అత్త, కోడలితో అస్సలు చెప్పకూడని విషయాలు ఇవే
అత్తగారు పొరపాటున కూడా తన కోడలికి కొన్ని విషయాలు చెప్పకూడదట. మరి.. ఎలాంటి విషయాలు చెప్పకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
అత్త లేని కోడలు ఉత్తమరాలు, కోడలు లేని అత్త గుణమంతురాలు.. ఈ మాట మీరు వినే ఉంటారు. ఎందుకు అంటే.. అత్తా, కోడళ్ల మధ్య సఖ్యత ఎప్పుడూ ఉండదని.. వారి మధ్య ఏదో ఒక విషయంలో సమస్యలు వస్తూనే ఉంటాయి అని దాని అర్థం. కానీ.. ఏ ఇంట్లో అయితే… అత్తా, కోడళ్ల మధ్య సమస్యలు లేకుండా… సంతోషంగా ఉంటారో..ఆ ఇల్లు మాత్రం చాలా సంతోషంగా ఉంటుందట.
అయితే, ఇల్లు సంతోషంగా ఉండాలంటే.. అత్తగారు పొరపాటున కూడా తన కోడలికి కొన్ని విషయాలు చెప్పకూడదట. మరి.. ఎలాంటి విషయాలు చెప్పకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
కోడలు ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె ఏం చేసినా తప్పులు వెతకడం మంచిది కాదు. అంటే.. మా కాలంలో ఇవన్నీ ఉండేవి కావు. మా ఇంట్లో ఇలాంటివన్నీ చేయడానికి వీలు లేదు. లాంటి మాటలు చెప్పకూడదు. ఎందుకంటే.. కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉండాలి. మీకు కాలం ఉన్నట్లు.. ఇప్పటి కాలం, ఈ కాలం అమ్మాయిలు ఉండరు అనే విషయం కూడా తెలుసుకోవాలి. మీ ఆలోచనలకు తగినట్లు ఈ కాలం అమ్మాయిల ఆలోచనలు ఉండవని తెలుసుకోవాలి.
మీ కొడుకును పెళ్లి చేసుకొని, తన కుటుంబాన్ని వదిలేసి మీ ఇంటికి వచ్చిన అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు. ఆమె ఒక్కసారి మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంది అంటే.. మీ ఇల్లు..తన ఇల్లు కూడా అవుతుంది. ఆ విషయం పట్టించుకోకుండా ప్రతిసారీ కోడలు ఏం చేసినా.. ఇది నీ ఇల్లు కాదు.. కాని పదే పదే అనడం మంచిది కాదు. ఇలాంటి మాటలు ఆమెను బాధపెడతాయి. ఆమె కూడా మీ కుటుంబ సభ్యురాలు అని మరు అంగీకరించాలి.
కోడలు ఇంట్లో ఏదైనా పొరపాట్లు చేస్తే.. తల్లిలా క్షమించాలి. అంతేకానీ… నీ పెంపకం సరిగా లేదు, ఇలానేనా మీ పేరెంట్స్ నిన్ను పెంచేది అంటూ ఆమెతో పాటు వాళ్ల పేరెంట్స్ ని కూడా తిట్టడం మంచిది కాదు. ఈ మాటలు పొరపాటున కూడా ఆమెను అనకూడదు. మీ కోడలికి మీ మీద, మీ కొడుకు మీద మర్యాద కూడా తగ్గిపోతుంది.
కుటుంబంలో ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకుంటుంటే.. అదుదలో మీ కోడలికి కూడా మాట్లాడే హక్కు ఉంటుంది అని తెలుసుకోవాలి. అంతేకానీ ఆమె మాట్లాడుతుంటే.. నీకేమీ తెలీదు, నోర్మూసుకో అంటే చెప్పడం మంచిది కాదు.
మీ కోడలిని ఏ విషయంలోనూ.. మీ కూతురితో పోల్చడం మంచిది కాదు. పొరపాటున కూడా నా కూతురు అయితే.. ఇలా చేసేది కాదు.. అలా చేసేది అంటూ పొలుస్తూ.. ఇబ్బంది పెట్టకూడదు. ఈ మాటలు కూడా ఆమెను ఇబ్బంది పెడతాయి.