రాత్రిపూట జుట్టుకు నూనె పెట్టడం వల్ల ఇన్ని లాభాలున్నాయా?
జుట్టుకు నూనె పెట్టే అలవాటు చాలా తక్కువ మందికే ఉంటుంది. కానీ జుట్టుకు నూనె చాలా అవసరం. ఇది జుట్టును బలంగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. అందులోనూ రాత్రిపూట జుట్టుకు నూనె పెట్టడం వల్ల ఎన్నో లాభాలున్నాయని నిపుణులు అంటున్నారు. అవేంటంటే?
ఆడవాళ్లు జుట్టు విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారు. జుట్టు హెల్తీగా, పొడుగ్గా, ఒత్తుగా పెరగడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. చాలా జాగ్రత్తగా జుట్టును కాపాడుతుకుంటారు. నిజానికి జుట్టు పెరగడానికి నూనె చాలా ఉపయోగపడుతుంది. అవును జుట్టుకు ప్రతి ఒక్కరూ నూనెను ఖచ్చితంగా పెట్టాలి. ముఖ్యంగా రాత్రిపూట జుట్టుకు నూనె పెట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి.
జుట్టు సిల్కీగా, మెరిసేలా..
రాత్రిపూట జుట్టుకు నూనె పెట్టడం వల్ల జుట్టుకు అవసరమైన పోషణ అందుతుంది. దీంతో మీ జుట్టు సిల్కీగా, షైనీగా మారుతుంది. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు జుట్టుకు నూనె పెట్టి కాసేపు నెమ్మదిగా మసాజ్ చేయాలి. రాత్రిపూట జుట్టుకు నూనె పెడితే.. ఉదయం మీరు వాడే షాంపూతో తలస్నానం చేయండి. ఆ తర్వాత కండీషనర్ ను వాడండి.
పొడిబారే సమస్య దూరం..
రాత్రిపూట జుట్టుకు నూనె పెట్టడం వల్ల జుట్టు పొడిబారే సమస్య చాలా వరకు తగ్గుతుంది. అలాగే జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జుట్టుకు ఆయిల్ పెట్టడం వల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలు తగ్గిపోవడంతో పాటుగా నెత్తిమీద దురద కూడా తగ్గుతుంది.
జుట్టు పెరుగుదల..
రాత్రిపూట జుట్టుకు నూనె పెట్టడం వల్ల జుట్టు బాగా పెరగడంతో పాటుగా జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇందుకోసం రాత్రిపూట వెంట్రుకల చివర్ల వరకు నూనెను బాగా అప్లై చేసి మసాజ్ చేయండి.
ఇది గుర్తుంచుకోండి
ఎప్పుడూ కూడా జుట్టుకు వేడి వేడి నూనెను అప్లై చేయకూడదు. అలాగే నూనె మరీ ఎక్కువగా పెట్టకూడదు. అలాగే మంచి నూనెనే జుట్టుకు పెట్టాలి. చుండ్రు సమస్య ఉన్నప్పుడు జుట్టుకు నూనె పెట్టకూడదు.