MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Woman
  • అరటి పువ్వును గనుక తింటే ఎన్ని లాభాలున్నాయో..!

అరటి పువ్వును గనుక తింటే ఎన్ని లాభాలున్నాయో..!

మనలో ప్రతి ఒక్కరూ వారానికి ఒక్కసారైనా అరటిపండ్లను తింటుంటాం. అలాగే అరటికాయను వండుకుని కూడా తింటుంటాం. కానీ అరటి పువ్వు జోలికి మాత్రం వెళ్లం. కానీ అరటిపువ్వు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది.   

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jul 30 2024, 01:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
banana flower

banana flower


అరటి పండ్లు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగకరంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అరటి కాయలు బరువు పెరగడానికి, గుండె ఆరోగ్యంగా ఉండటానికి  ఇలా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అయితే అరటి పువ్వు గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. అసలు అరటిపువ్వును కూడా తింటారన్న ముచ్చట కూడా కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ అరటిపువ్వును తింటే మాత్రం మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. అరటి పువ్వులో  కాల్షియం, ఫైబర్, విటమిన్ బి, విటమిన్ ఎ, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అసలు అరటిపువ్వును తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

గర్భాశయ సమస్యలు.. 

అరటి పువ్వును అండాశయ తిత్తులు ఉన్నవారు తినొచ్చు. వీళ్లకు ఈ పువ్వు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయాన్నే అరటి పువ్వు రసం తాగితే గర్భాశయ సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. అరటి పువ్వులోని పీచు పదార్థాలను తొలగించి, పువ్వులను చిన్న చిన్న ముక్కలుగా కోసి మజ్జిగతో కలుపుకుని తాగాలి. టేస్ట్ కోసం మీరు కొద్దిగా ఉప్పును కూడా కలుపుకోవచ్చు. 
 

38


రక్తాన్ని శుద్ధి చేస్తుంది

అరటి పువ్వు రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా బాగా సహాయపడుతుంది. అరటి పువ్వు రక్తంలోని అవాంఛిత కొవ్వులను కరిగించి తొలగిస్తుంది.దీంతో శరీరంలో రక్తం మెరుగ్గా ప్రసరణ జరుగుతుంది. ఇది రక్త నాళాలకు అంటుకునే కొవ్వులను కరిగించి రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. అరటి పువ్వులు రక్తహీనత సమస్యను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. అలాగే రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడానికి సహాయపడతాయి.
 

48

మలబద్ధకానికి సహాయపడుతుంది

అరటి పువ్వు మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పువ్వులో ఉండే ఫైబర్ వల్ల ఇదొక భేదిమందుగా పనిచేస్తుంది. ఈ పువ్వులో కరిగే ఫైబర్, కరగని ఫైబర్ రెండూ పుష్కలంగా ుంటాయి. అరటి పువ్వును ఆహారంలో ఎక్కువగా తీసుకునేవారికి తరచూ మూత్రం వచ్చే సమస్య కూడా తగ్గుతుంది. 
 

58
banana flower

banana flower


రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది

అరటి పువ్వులో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇది రక్తానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ పిండి పదార్థాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ను మారుస్తుంది. ఇది షుగర్ లెవల్స్ వెంటనే పెరగకుండా కాపాడుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు అరటి పువ్వును తినాలని డాక్టర్లు చెప్తారు. 
 

68

నోటి దుర్వాసనను తగ్గిస్తుంది

అరటిపండును తరచుగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల నోటి దుర్వాసన కూడా తగ్గుతుందంటున్నారు నిపుణులు. పోషకాహార లోపం వల్ల పంటినొప్పి, చిగుళ్ల నుంచి రక్తం కారడం, నోరు, కుహరాల్లోని క్రిములు వంటి సమస్యలు కూడా నయమవుతాయి.

78

ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది

అరటి పువ్వులో ఒత్తిడిని తగ్గించే పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. మీరు బాగా ఒత్తిడికి లోనవుతుంటే గనుక మీ రోజువారీ ఆహారంలో అరటిపువ్వును చేర్చుకుని శనగపప్పుతో సలాడ్ గా వండుకోవచ్చు.
 

88
banana flower

banana flower

గుండెను కాపాడుతుంది

అరటిపండ్లలో పొటాషియం మెండుగా ఉంటుంది. ఈ పొటాషియం మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. మీకు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే అరటి పువ్వును మీ  డైట్ లో చేర్చుకోండి. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved