MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • Skin Care: కేవలం పది నిమిషాల్లో ముఖం మెరిసిపోవాలా? ఇదొక్కటి రాస్తే చాలు

Skin Care: కేవలం పది నిమిషాల్లో ముఖం మెరిసిపోవాలా? ఇదొక్కటి రాస్తే చాలు

ఈ పప్పుతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ లు వేయడం వల్ల ముఖంపై డెడ్ స్కిన్ సెల్స్ ని తొలిగించడానికి సహాయపడుతుంది. చర్మాన్ని మృదువుగా మార్చడానికి కూడా సహాయపడుతుంది.

3 Min read
Author : ramya Sridhar
Published : Apr 19 2025, 11:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మారుతున్న వాతావరణం కూడా మన చర్మంపై భారీ ప్రభావం చూపుతుంది. ఈ రోజుల్లో కాలుష్యం ఎక్కువగా ఉండటం వల్ల.. చాలా చిన్న వయసులోనే పెద్ద వారిలా కనపడుతున్నారు. ముఖ్యంగా ముఖంపై ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. ఇక వాటిని కవర్ చేసుకోవడానికి మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ వాడేస్తూ ఉంటారు. అవి లేకుండా కూడా సహజంగా అందంగా మెరిసిపోవచ్చు. ముఖ్యంగా ఏదైనా పార్టీకో, పెళ్లికో వెళ్తూ..తక్కువ టైమ్ లో సహజంగా అందంగా కనిపించాలంటే కేవలం ఒక ప్రొడక్ట్ వాడితే చాలు. మరి, అదేంటో తెలుసుకుందాం..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

మనలో చాలా మంది రెగ్యులర్ గా పప్పును ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటారు.వాటిలో మైసూర్ దాల్ కూడా ఒకటి. ఈ పప్పులో ప్రోటీన్ పుష్పలంగా ఉంటుంది.ఇదే మైసూర్ దాల్ ని కేవలం ఆరోగ్యం కోసం మాత్రమే కాదు.. అందం పెంచుకోవడానికి కూడా వాడొచ్చు. ఈ పప్పుతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ లు వేయడం వల్ల ముఖంపై డెడ్ స్కిన్ సెల్స్ ని తొలిగించడానికి సహాయపడుతుంది. చర్మాన్ని మృదువుగా మార్చడానికి కూడా సహాయపడుతుంది. మరి, ఈ పప్పుతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
 

35

ఫేస్ ప్యాక్ కోసం మనం ముందుగా మైసూర్ పప్పును  పొడిలాగా చేసుకొని ఉంచుకోవాలి. దానిని గాలి తగలని ఓ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనితో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. దాని కోసం మీరు ఒక స్పూన్ మైసూర్ పప్పు పొడి, ఒక స్పూన్ సెనగ పిండి, మరో స్పూన్ తాజా పెరుగు వేసి మంచి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. అవసరం అయితే.. కాస్త నీరు చేర్చాలి. చిటికెడు పసుపు కూడా చేర్చవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖం, మెడ, చేతులకు రాసి.. ఎండిన తర్వాత కొద్ది కొద్దిగా నీరు చల్లుతూ రుద్దుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల ముఖం స్మూత్ గా మారుతుంది. తెలియని ఒక గ్లో వస్తుంది. ముఖంపై ట్యాన్ మొత్తం తొలగిపోతుంది. మొటిమల సమస్య అనేదే ఉండదు.
 

45

మైసూర్ పప్పు, ఎగ్ ఫేస్ ప్యార్..
1 గుడ్డు తెల్లసొనను 2 చెంచాల పప్పు పొడితో కలిపి పేస్ట్ చేయండి. దానికి 2 చుక్కల నిమ్మరసం,ఒక పెద్ద చెంచా పచ్చి పాలు కలిపి ప్రతిరోజూ మీ ముఖంపై అప్లై చేయండి. అది ఆరిన తర్వాత, చల్లటి నీటితో కడగాలి. మీ ముఖం మెరుస్తుంది. 

పప్పు,తేనె ఫేస్ ప్యాక్
మీ ముఖంపై చనిపోయిన చర్మం ఉంటే లేదా మీ చర్మం పొడిగా ఉంటే, మీరు మైసూర్ దాల్‌ను తేనెతో వాడాలి. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని మృదువుగా ,యవ్వనంగా చేస్తుంది. ప్యాక్ తయారు చేయడానికి, ఒక చెంచా తేనెను రెండు చెంచాల పప్పు పొడితో బాగా కలపండి. తర్వాత మీ ముఖాన్ని శుభ్రం చేసి ఈ ప్యాక్‌ను అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత దానిని సున్నితంగా రుద్దండి.మీ ముఖం శుభ్రం చేసుకోండి. ఇది మీ ముఖంపై ఉన్న చనిపోయిన చర్మాన్ని కూడా తొలగిస్తుంది.

 

55

మైసూర్ దాల్ పొడిని  పాలతో కలిపి ముఖానికి అప్లై చేస్తే, అది ఎక్స్‌ఫోలియేటర్‌గా కూడా పనిచేస్తుంది. స్పూన్ పప్పు ల పొడిని తీసుకొని పాలతో కలిపి ముఖానికి రాయాలి. ఎండిన తర్వాత..స్క్రైబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం యవ్వనంగా మారుతుంది. ఇలా చేయడం వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనపడతారు.

మైసూర్ పప్పు,కొబ్బరి నూనె ,పసుపు
ఒక టేబుల్ స్పూన్ మైసూర్ గ్రామ్ పిండి, 2 టేబుల్ స్పూన్లు పాలు, 2-3 చుక్కల కొబ్బరి నూనె ,చిటికెడు పసుపు పొడిని కలిపి మీ ముఖంపై అప్లై చేయండి. ఈ ప్యాక్‌ను 2 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత దాన్ని సున్నితంగా రుద్ది ముఖం కడుక్కోండి. పొడి చర్మం ఉన్నవారు మాత్రమే కొబ్బరి నూనెను వాడాలి.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
సౌందర్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Moisturizer: ఆరోగ్యమైన, మెరిసే చర్మం కావాలంటే మీ మాయిశ్చరైజర్ ను ఇలా ఎంచుకోండి
Recommended image2
Gold Jumkhi: 18 క్యారెట్ లో బంగారు జుంకాలు.. బడ్జెట్ రేంజ్ లోనే...
Recommended image3
Blouse Designs: వెనక్కి తిరిగితే చూపు తిప్పుకోలేరు, స్టైలిష్ బ్లౌజులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved