Hair Growth: మెంతులను ఈ నూనెలో కలిపి రాస్తే...జుట్టు ఒత్తుగా పెరగడం ఖాయం..!
Hair Growth: జుట్టు రాలిపోతుందని బాధపడుతున్నారా? ఎంత ఖరీదైన షాంపూలు, నూనెలు వాడినా కూడా జుట్టు రాలడం ఆగడం లేదా? అయితే కొన్ని సింపుల్ రెమిడీలు ఫాలో అవ్వాల్సిందే..

Hair growth
మహిళలు తమ చర్మాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, జుట్టును కూడా అంతే ప్రేమగా చూసుకుంటారు. జుట్టు రాలడం, చండ్రు, పొడిబారడం లాంటి సమస్యలు ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్నారు. వాటిని తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన నూనెలు, షాంపూలు వాడుతూ ఉంటారు. వాటి వల్ల కూడా ఉపయోగం లేదు అంటే.. మీరు మీ కిచెన్ లో లభించే కొన్ని మెంతులను వాడితే చాలు. ఈ మెంతులను పేస్టులా కాకుండా.. కొన్ని రకాల నూనెలతో కలిపి జుట్టుకు అప్లై చేస్తే... జుట్టు రాలే సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఒత్తుగా కూడా పెరుగుతుంది. మరి ఈ మెంతుల నూనె ఎలా తయారు చేయాలి? జుట్టుకు ఎలా వాడాలి అనే విషయం ఇప్పుడు చూద్దాం...
జుట్టు రాలడం తగ్గించే నూనె...
జుట్టు రాలడాన్ని తగ్గించడానికి మీరు ఆలివ్ నూనె, ఆముదం నూనె, కొబ్బరినూనె, బాదం నూనె, విటమిన్ ఈ క్యాప్సిల్, మెంతులు వాడితే చాలు.
వీటితో నూనె తయారీ విధానం....
ముందుగా ఒక గిన్నెలో ఈ నాలుగు రకాల నూనెలను సమానంగా కలపాలి. ఇందులోనే విటమిన్ ఈ ఆయిల్ కూడా కలపాలి. ఈ నూనెలోనే మెంతులు వేసి... రాత్రంతా అలానే ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల మెంతుల్లోని గుణాలు నూనెలో కలుస్తాయి.. మరుసటి రోజు ఉదయాన్నే ఈ నూనెను జుట్టుకు అప్లై చేయాలి. గంట తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ నూనెను రెగ్యులర్ గా వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
జుట్టు పెరగడానికి వేప నూనె...
పొడవాటి, బలమైన, మెరిసే జుట్టు కోరుకునే ప్రతి స్త్రీ తప్పనిసరిగా ప్రయత్నించాల్సిన నూనె ఇది. వేపూనె, ఉసిరి నూనె.
ఈ నూనె ఎలా వాడాలి..?
ఒక పాత్రలో వేప నూనె వేసి, అందులో ఉసిరి నూనె కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు మంచిగా అప్లై చేసి మసాజ్ చేయాలి. రాత్రంతా అలానే వదిలేసి.. ఉదయాన్నే తలస్నానం చేస్తే సరిపోతుంది. రెగ్యులర్ గా ఈ నూనె రాయడం వల్ల జుట్టు రాలడం తగ్గడమే కాదు.. ఒత్తుగా కూడా పెరుగుతుంది.
3.పొడవాటి జుట్టుకు కరివేపాకు, మందార నూనె...
ఒక గుప్పెడు కరివేపాకు, ఒక కప్పు ఆవాల నూనె, 1 టేబుల్ స్పూన్ ఆముదం నూనె, ఒక మందార పువ్వు
ఈ నూనె తయారీ విధానం...
పైన చెప్పిన పదార్థాలన్నింటినీ ఒక ఐరన్ పాత్రలో రాత్రంతా నానపెట్టాలి. మరుసటి రోజు ఈ నూనె వేడి చేసి చల్లారనివ్వాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మెత్తని పేస్టులా రుబ్బుకొని వస్త్రంతో వడకొట్టాలి. తర్వాత ఈ నూనె జుట్టుకు అప్లై చేస్తే సరిపోతుంది. రాత్రి పూట ఈ నూనెతో మసాజ్ చేసుకొని, మరుసటి రోజు తలస్నానం చేస్తే సరిపోతుంది.ఈ నూనె కూడా రెగ్యులర్ గా జుట్టుకు రాయడం వల్ల జుట్టు ఒత్తుగా మారుతుంది.
4.జుట్టు పెరుగుదలకు మెంతుల నూనె...
జుట్టు పెరుగుదలకు మెంతులు చాలా బాగా సహాయపడతాయి. ఇవి జుట్టు మందంగా పెరగడానికి, జుట్టు మెరిచేలా చేయడానికి హెల్ప్ చేస్తాయి. ముందుగా మెంతులను క్రష్ చేసి... కొబ్బరి నూనెలో నానపెట్టాలి. 2 గంటలు బాగా నానపెట్టిన తర్వాత... ఆ నూనెను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. 2 గంటల తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. వారానికి రెండుసార్లు ఈ నూనె వాడినా మీ జుట్టు అందంగా మారుతుంది.