ఈ జాగ్రత్తలు పాటిస్తే మీకు బట్టతల రానేరాదు
జుట్టును ఎప్పుడు పడితే అప్పుడు.. ఎక్కడ పడితే అక్కడ దువ్వేస్తున్నారా? అయితే మీకు హెయిర్ ఫాల్ సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంది. జట్టు దువ్వుకోవడానికి కూడా సమయం, సందర్భం ఉంటాయని మీకు తెలుసా? హెయిర్ ను జాగ్రత్తగా చూసుకోకపోతే బట్టతల కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఏ సమయాల్లో జుట్టు దువ్వుకోవడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
మనిషికి అందమైన రూపాన్ని ఇచ్చేది జుట్టు. జంట్స్ కైనా, లేడీస్ కైనా జుట్టే అందం కదా.. అందుకే అందరూ ఎప్పుడూ జుట్టును సరిచేసుకుంటూ ఉంటారు. మగవాళ్లయితే రోడ్డు మీద వెళుతున్నా అద్దం కనిపిస్తే ముందు జుట్టు ఎలా ఉందో చెక్ చేసుకుంటారు. అవసరమైతే అక్కడే ఆగి చక్కగా దువ్వుకొని మరీ వెళుతుంటారు. ఇక ఆడవాళ్లయితే ఎక్కడైన అద్దం లాంటిది కనిపిస్తే ముందు ముఖంలో అందం చూసుకుంటారు. దాంతో పాటు హెయిర్ స్టైల్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకుంటారు. ఇంత ఇంపార్టెంట్ అయిన జుట్టును సరిగ్గా సంరక్షించకపోతే ఫాలింగ్ మొదలైపోతుంది. అప్పుడు కూడా పట్టించుకోకపోతే బట్టతల(Baldness) వచ్చే ప్రమాదం ఉంటుంది.
జుట్టు దువ్వడం వల్ల స్కాల్ప్‌లో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీని వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. క్రమం తప్పకుండా జుట్టు దువ్వడం వల్ల జుట్టు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మెదడు ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. ఇది స్కాల్ప్‌ను యాక్టివేట్ చేస్తుంది. జుట్టు పెరుగుదలను పెంచుతుంది. అయితే దువ్వకూడని సమయంలో జుట్టు దువ్వడం హానికరం. జుట్టు రాలడానికి లేదా బట్టతలకు దారితీస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చక్కటి జుట్టును మెయిన్‌టెయిన్ చేయడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి చెక్క దువ్వెనను ఉపయోగించండి. దీని వల్ల మీకు స్ట్రాంగ్, షైనీ జుట్టు లభిస్తుంది.
చాలా మంది చేసే తప్పేంటంటే తల స్నానం చేసిన వెంటనే తడి జుట్టును దువ్వేస్తుంటారు. ఇది హెయిర్ ఆరోగ్యానికి చాలా నష్టం కలిగిస్తుంది. మీకు ఈ అలవాటు ఉంటే వెంటనే దువ్వడం మానుకోండి. లేకపోతే మీ జుట్టుకు పగుళ్లు ఏర్పడతాయి. దీంతో జుట్టు మీకు తెలియకుండానే రాలడం మొదలు పెడుతుంది. ఇదీ మరీ ఎక్కువైతే బట్టతల కూడా రావచ్చు. ఈ అలవాటు ముఖ్యంగా జుట్టు కుదుళ్లను దెబ్బతీస్తుంది. ఒకవేళ ఇప్పుడు ప్రాబ్రమ్ రాకపోయినా భవిష్యత్తులో జుట్టు దెబ్బతినడానికి ఈ అలవాటు కారణమవుతుంది.
మనందరం చేసే మరో పెద్ద తప్పేంటంటే.. దువ్వెన్నలను శుభ్రం చేయకపోవడం. అవి మట్టి, దుమ్ము పట్టేసి మురికిగా ఉన్నావాటినే నెలల తరబడి వాడేస్తుంటాం. ఎప్పుడో పండగలు, ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు మాత్రమే పని కట్టుకొని వాటిని శుభ్రం చేస్తుంటాం. జుట్టు రాలిపోవడానికి దువ్వెన్న డర్టీగా ఉండటం కూడా కారణమే. అందువల్ల ఎప్పుడూ మురికి దువ్వెనను ఉపయోగించవద్దు. ఇది జుట్టును తీవ్రంగా దెబ్బతీస్తుంది. వివిధ స్కాల్ప్ ఇన్ఫెక్షన్లకు కూడా డర్టీ దువ్వెన్నలు కారణమవుతాయి. వెంటనే మీ ఇళ్లలో దువ్వెన్నలన్నీ తీసుకొచ్చి శుభ్రం చేయండి.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. చాలామంది ఇళ్లలో అందరికీ ఒకే దువ్వెన ఉంటుంది. దాంతోనే చిన్న, పెద్ద అంతా జుట్టు దువ్వుకుంటారు. ఇది చాలా పెద్ద మిస్టేక్. ప్రతి ఇంట్లో ఎవరి దువ్వెన వారికి ఉండాలి. సాధారణంగా పెద్ద వాళ్లకు జుట్టు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వాళ్లు వాడిన దువ్వెనతోనే పిల్లలకు దువ్వుతారు. దీంతో ఫంగల్ ఇన్ఫెక్షన్లు పిల్లలకు కూడా సోకుతాయి. అందువల్లనే ఇటీవల చిన్న పిల్లలకు కూడా హెయిర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. అందరిలో స్కాల్ప్ దెబ్బతినడానికి ఇదీ ఒక కారణం. అందువల్ల ఇంట్లో ఎవరి దువ్వెన వారికి ఉండేలా చూసుకోండి.
ప్రయాణాల్లోనూ తరచూ ఇదే సమస్య ఎదురవుతుంటుంది. ఫంక్షన్లకు వెళ్లినప్పుడు అక్కడ దువ్వెనలు అందుబాటులో ఉండవు కనుక పక్క వాళ్ల దగ్గర తీసుకొని వాడుకుంటాం. ఇది మీ జుట్టును ఇన్ఫెక్షన్ బారిన పడేలా చేస్తుంది. అందువల్ల ఎప్పుడూ మీ సొంత దువ్వెనను మీతోనే ఉంచుకోండి.