుకుంది. తన దుస్తులకు.. లగ్జరీ లుక్  తెచ్చేలా ఆమె జ్యవెలరీ  ఎంచుకున్నారు. అందుకే.. అంత ఎలిగెంట్ గా కనపడటం విశేషం.

57

అనంత్- రాధిక పెళ్లి ఒక్క రోజులో పూర్తవ్వలేదు. చాలా రకాల ఫంక్షన్లు చేశారు. అన్ని ఫంక్షన్లలోనూ ఆమె తనకు కరెక్ట్ గా సూటయ్యేలా మేకప్ ని ఎంచుకున్నారు. చాలా సాఫ్ట్ మేకప్ , లైట్ ఐషాడోస్, రోజీ చీక్స్, పేస్టల్ లిప్ స్టిక్స్ ఎంచుకుంది. వీటి కారణంగా ఆమె హెవీ మేకప్ వేసుకున్నట్లుగా కాకుండా... చాలా సహజంగా అందంగా కనపడింది.

67

ఇక.. ఈ రోజుల్లో ఎక్కువమంది అందంగా కనపడటానికి హెయిర్ లూస్ గా వదిలేస్తూ ఉంటారు. కానీ.. రాధిక మాత్రం.. తన హెయిర్ విషయంలోనూ ప్రతి పెళ్లి ఈవెంట్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంది. వేసుకున్న డ్రెస్ కి సెట్ అయ్యేలా.. హెయిర్ యాక్ససరీస్ కూడా ఎంచుకుంది.  పూల దగ్గర నుంచి.. జ్యూవెలరీ పీసెస్ వరకు.. ఆమె అందానికి.. అదనపు ఆకర్షణగా నిలిచాయి.

77

ఇక.. తాను ఎంచుకునే రంగులు కూడా ఆమెను చాలా స్పెషల్ గా నిలిచేలా చేశాయి. ముఖ్యంగా హల్దీ వేడుకలో ఆమె వేసుకున్న లెహంగాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. ఒక్క హల్దీనే కాదు.. ఆమె దాదాపు ఎంచుకున్న రంగులన్నీ.. కాస్త భిన్నంగా ఉండేలా చూసుకుంది. అందుకే.. అంత ఎట్రాక్టివ్ గా కనపడింది.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Stone Bracelet: చేతికి రాయల్ లుక్ ఇచ్చే స్టోన్ బ్రేస్లెట్.. చూసేయండి
Recommended image2
Kundan Bangles: చేతులకు రిచ్ లుక్ ఇచ్చే రంగు రంగుల కుందన్ గాజులు
Recommended image3
Anklet Designs: డైలీవేర్ కి లైట్ వెయిట్ పట్టీలు చూస్తే వావ్ అనాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved