Alia Bhatt: అలియా భట్ బ్యూటీ సీక్రెట్ ఈ డ్రింకే..!
అలియా భట్ కూతురు పుట్టిన తర్వాత కూడా చాలా ఫిట్ గా మారింది. ఆమె ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని మీకు కూడా ఉందా? అయితే.. ఇది చదవాల్సిందే.

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కి పరిచయం అవసరం లేదు. పేరుకు బాలీవుడ్ హీరోయిన్ అయినా.. తన సినిమాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అలియా నటనకు మాత్రమే కాదు.. ఆమె అందానికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలియా భట్ కూతురు పుట్టిన తర్వాత కూడా చాలా ఫిట్ గా మారింది. ఆమె ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని మీకు కూడా ఉందా? అయితే.. ఇది చదవాల్సిందే.
అలియా భట్ ప్రతిరోజూ ఉదయం ఒక డ్రింక్ తాగుతుంది. అదేంటో కాదు.. గోరువెచ్చని లెమన్ వాటర్. ఇది తాగడం వల్లే ఆమె ఫిట్ గా, అందంగా కనపడటానికి సహాయపడుతుంది. మరి, ఈ నిమ్మతొక్కలను గోరు వెచ్చని వాటర్ తాగడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..
గోరు వెచ్చని నిమ్మకాయ నీటిని తాగడం వల్ల ఆరోగ్యంతో పాటు.. చర్మం కూడా మెరుస్తూ కనపడేలా చేస్తుంది. నిమ్మకాయ ముక్కతో గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది, ఇది మొత్తం శరీర నిర్విషీకరణకు దారితీస్తుంది. ఈ పానీయం జీవక్రియను వేగవంతం చేస్తుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీనితో పాటు, ఇందులో విటమిన్ సి ఉంటుంది, ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. ఉదయాన్నే దీన్ని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య తొలగిపోతుంది.
lemon water
ఈ లెమన్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి..?
ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తీసుకోండి. మీరు దానిలో నిమ్మకాయను పిండవచ్చు లేదా దానిలో నిమ్మకాయ ముక్కను వేసి కొంతసేపు పక్కన పెట్టవచ్చు.
మీరు దానికి తేనె కూడా జోడించవచ్చు.ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి. రెగ్యులర్ గా పరగడుపున ఈ నీటిని తాగడం వల్ల.. బరువు తగ్గడానికి సహాయపడటంతో పాటు... చర్మం మెరుస్తూ కనపడుతుంది.