ఇదో అమేజింగ్ బ్యూటీ టిప్.. ఈ నూనె ముఖానికి రాసుకుంటే..!
వయసు పెరుగుతుంటే ఎవరికైనా ముఖంపై వృద్ధాప్య ఛాయలు రావడం చాలా సర్వ సాధారణం. ముఖంపై ముడతలు వచ్చేస్తాయి.. వాటిని పోగొట్టే సత్తా ఆలివ్ ఆయిల్ కి ఉందట.
olive oil
అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి..? అందుకోసం ఎవరికి తోచిన ప్రయత్నాలు వారు చేస్తూనే ఉంటారు. కొందరికి ఎన్ని క్రీములు రాసుకున్నా.. ముఖంపై నల్ల మచ్చలు, మొటిమలు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఉన్న కాలుష్యం కారణంగా.. ముఖంపై ఇలాంటివి రావడం చాలా సర్వ సాధారణం.
ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టి.. ముఖం అందంగా మెరిసిపోవాలంటే ఏం చేయాలో.. సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఓ ఆయిల్ తో చర్మ సమస్యలు తగ్గడంతోపాటు.. ముఖం మెరిసిపోతుందట. మరి ఆ ఆయిల్ ఏంటో.. దాని స్పెషాలిటీ ఏంటో చూసేద్దాం..
వయసు పెరుగుతుంటే ఎవరికైనా ముఖంపై వృద్ధాప్య ఛాయలు రావడం చాలా సర్వ సాధారణం. ముఖంపై ముడతలు వచ్చేస్తాయి.. వాటిని పోగొట్టే సత్తా అవకాడో ఆయిల్ కి ఉందట.
అవకాడో ఆయిల్ ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం డ్రైనెస్ తగ్గి.. మృదువుగా తయారౌతుంది. అంతేకాకుండా.. చర్మం సాగిపోకుండా స్టిప్ఫ్ గా ఉంటుందట.
అవకాడో ఆయిల్ లో విటమిన్ ఈ, బీటా కెరోటిన్, విటమిన్ డీ, ప్రోటీన్, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ముఖంగా యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. అంతేకాదు.. సన్ బర్న్ వల్ల కలిగే నష్టాన్ని కూడా తగ్గిస్తుంది.
చర్మంపై ఇరిటేషన్, ర్యాషెస్, చివరకు స్కిన్ క్యాన్సర్ లాంటివి కూడా రాకుండా ఉండేందుకు ఈ అవకాడో ఆయిల్ పనిచేస్తుందట. అందుకే.. ప్రతిరోజూ రాత్రి ఈ నూనెతో ముఖానికి మసాజ్ లాగా చేసుకోవాలట.
చర్మం ఎప్పుడూ తాజాగా కనిపించేలా చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.