Face Glow: ఉదయం లేవగానే ఇవి రాస్తే.. ముఖం మెరిసిపోద్ది..!
చర్మాన్ని మృదువుగా మార్చడంతో పాటు.. మెరుపునిచ్చేలా ఉండేది ఒక్కటి ఉంటే బాగుండు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటిది ఒకటి ఉంది.

మన చర్మం మృదువుగా కనిపించాలని, స్మూత్ గా కనిపించాలని రెగ్యులర్ గా మనలో చాలా మంది మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉంటారు. నిజమే, మాయిశ్చరైజర్ రాస్తే.. చర్మం పొడిబారకుండా, పగలకుండా ఉంటుంది. కానీ... ముఖానికి మెరుపునిచ్చేలా ఉండటం కూడా చాలా ముఖ్యం అనే విషయం చాలా మంది మర్చిపోతారు.
honey face pack
చర్మాన్ని మృదువుగా మార్చడంతో పాటు.. మెరుపునిచ్చేలా ఉండేది ఒక్కటి ఉంటే బాగుండు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటిది ఒకటి ఉంది. దానిని ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే రాసుకుంటే... అది రోజంతా మన ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. దీని కోసం మనం వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సులభంగా ఇంట్లో లభించేదే. మరి, అదేంటో తెలుసుకుందామా...
<p>honey face pack</p>
ముఖ అందాన్ని పెంచడంలో తేనె చాలా కీలక పాత్ర పోషిస్తుంది. తేనెలో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ-ఏజింగ్ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి చర్మాన్ని కాంతివంతం చేయడంలో, మృత చర్మ కణాలను తొలగించడంలో, ముఖంపై ముడతలు, సన్నని గీతలను తగ్గించడంలో , నల్లటి మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. మీకు కావాలంటే, మీరు బియ్యం పిండితో తేనెను కలిపి ముఖంపై స్క్రబ్‌గా అప్లై చేయవచ్చు.
Face Pack
తేనెతో ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. ఇది మరింత సమర్థవంతంగా పని చేస్తుంది. మరి, దానికోసం దాంట్లో ఇంకా ఏమేమి కలపొచ్చో చూద్దాం...
ఫేస్ ప్యాక్ చేయడానికి
కలబంద జెల్ - 2 టేబుల్ స్పూన్లు
గ్లిజరిన్ - 1 టీస్పూన్
తేనె - 1 టీస్పూన్
గమనిక – మీరు కోరుకుంటే, మీరు ఈ ప్యాక్‌కు 2-3 చుక్కల ఆలివ్ ఆయిల్‌ను జోడించవచ్చు.
ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానికి రెండు చెంచాల కలబంద జెల్, ఒక చెంచా తేనె, ఒక చెంచా గ్లిజరిన్ వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్ ను మీ ముఖంపై అప్లై చేసి 10 నిమిషాలు ఆరనివ్వండి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది. ఇలా రెండు రోజులకి ఒకసారి కనీసం నెలరోజులు రాసుకున్నా.. మీ ముఖంలో మార్పులు స్పష్టంగా చూస్తారు. కాంతి వంతంగా మెరుస్తూ కనపడుతుంది.