వారం రోజుల్లో అందంగా మెరిసేందుకు సూపర్ చిట్కా..!
చర్మంపై పేరుకుపోయిన డెడ్ సెల్స్ ని తొలగించడానికి శెనగపిండి సహాయపడుతుంది. ఇక పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లేమటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలుు పుష్కలంగా ఉంటాయి.
అందంగా కనిపించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. దానికోసం చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మార్కెట్లో దొరికే ఏవేవో క్రీములు వాడుతూ ఉంటారు. అయితే.. మన పూర్వకాలం నుంచి వస్తున్న ఆయుర్వేదిక్ రెమిడీస్ ని వాడటం వల్ల సహజంగా అందంగా మెరిసిపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం వారంరోజుల్లో ముఖంలో గ్లో రావాలి అంటే ఇదిగో ఈ కింది ట్రిక్ ని ఫాలో అవ్వండి.
ubtan భారతీయ సంప్రదాయంలో ఎప్పటి నుంచో ఫాలో అవుతుున్న బ్యూటీ టెక్నిక్. దీనిని ప్రయత్నించడం వల్ల చర్మం మునుపటి కంటే అందంగా మెరిసిపోతుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచే దీనిని వాడుతూ వస్తున్నారు.
ఈ ఉబ్టాన్ ట్రీట్మెంట్ కోసం మనం శెనగ పిండి, పసుపు, చందనం, బాదం పొడి వంటివి వాడతారు. ఇవన్నీ చర్మానికి అందం తీసుకురావడానికి ఉపయోగపడతాయి.
Image: Getty Images
చర్మంపై పేరుకుపోయిన డెడ్ సెల్స్ ని తొలగించడానికి శెనగపిండి సహాయపడుతుంది. ఇక పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లేమటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలుు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి గ్లో తీసుకువస్తాయి. ఇక చందనం మనకు చర్మం చల్లగా అనిపించడంతో పాటు, చర్మం మృదువుగా ఉండటానికి కూడా కారణమౌతుంది. ఇక బాదం పొడి చర్మం మృదువుగా, తేమగా ఉండటానికి సహాయపడుతుంది.
వీటన్నింటినీ కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని ప్రతిరోజూ ముఖానికి రాస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మృదువుగా మారుతుంది. ఒక తెలియని గ్లో ముఖంలో కనపడుతుంది. ముఖం మీద డార్క్ స్పాట్స్ తొలగిపోవడానికి కూడా సహాయపడుతుంది. సరిగా వరసగా వారం రోజులు కనక దీనిని ఉపయోగిస్తే.. మీ ముఖంలోని గ్లోని మీరే గుర్తిస్తారు.
దీనిని ఎలా తయారుచేయాలో చూద్దాం..ముందుగా రెండు స్పూన్ల శెనగపిండి,ఒ స్పూన్ చందనం పొడి, అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ బాదం పొడి, రెండు స్పూన్ల పాలు. ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు మొత్తం పది నిమిషాల పాటు అలా వదిలిచేయాలి. ఆ తర్వాత నెమ్మదిగా ముఖాన్ని రుద్దుతూ, చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వారం రోజులపాటు ప్రతిరోజూ దీనిని చేస్తే ఫలితం మీకే స్పష్టంగా కనపడుతుంది.