ఇదొక్కటి చేస్తే..మీ వయసు పదేళ్లు తగ్గడం పక్కా..!
ఈ కింది అలవాట్లు కూడా అలవాటు చేసుకుంటే... కచ్చితంగా మీ వయసు పదేళ్లు తగ్గే అవకాశం ఉందట. మరి.. మీకు కూడా మీ వయసు పదేళ్లు తగ్గాలంటే... ఈ కింది పనులు చేస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం...
మనం మన జీవితంలో పోయినదానిని దేనిని అయినా తిరిగి పొందవచ్చు కానీ.. కోల్పోయిన వయసు మాత్రం తిరిగి పొందలేం. పుట్టిన ప్రతి ఒక్కరికీ వృద్దాప్యం వచ్చేస్తుంది. ఇది చాలా సహజం. కానీ, మనం దానిని కూడా రివర్స్ చేయవచ్చు. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. మీరు కేవలం.. కేవలం కొన్ని అలవాట్లు అలవరుచుకుంటే.. సులభంగా.. వయసు తగ్గించుకోవచ్చు.
యవ్వనం అనేది.. మనం తీసుకునే ఆహారం, మంచి నిద్ర, సరైన లైఫ్ స్టైల్ తో సాధ్యమౌతుంది. అంతేకాకుండా.. వీలైనంత వరకు ఒత్తిడి లేకుండా ఉండటం కూడా అలవాటు చేసుకోవాలి. ఇప్పటి వరకు ఇవి మీకు అలవాటు లేకపోయినా.. వీటిని ఇప్పటి నుంచి.. మీ లైఫ్ స్టైల్ లో భాగం చేసుకొని... ఇక నుంచి.. ఈ కింది అలవాట్లు కూడా అలవాటు చేసుకుంటే... కచ్చితంగా మీ వయసు పదేళ్లు తగ్గే అవకాశం ఉందట. మరి.. మీకు కూడా మీ వయసు పదేళ్లు తగ్గాలంటే... ఈ కింది పనులు చేస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం...
1.రోజూ ఒక స్పూన్ నెయ్యి తినడం...
నెయ్యి ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే నెయ్యి.. మీ వయసు తగ్గించి.. మీరు యవ్వనంగా మెరిసిపోయేలా చేస్తుంది. చాలా మంది నెయ్యి తింటే బరువు పెరుగుతుందని నమ్ముతుంటారు. కానీ... ఆ అపోహను కాస్త పక్కన పెడితే .. నెయ్యి మీ అందాన్ని పెంచుతుంది. నెయ్యిలో ఆరోగ్యకరమైనన ఫ్యాట్స్ చాలా ఉంటాయి. ఈ నెయ్యి తినడం వల్ల మనకు స్కిన్ లో మాయిశ్చరైజింగ్ పెరిగేలా చేస్తాయి. అంతేకాకుండా.. సహజమైన క్లెన్సర్ లా కూడా పని చేస్తుంది. అంతేకాకుండా... శరీరంలోని టాక్సిన్స్ తొలగించడంలోనూ సహాయపడుతుంది. అందుకే మహిళలు ప్రతిరోజూ ఒక స్పూన్ నెయ్యి తినడం వల్ల.. మీ అందం పెరుగుతుంది. మీ ముఖం పై ఫైన్ లైన్స్ తొలగించడంలో, ముడతలు తగ్గించడంలో సహాయం చేస్తాయి.
flaxseed
యవ్వనంగా కనిపించడానికి చియా, అవిసె గింజలు తినడం అలవాటు చేసుకోండి...
చియా, ఫ్లాక్స్ సీడ్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు గింజలు పేగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. గట్ ఆరోగ్యం మన శరీరం, చర్మంపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఈ రెండు గింజలను నానబెట్టి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మేలు జరుగుతుంది.
ఉదయంపూట వాకింగ్ చేయడం..
ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి రోజూ ఉదయం నడక తప్పనిసరి. నడక రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బరువును తగ్గిస్తుంది. ఇది అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంది. ఉదయాన్నే సూర్యకాంతిలో 10-15 నిమిషాలు నడవడం వల్ల శరీరంలో విటమిన్ డి స్థాయి మెరుగుపడుతుంది. చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది.
Image: Getty Images
బాదం నూనెతో ముఖానికి మసాజ్...
బాదం నూనె చర్మ ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. ఇందులో విటమిన్ ఇ , కె ఉన్నాయి. ఇవి చర్మంలో రక్త ప్రసరణను పెంచుతాయి. బాదం నూనెతో చర్మాన్ని మసాజ్ చేయడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది. వయస్సుతో పాటు చర్మం వదులుగా మారదు. ఇవి కనుక రెగ్యులర్ గా చేస్తూ ఉండటం వల్ల... కచ్చితంగా.. మీ వయసు కేవలం నెలరోజుల్లోనే పది సంవత్సరాలు తగ్గిపోతుంది.