కలర్ వాడకుండా తెల్ల జుట్టు నల్లగా కావాలంటే ఏం చేయాలో తెలుసా?
తెల్ల జుట్టు నల్లగా కావాలంటే కలర్ వేసుకోలంటారు చాలా మంది. కానీ మీరు కొన్ని నేచురల్ పద్దతిలో కూడా తెల్ల జుట్టును నల్లగా చేసుకోవచ్చు. అలాగే తెల్ల వెంట్రుకలు మరిన్ని పెరగకుండా చూసుకోవచ్చు.
ప్రస్తుత కాలంలో తెల్ల జుట్టు సర్వసాధారణం అయిపోయింది. స్ట్రెస్, హార్మోన్ల అసమతుల్యత, వాయు కాలుష్యంతో పాటుగా ఎన్నో కారణాల వల్ల తెల్ల జుట్టు వస్తుంది. ఇక ఈ తెల్ల జుట్టు కనిపించకుండా ఉండటానికి మార్కెట్ లో దొరికే సింథటిక్ రంగులను ఉపయోగిస్తుంటారు. కొంతమంది ఇతర చికిత్సలను కూడా తీసుకుంటారు. నిజానికి ఇవి మీకు తెల్ల జుట్టు రాకుండా ఆపుతాయా? అంటే ఆపలేవు అనే చెప్పాలి. నిజానికి తెల్ల జుట్టు రాకుండా చేయడంలో నేచురల్ పదార్థాల కంటే మంచి రెమెడీ మరొకటి లేదంటారు నిపుణులు. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రాకుండా ఉండటానికి, జుట్టు సంబంధిత సమస్యలను తగ్గించడానికి ఇవి బాగా సహాయపడతాయి. అవేంటో తెలుసుకుందాం..
కరివేపాకు
గ్రే హెయిర్ కు కరివేపాకు బెస్ట్ హోం రెమెడీ. ఈ కరివేపాకులో విటమిన్ ఎ, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జుట్టు మూలాలకు మంచి పోషణనిచ్చి, ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి. ఈ ఆకులు మన వెంట్రుకలను బలంగా చేస్తాయి. అలాగే వెంట్రుకలు తెగిపోకుండా కాపాడుతాయి. ఇందుకోసం గుప్పెడు కరివేపాకును తీసుకుని ఒక పాత్రలో వేసి వేయించండి. ఇవి బాగా నల్లగా మారిన తర్వాత పొడి చేసి తలకు అప్లై చేస్తే నేచురల్ హెయిర్ డైలా పనిచేసి బూడిద జుట్టును మటుమాయం చేస్తుంది.
పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడికాయ గింజలు, నువ్వులు
కొన్ని రకాల ఆహారాలను తింటూ కూడా మీరు తెల్ల జుట్టు రాకుండా చేయొచ్చు. నిపుణుల ప్రకారం.. మీ రోజువారీ ఆహారంలో గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు గింజలను, నువ్వులను చేర్చడం వల్ల తెల్ల జుట్టు వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. వీటిలో రాగి, సెలీనియం, ఇనుము, జింక్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా జుట్టు బాగా పెరగడానికి, నల్లగా ఉండటానికి బాగా సహాయపడతాయి. ఈ గిజంలు చిన్న వయసులో తెల్ల జుట్టు రాకుండా కాపాడుతాయి. అంతేకాదు వెంట్రుకలు రాలడాన్ని కూడా నివారిస్తాయి. ఈ విత్తనాలను చట్నీ, సలాడ్లు, స్వీట్లలో తీసుకోవచ్చు. ఈ విత్తనాలను పొడి చేసి పాలలో కలిపి తీసుకుంటే ఆహారంలో పోషక విలువలు మెరుగుపడతాయి.
కొబ్బరి నూనె
కొబ్బరి నూనె కొబ్బరి నూనె మన జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇది కూడా జుట్టు తెల్లబడటాన్ని చాలా వరకు తగ్గించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో ప్రోటీన్లు, మాంగనీస్, సెలీనియం, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ నెత్తికి పోషణను, బలాన్ని అందిస్తాయి. ఇందుకోసం మీరు తలస్నానం చేయడానికి రెండు గంటల ముందు కొబ్బరి నూనెను జుట్టుకు పెట్టాలి. కొబ్బరి నూనె మీ నెత్తిని హైడ్రేట్ గా కూడా ఉంచుతుంది.
మందారం, గులాబీ
మందారం, గులాబీ రెండింటినీ టీతో కలిపి తీసుకుంటే తెల్ల జుట్టు చాలా వరకు తగ్గుతుంది. బూడిద జుట్టుతో సంబంధం ఉన్న హార్మోన్ల అసమతుల్యతతో పోరాడుతున్న వారికి ఈ పదార్థాలు బాగా సహాయపడతాయి. జుట్టు తెల్లబడటాన్ని, జుట్టు సన్నబడటాన్ని బాగా తగ్గిస్తాయి. అంతేకాదు ఇవి ఎన్నో జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తాయి. ఇందుకోసం మందారం లేదా గులాబీలు ఉంటే వాటి రేకులను కడగండి. వీటిని గాలి చొరబడని జార్ లో నిల్వ చేయొచ్చు. లేదా వాటిని పౌడర్ చేసి నిల్వ చేయొచ్చు. మరుగుతున్న టీలో వడకట్టడానికి కొన్ని నిమిషాల ముందు కొన్ని ఈ రేకులను వేయాలి.
ఉసిరికాయ
ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన జుట్టుకు ఎంతో సహాయపడుతుంది. తలకు రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది జుట్టు ఊడిపోవడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. దీనిలో ఫైబర్స్ జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. ఉసిరికాయను మిఠాయి, జామ్, పౌడర్ రూపంలో లేదా అలాగే తినొచ్చు.