జస్ట్ లుకింగ్ లైక్ వావ్ అనిపించే చీరలు ఇవి..!
ప్రతి ఒక్క మహిళ వార్డ్ రోబ్ లో ఉండాల్సిన ఐదు బెస్ట్ చీరలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం.. ఆ చీరలే ఎందుకు ఉండాలి? వాటి స్పెషాలిటీ ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకుందాం...
ఆడవారి చీరలు అంటే ఎంత ఇష్టం ఉటుందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పెళ్లైన ఆడవారు ప్రతి సందర్భంలోనూ అంటే పండగ వచ్చినా, పంక్షన్ వచ్చినా చీర కొనాలని అనుకుంటారు. చాలా మంది ఫంక్షన్లకు కట్టిన చీర కట్టకుండా కట్టకుండా కడుతూ ఉంటారు. ఎన్ని రంగుల చీరలు ఉన్నా, ఎన్ని మోడల్స్ ఉన్నా, మార్కెట్లోకి కొత్త మోడల్ వచ్చింది అంటే... అది తమ వార్డ్ రోబ్ లోకి చేరిపోవాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి మీ వార్డ్ రోబ్ లో ఏది ఉన్నా లేకున్నా కచ్చితంగా ఈ ఐదు చీరలు మాత్రం ఉండి తీరాల్సిందే.
డిసెంబర్ 21న వరల్డ్ శారీ డే జరుపుకుంటారు. ఈ డే సందర్భంగా.. ప్రతి ఒక్క మహిళ వార్డ్ రోబ్ లో ఉండాల్సిన ఐదు బెస్ట్ చీరలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం.. ఆ చీరలే ఎందుకు ఉండాలి? వాటి స్పెషాలిటీ ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకుందాం...
bandhani saree
1.బాందినీ చీర..
బాందినీ చీర కొత్తదేమీ కాదు. ఎప్పటి నుంచో ఉన్న మోడలే. అయితే, దానిని కొత్త కొత్త పద్దతిలో, డిజైన్స్ మార్చి మనకు అందిస్తున్నారు. ఈ బాందినీ చీరలు సాధారణంగా సిల్క్, జార్జెట్, కాటన్ చీరల్లో లభిస్తుంది. వివిధ రకాల రంగులతో చిన్న చిన్న ప్రింట్స్ తో చాలా అందంగా ఉంటుంది. తక్కువ రేటు నుంచి ఎక్కువ రేటు వరకు బాందినీ ప్రింట్ లో మనకు చీరలు లభిస్తాయి. ఎవరు సౌలభ్యాన్ని బట్టి వారు కొనుగోలు చేయవచ్చు. కానీ, ఎంత రేటు అనేది పక్కన పెడితే, అందాన్ని అందించడంలో టాప్ లో ఉంటుంది.
Kanjivaram
2.కాంజీవరం..
కాంజీవరం పట్టుచీరలు కూడా కచ్చితంగా మీ వార్డ్ రోబ్ లో ఉండాల్సిందే. ప్రముఖ పుణ్యక్షేత్రం కంచి లో ఈ చీరలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. అక్కడ తయారైన ఈ చీరలను దేశ వ్యాప్తంగా అమ్ముతుంటారు. చెన్నై నగరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఈ కంచి ఉంటుంది. కంచి కామాక్షమ్మ ఆలయం సమీపంలో ఈ చీరలను అమ్ముతుంటారు. పెళ్లికి దాదాపు ప్రతి అమ్మాయి ఈ కంచి పట్టుచీరనే కట్టుకోవాలని అనుకుంటుంది. ఇది కూడా చాలా విభిన్న ధరల్లో లభిస్తుంది. ఎవరికైనా ఈ చీర అందాన్ని తెస్తుంది. విభిన్న రంగులు, అంతకంటే విభిన్నమైన డిజైన్ లలో జరీ అంచుతో వీటిని తయారు చేస్తారు. మరి మీ వార్డ్ రోబ్ లో ఈ కంచి పట్టుచీర ఉందా?
3.బెనారస్ పట్టు...
మహిళలు అమితంగా ఇష్టపడే చీరల్లో బెనారస్ పట్టు కూడా ఒకటి. చూడగానే రిచ్ లుక్ తెచ్చిపెట్టగల సత్తా ఈ చీరలో ఉంది. చాలా రంగుల్లో లభిస్తుంది. ఈ చీర కట్టుకుంటే ఎవరైనా ఎలిగెంట్ గా కనిపించాల్సిందే. హెవీ బోర్డర్, పట్టు అంచుతో చాలా అద్భుతంగా ఉంటుంది.
patan patola saree
4.పటోలా చీరలు..
పటోలా చీరలు కూడా కచ్చితంగా ఒక్కటైనా మన వార్డ్ రోబ్ లో ఉండాల్సిందే. ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ తో ఈ చీరలను తయారు చేస్తారు. భిన్నమైన రంగుల్లో పూలు, జంతువులు, పక్షుల డిజైన్ లతో తయారు చేస్తారు. చాలా మంచి లుక్ అందిస్తాయి.
5.చికంకారీ సారీ..
చికంకారీ చీరలు కూడా ఎలాంటి ఫంక్షన్ లో అయినా మనల్ని స్పెషల్ గా కనిపించేలా చేస్తాయి. ఈ చీరలను ఎక్కువగా లక్నోలో తయారు చేస్తారు. పాతకాలం నాటి నీడిల్ వర్క్ తో ఈ చీరలను రూపొందిస్తారు. అందంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసినట్లుగా ఉండే ఈ చీరలను మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు.