MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Woman
  • తెల్ల జుట్టు నల్లగా కావాలంటే.. ఇంట్లో తయారుచేసిన ఈ నూనెలను వాడండి

తెల్ల జుట్టు నల్లగా కావాలంటే.. ఇంట్లో తయారుచేసిన ఈ నూనెలను వాడండి

ఈ కాలంలో చిన్న చిన్న ఏజ్ వారికి కూడా తెల్ల జుట్టు వస్తోంది. ఈ తెల్ల జుట్టు కనిపించకూడదని చాలా మంది హెయిర్ కలర్స్ ను వాడుతుంటారు. అయితే ఇంట్లో తయారుచేసిన కొన్ని నూనెలను వాడినా కూడా తెల్ల జుట్టు కనిపించకుండా ఉంటుంది. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 01 2024, 02:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

చిన్న ఏజ్ లోనే జుట్టు తెల్లబడటం, జుట్టు రాలడం వంటి సమస్యలు  చాలా మందికి ఉంటాయి. ఇవి సర్వ సాధారణ సమస్యలుగా మారిపోయాయి. అయితే చాలా మంది తెల్ల జుట్టును దాచడానికి కలర్స్ వాడుతుంటారు. ఈ కలర్స్ వారం రోజుల్లోనే పూర్తిగా తొలగిపోతాయి. జుట్టు మళ్లీ తెల్లగా కనిపిస్తుంది.

అంతేకాకుండా.. ఈ రంగుల్లో రసాయనాలు ఉండటం వల్ల అవి జుట్టుకు ఎంతో హాని చేస్తాయి. అందుకే ఇంట్లో తయారుచేసిన హెయిర్ ఆయిల్స్ ను వాడితే తెల్ల జుట్టు కాస్త నల్లగా మారుతుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

నెత్తిమీద మెలనిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల జుట్టు తెల్లబడటం ప్రారంభమవుతుంది. అలాగే ఒత్తిడి, పోషకాహార లోపం, జెనెటిక్స్ వంటి అంశాలు కూడా తెల్ల వెంట్రుకలు ఎక్కువగా వచ్చేలా చేస్తాయి. ముఖ్యమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న.. ఇంట్లో తయారుచేసిన హెయిర్ ఆయిల్స్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. 

అలాగే తెల్ల జుట్టును రాకుండా చేయడానికి సహాయపడతాయి. తెల్లబడిన జుట్టును సహజంగా నల్లగా చేయడానికి సహాయపడే 5 ప్రభావవంతమైన ఇంట్లో తయారుచేసిన హెయిర్ ఆయిల్స్  ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

37

ఉసిరి, కొబ్బరి నూనె

ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నూనెలో ఉసిరి రసాన్ని కలిపి తలకు పట్టించడం వల్ల నెత్తిమీద మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే తెల్ల వెంట్రుకలు రావడాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు ఈ నూనె మీ జుట్టును బలంగా కూడా చేస్తుంది. 

47

బృంగరాజ్, నువ్వుల నూనె

జుట్టు సంరక్షణ కోసం "మూలికల రాజు" అని పిలువబడే బృంగరాజ్ తెల్ల జుట్టు మరింత పెరకుండా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ నూనెలో అవసరమైన కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన నువ్వుల నూనెతో కలిపినప్పుడు ఇది జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది, జుట్టు తెల్లబడకుండా చేయడానికి ఇద సహాయపడుతుంది. అలాగే సహజ జుట్టు రంగును కూడా పునరుద్ధరిస్తుంది.

57

గోరింటాకు. బాదం నూనె

గోరింటాకును జుట్టును ఎన్నో ఏండ్లుగా ఉపయోగిస్తున్నారు. ఇది సహజ రంగు, కండిషనర్‌గా బాగా ఉపయోగపడుతుంది. విటమిన్ ఇ, విటమిన్ బి లు ఎక్కువగా ఉండే బాదం నూనెలో గోరింటాకును కలిపినప్పుడు, ఇది సూక్ష్మమైన ఎరుపు రంగును జోడిస్తుంది. అలాగే జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. ఈ మిశ్రమం సహజంగా తెల్లబడిన జుట్టును కవర్ చేస్తుంది. అలాగే జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

67

రోజ్మెరీ నూనె, ఆలివ్  ఆయిల్

రోజ్మేరీ జుట్టు పెరగడానికి బాగా సహాయపడుతుంది. అలాగే దీనిలో స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సామర్థ్యం కూడా ఉంది. ఇకపోతే ఆలివ్ ఆయిల్ లోతైన తేమను అందిస్తుంది. రోజ్మేరీ ఆకులను ఆలివ్ ఆయిల్‌లో కలిపి మసాజ్ చేయడం వల్ల జుట్టు బలంగా మారుతుంది. అలాగే రంగు కూడా మెరుగుపడుతుంది. మొత్తం స్కాల్ప్ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, తెల్లబడే ప్రక్రియను తగ్గించేందుకే ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. 

77
చిత్రం: Getty

చిత్రం: Getty

బ్లాక్ టీ,  జొజోబా నూనె

బ్లాక్ టీలో టానిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సహజంగా జుట్టును నల్లగా చేయడానికి, మంచి రంగును  ఇవ్వడానికి బాగా సహాయపడతాయి. జొజోబా నూనె, స్కాల్ప్ సహజ నూనెలను పోలి ఉంటుంది. ఇది జుట్టును హైడ్రేట్ చేయడానికి, సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.

ఈ కలయిక తెల్లబడిన జుట్టు రూపాన్ని మెరుగుపరుస్తుంది, పోషణను అందిస్తుంది. అలాగే పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ఈ నూనె జుట్టును హెల్తీగా ఉంచుతుంది. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved