MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • ఈ బేబీ ప్రొడక్ట్స్ ను పెద్దలు కూడా ఉపయోగించుకోవచ్చు తెలుసా?

ఈ బేబీ ప్రొడక్ట్స్ ను పెద్దలు కూడా ఉపయోగించుకోవచ్చు తెలుసా?

చిన్నపిల్లలకు ఎన్నో ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తుంటారు. చిన్న పిల్లలవి ఇవి అని పెద్దలు వాటిని అస్సలు యూజ్ చేయరు. కానీ వీటిని పెద్దలు కూడా ఉపయోగించుకోవచ్చు. అవేంటంటే?  

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Apr 12 2024, 10:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

డైపర్ రాష్ క్రీమ్

పెదాలు పొడిబారడం చాలా కామన్. కానీ పొడిబారిన పెదాలను తిరిగి తేమగా చేయడానికి మీరు చిన్న పిల్లల డైపర్ రాష్ క్రీమ్ ను కూడా ఉపయోగించొచ్చు. ఇది పెదవులను మాయిశ్చరైజ్ చేసి మృదువుగా చేస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


బేబీ లోషన్లు

బేబీ లోషన్లను కూడా పెద్దలు ఉపయోగించుకోవచ్చు. ఈ బేబీ లోషన్లు చర్మంపై రక్షిత పొరను సృష్టిస్తాయి. బేబీ లోషన్లు చర్మ చికాకును తగ్గిస్తాయి. అలాగే చర్మం పొడిబారకుండా కాపాడుతాయి. అలాగే ఇది ఇతర లోషన్ల మాదిరిగా ఇది చర్మంపై జిగటగా ఉండదు.
 

36
shampoo

shampoo

బేబీ షాంపూ

మనం ఉపయోగించే షాంపూతో తలస్నానం చేయడం వల్ల జుట్టులోని సహజ నూనెలు తొలగిపోతాయి. దీంతో మీ జుట్టు నీరసంగా, పొడిగా కనిపిస్తుంది. అదేమీరు బేబీ షాంపూను ఉపయోగిస్తే మీ జుట్టును శుభ్రం చేసేటప్పుడు జుట్టులోని నేచురల్ ఆయిల్స్ ను అలాగే ఉంటాయి. అలాగే జుట్టు కూడా స్మూత్ గా కనిపిస్తుంది. 
 

46

బేబీ వైప్స్

బేబీ వైప్స్ ను కూడా మీరు ఉపయోగించొచ్చు. పెద్దవారు తమ ముఖాన్ని, మెడకు పట్టిన చెమటను తుడవడానికి బేబీ వైప్స్ ను ఎంచక్కా ఉపయోగించొచ్చు. దీన్ని మేకప్ రిమూవర్ గా కూడా  మీరు వాడుకోవచ్చు.

56

బేబీ పౌడర్

మేకప్ వేసుకున్న తర్వాత కొద్దిగా బేబీ పౌడర్ ను ముఖానికి రుద్దితే మేకప్ ఎక్కువ సేపు అలాగే ఉంటుంది. బేబీ పౌడర్ మీ ముఖం జిడ్డుగా మారకుండా కాపాడుతుంది. ఇది మీరు మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. 

66


బేబీ ఆయిల్

మీరు బేబీ ఆయిల్ ను కూడా ఉపయోగించుకోవచ్చు. బేబీ ఆయిల్ ను మేకప్ ను తొలగించడానికి ఉపయోగించొచ్చు. ఇది మీకు ఎలాంటి చికాకును కలిగించదు. చెడు ప్రభావాలను చూపించదు. ఇది చాలా సులువుగా మీ మేకప్ ను తొలగిస్తుంది. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Net Blouse: చీరలకు క్లాసీ లుక్ ఇచ్చే నెట్ బ్లౌజు డిజైన్లు.. చూసేయండి
Recommended image2
Rose Gold Bracelet: చేతుల అందాన్ని పెంచే రోజ్ గోల్డ్ బ్రేస్లేట్స్..!
Recommended image3
Heavy Rani Haar: ఈ హారం వేేసుకుంటే.. మహారాణిలా మెరిసిపోతారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved