MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Woman
  • ఏం చేసినా, చేయకపోయినా ఆడవాళ్లు రోజూ ఖచ్చింతంగా చేయాల్సిన పనులు ఇవి

ఏం చేసినా, చేయకపోయినా ఆడవాళ్లు రోజూ ఖచ్చింతంగా చేయాల్సిన పనులు ఇవి

ఆడవాళ్లకు ఒక్కటా, రెండా.. ఎన్నో బాధ్యతలు మీదుంటాయి. దీనివల్లే మీరు వారి ఆరోగ్యం గురించి పట్టించుకోవడమే మానేస్తుంటారు. కానీ దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఆడవాళ్లు కొన్ని పనులను రోజూ చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 11 2024, 07:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
women health

women health

ఆడవాళ్లు ఇంటా, బయట ఎన్నో పనులు చేస్తారు. మగవాళ్లకంటే ఆడవాళ్లకే ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. దీనివల్లే ఆడవారు తమ ఆరోగ్యం గురించి పట్టించుకోకపోతారు. కానీ దీనివల్లే వీరు ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ఇలాంటి సమయంలో మీరు ఎక్కువ టైం తీసుకోకుండా చాలా కంఫర్టబుల్ గా చేయగలిగే పనులు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పనులు ఆడవాళ్లను ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందాన్ని కూడా పెంచుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25


ఆడవాళ్లు రోజూ చేయాల్సిన 7 పనులు ఇవి

ఏదేమైనా, ఎన్ని పనులు ఉన్నా కానీ. ఆడవారు ఖచ్చితంగా తమ రోజువారి ఆహారంలో అంజీర, మఖానా,ఖర్జూరాలను చేర్చుకోవాలి. ఎందుకంటే ఈ మూడు డ్రై ఫ్రూట్స్ పీరియడ్స్, మెనోపాజ్ సమయంలో హార్మోన్ల సమతుల్యతను  మెరుగుపరచడానికి సహాయపడతాయి.

అలాగే ఇవి కటి ప్రాంతంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. ఆడవారి లైంగిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. అలాగే ఎముకలను బలంగా ఉంచుతాయి. అలసట రాకుండా చేస్తాయి. 

ఆడవాళ్లు ప్రతిరోజూ కూల్ వాటర్ తో ముఖాన్ని ఖచ్చితంగా కడుక్కుంటే మంచి ఫలితం ఉంటుంది. అవును కూల్ వాటర్ చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

దీంతో మీ చర్మం సహజంగా మెరుస్తుంది. అలాగే ఇది చర్మ రంధ్రాలను తగ్గిస్తుంది. అలాగే మొటిమలు, బ్లాక్ హెడ్స్ ముఖంపై లేకుండా చేస్తుంది. కూల్ వాటర్ కళ్ల చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ ను, కంటి వాపును తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. 
 

35
women health

women health

మహిళలు ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లను తాగాలి. ఎందుకంటే ఇధి మలం మృదువుగా ఉండటానికి, సులభంగా బయటకు వెళ్లడానికి సహాయపడుతుంది. అలాగే గ్యాస్ ట్రబుల్ ను తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. 

 

45
women health

women health

ఆడవారు రోజూ తమ ఆహారంలో విత్తనాలను చేర్చుకోవాలి. అంటే గుమ్మడికాయ, పొద్దుతిరుగుడు విత్తనాలు వంటివి చేర్చుకోవాలి. ఎందుకంటే వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

వీటిని తింటే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. వీటిలో ఉండే విటమిన్ ఇ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. వెంట్రుకలను బలంగా చేస్తుంది. హెయిర్ పెరగడానికి సహాయపడుతుంది. 

55
women health

women health

ఉదయాన్నే  ఆడవాళ్లు ముఖానికి, మెడను మసాజ్ చేయాలి. దీనివల్ల ముఖం వాపు తగ్గుతుంది. అలాగే ముఖ కండరాలు రిలాక్స్ అవుతాయి. అలాగే ముఖంపై ఉండే ముడతలను తగ్గించే కొల్లాజెన్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. 

ప్రతిరోజూ ఆడవాళ్లు యోగా, వ్యాయామం కూడా చేయాలి. ఎందుకంటే ఇది హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది. యోగా మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అలాగే ఒత్తిడి, యాంగ్జైటీని తగ్గిస్తుంది. ఇది మీ చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved