సబ్బుతో ఈ గిన్నెలను తోమకూడదు, ఈ డ్రెస్ లను ఉతకకూడదు
సబ్బుతో మనం గిన్నెలు తోముతాం. దుస్తులను ఉతుకుతుంటాం. ఇది సర్వ సాధారణ విషయం. కానీ కొన్ని రకాల గిన్నెలను, దుస్తులను శుభ్రం చేయడానికి సబ్బును మాత్రం ఉపయోగించకూడదు. అవేంటంటే?
గిన్నెలను క్లీన్ చేయడానికి, స్నానం చేయడానికి, బట్టలు ఉతకడానికి మనం ఎన్నో రకాల సబ్బులను ఉపయోగిస్తుంటాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. దేనికోసం వాడాల్సిన సబ్బును దానికోసం మాత్రమే వాడుతుంటాం. కానీ కొన్ని రకాల గిన్నెలను, దుస్తులను శుభ్రం చేయడానికి సబ్బులను అస్సలు ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే సబ్బు వల్ల అవి దెబ్బతింటాయి. ఇంతకీ సబ్బుతో క్లీన్ చేయకూడని దుస్తులు, గిన్నెలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
సబ్బుతో శుభ్రం చేయకూడని 6 వస్తువులు:
ఇనుప పాత్రలు
మీకు తెలుసా? ఇనుప గిన్నెలను, ఇతర పాత్రలను శుభ్రం చేయడానికి సబ్బును అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే వీటిని సబ్బుతో క్లీన్ చేస్తే అవి చాలా తొందరగా పాడైపోతాయి. అంతేకాదు దీనివల్ల ఈ గిన్నెల్లో ఉండే ఫుడ్ టేస్ట్ కూడా మారిపోతుంది. అందుకే వీటిని సబ్బుతో క్లీన్ చేయడానికి బదులుగా వేడి నీళ్లు, ఉప్పుతో కడగండి.
ఉన్ని దుప్పట్లు
అవును ఉన్ని దుప్పట్లను, స్వెట్టర్లను కూడా సబ్బుతో శుభ్రం చేయకూడదు. ఎందుకంటే వీటిని సబ్బుతో ఉతికితే అవి ముడుచుకుపోయి పాత వాటిలా కనిపిస్తాయి. అలాగే వాటి లైఫ్ టైం కూడా తగ్గుతుంది.
పట్టు చీరలు:
పట్టు చీరలను పొరపాటున కూడా సబ్బుతో ఉతకకూడదు. ఒకవేళ ఉతికారంటే వాటి రంగు పూర్తిగా మారిపోతుంది. అలాగే పట్టు దారం దెబ్బతింటుంది. దీనివల్ల చీరలు తొందరగా దెబ్బతింటాయి. అందుకే పట్టు చీరలను సబ్బుతో కాకుండా డ్రై వాష్ కు ఇవ్వడం మంచిది.
బొచ్చు బట్టలు
బొచ్చు ఉన్న దుస్తులను కూడా సబ్బుతో ఉతకకూడదు. దీనివల్ల దుస్తులకు ఉన్న బొచ్చు దెబ్బతింటుంది. అలాగే ఈ దుస్తులు కూడా దెబ్బతింటాయి.
లెదర్ వస్తువులు:
లెదర్ వస్తువులను కూడా సబ్బుతో అస్సలు క్లీన్ చేయకూడదు. అంటే ఇంట్లో ఉన్న సోఫా, హ్యాండ్ బ్యాగ్ వంటి లెదర్ వస్తువులను శుభ్రం చేయడానికి సబ్బును పొరపాటున కూడా వాడకండి. ఎందుకంటే సబ్బు వల్ల లెదర్ వస్తువులు దెబ్బతింటాయి. వీటిని క్లీన్ చేయడానికి నీళ్లలో ముంచిన తడిగుడ్డతో తుడవండి.
కత్తులు
చాలా మంది కత్తులను శుభ్రం చేయడానికి సబ్బును ఉపయోగిస్తుంటారు. కానీ ఎప్పుడకరైనా సరే కత్తులను శుభ్రం చేయడానికి సబ్బును ఉపయోగించకూడదు. ఎందుకంటే దీనివల్ల కత్తులు తుప్పు పడతాయి. త్వరగా మొద్దుబారతాయి. కాబట్టి కత్తులను తడిగుడ్డతోనే తుడవండి.