మొటిమల సమస్యా..? ఇదిగో పరిష్కారం
కలబంద రసంలో సగం టీస్పూన్ కస్తూరి పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయండి.
అందంగా ఉండాలని ఏ అమ్మాయి మాత్రం ఆశపడదు. తమ చర్మం అందంగా మెరిసిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే.. అందుకోసం ఎన్ని క్రీములు వాడినా పెద్దగా ప్రయోజనం కనపడదు కొందరిలో. అంతేకాదు.. చాలా మంది మొటిమలు.. వాటి తాలూకు సమస్యలతో బాధపడుతుంటారు. మరి అలాంటి వారు ఈ హోమ్ రెమిడీస్ వాడితే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఓసారి చూద్దాం.
కలబంద గుజ్జులో ఎన్నో ఉపయోగకరమైన ఔషధ గుణాలున్నాయి. దీనితో తయారు చేసిన ఫేషియల్స్ ముఖానికి ఉపయోగిస్తే.. ముఖం మెరిసిపోవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..
కలబంద రసంలో సగం టీస్పూన్ కస్తూరి పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయండి. వారానికి రెండు, మూడు సార్లు ఇలా చేస్తే ముఖం మీద మొటిమలు తొలగిపోతాయి.
కలబంద గుజ్జును కనురెప్పల ముందు.. కంటి చుట్టూ రోజూ రాసుకుంటే.. నల్లటి వలయాలు తగ్గిపోతాయి.
కలబందను చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా నీటిలో ఉడకబెట్టండి. చల్లారినత తర్వాత మిక్సీలో వేసి పేస్టులాగా చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో కొద్దిగా తేనె వేసి బాగా కలిపి ముఖానికి రాయాలి. ఇది మొటిమలు మరియు మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది.