MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • వాషింగ్ మెషిన్ లో దుస్తులు వేసేటప్పుడు ఈ తప్పు మాత్రం చేయకండి

వాషింగ్ మెషిన్ లో దుస్తులు వేసేటప్పుడు ఈ తప్పు మాత్రం చేయకండి

ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో వాషింగ్ మెషిన్ ను వాడుతున్నారు. కానీ వీటిని సరైన పద్దతిలో వాడాలి. లేదంటే దుస్తులు పాడవుతాయి. అలాగే వాషింగ్ మెషిన్ కూడా తొందరగా పాడవుతుంది. 

2 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Dec 31 2024, 04:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఒకప్పుడు అయితే ఎన్ని దుస్తులున్నా చేతులతోనే ఉతికేసేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ బిజీ అయిపోయారు. అలాగే చేతులతో దుస్తులను ఉతికేసేంత ఓపిక కూడా జనాలకు తగ్గిపోయింది. అందుకే ప్రతి ఒక్క ఇంట్లో  వాషింగ్ మెషిన్లను వాడుతున్నారు. దీనిలో దుస్తులను సులువుగా ఉతకొచ్చు. ఎన్ని డ్రెస్ లు ఉన్నా చకాచకా మెషిన్ వాష్ చేసేస్తుంది. దీనిలో వాష్ చేసిన బట్టలు తొందరగా ఆరిపోతాయి కూడా. 
 

25

ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్

మార్కెట్లో రెండు రకాల వాషింగ్ మెషిన్ లు ఉన్నాయి. ఒకటి సెమీ ఆటోమేటిక్, రెండు ఫుల్లీ ఆటోమేటిక్.  కానీ ఈ రెండింటిలో ఏ దాన్ని ఉపయోగించినా మీరు వీటిని సక్రమంగా ఉపయోగించకపోతే మాత్రం ఇవి దుస్తులకున్న మురికి సరిగ్గా పోదు. అలాగే వాషింగ్ మెషిన్ కు సంబంధించి సమస్యలు కూడా వస్తాయి. అందుకే వాషింగ్ మెషిన్ లో ఎలాంటి సమస్య లేకుండా బట్టలను ఎలా ఉతకాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

35

బట్టలు ఉతికేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు 

చాలా మంది వాషింగ్ మెషిన్ లో బట్టలను వాష్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. కానీ దీనివల్ల మురికి బట్టలు మరింత మురికిగా మారతాయి. అలాగే వైట్ డ్రెస్సులపై మరకలు ఏర్పడతాయి. అందుకే రంగు రంగుల డ్రెస్సులను, వైట్ డ్రెస్సులను సపరేట్ గా వాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల బట్టల రంగు పాడవదు. అలాగే దుస్తులు కూడా చెక్కుచెదరకుండా ఉంటాయి. 

ఎక్కువ డిటర్జెంట్ ఉపయోగించొద్దు
 
చాలా మంది దుస్తులకున్న మురికి పోవాలని డిటర్జెంట్ ను ఎక్కువగా వాడుతుంటారు. ఎంత ఎక్కువ డిటర్జెంట్ వేస్తే దుస్తులు అంత తెల్లగా మెరుస్తాయని అనుకుంటారు. కానీ డిటర్జెంట్ ను ఎక్కువగా అస్సలు వాడకూడదు. ఎందుకంటే ఇది డ్రెస్ క్లాత్ ను దెబ్బతీస్తుంది. అలాగే రంగు మసకబారేలా చేస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే డిటర్జెంట్ ను మోతాదులోనే వాడండి. 

45
washing machine

washing machine

అలాంటి వాటిని వాషింగ్ మెషిన్ లో వేయకూడదు

మీరు గమనిస్తారో లేదో కానీ.. మనం కొనే ప్రతి డ్రెస్ పై అది వాషింగ్ మెషిన్ లో వేసేదా? లేదా? అని రాసి ఉంటుంది. వీటిని చదివితే మీకు ఏ దుస్తులు వేయాలో? ఏవి వేయకూడదో అర్థమవుతుంది. వాషింగ్ మెషీన్ లో ఉతకకూడని దుస్తులు కూడా ఉంటాయి. ఇలాంటి వాటిని చేతితోనే ఉతకాలి. వాషింగ్ మెషిన్ లో వేస్తే క్లాత్ పాడవుతుంది. 
 

55

కొత్త బట్టల్లో జాగ్రత్తగా  

కొత్త డ్రెస్సులు అంటే ఒకటి రెండు సార్లు ఉపయోగించిన దుస్తులను కూడా వాషింగ్ మెషిన్ లో ఉతుకుతుంటారు. కొత్త డ్రెస్ రంగుపోయే ప్రమాదం ఉంది. అందుకే కొత్త డ్రెస్ లను పాత డ్రెస్సులతో పాటుగా వాషింగ్ మెషిన్ లో వేయకూడదు. లేదంటే దీని రంగు ఇతర దుస్తులకు కూడా అంటుకుంటుంది. అలాగే వీటిని ముందు నీళ్లతో వాష్ చేయాలి.
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Beauty Tips: పగిలిన మడమలు మీ బ్యూటీని డామినేట్ చేస్తున్నాయా? ఇంట్లోనే సీక్రెట్ ఇంగ్రీడియంట్
Recommended image2
Silver Anklets: వర్కింగ్ ఉమెన్స్ కోసం సింపుల్ డిజైన్ లో వెండి పట్టీలు
Recommended image3
Pearl Earrings: ముత్యాల ఇయర్ రింగ్స్.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved