MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Woman
  • Glowing Skin: వర్షాకాలంలో ముఖం మెరిసిపోవాలంటే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి!

Glowing Skin: వర్షాకాలంలో ముఖం మెరిసిపోవాలంటే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి!

వర్షాకాలంలో రకరకాల చర్మ సమస్యలు వస్తాయి. ముఖం కాంతి తగ్గి.. నల్లగా, కళా విహీనంగా కనిపిస్తుంది. ఇక ఆయిల్ స్కిన్ ఉన్నవారి గురించి అయితే చెప్పనవసరం లేదు. మరి ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ సూపర్ ఫేస్ ప్యాక్‌ లు ట్రై చేయండి.  

2 Min read
Author : Kavitha G
Published : Aug 10 2025, 04:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
స్కిన్ కేర్ చిట్కాలు
Image Credit : freepik

స్కిన్ కేర్ చిట్కాలు

వర్షాకాలంలో చల్లని, తేమతో కూడిన వాతావరణం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చర్మ సమస్యలు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. అందుకు ఉపయోగపడే కొన్ని ఇంటి చిట్కాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పసుపు, వేప ఫేస్ ప్యాక్ :
Image Credit : Getty

పసుపు, వేప ఫేస్ ప్యాక్ :

పసుపు సహజంగానే ముఖానికి అందాన్నిస్తుంది. వేపాకులో బాక్టీరియా, ఫంగస్ నిరోధక లక్షణాలు ఉండటం వల్ల వర్షాకాలంలో వచ్చే మొటిమలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. పసుపు, వేప ఫేస్ ప్యాక్ కోసం.. వేపాకులను బాగా కడిగి, వాటిలో కొద్దిగా పసుపు, నీళ్లు కలిపి పేస్ట్‌లా రుబ్బుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ముఖం కడిగితే సరిపోతుంది.  

Related Articles

Related image1
Beauty Tips: 40 వయసులోనూ 20 లా కనిపించాలంటే తినాల్సిన ఫుడ్స్ ఇవే!
Related image2
Skin Care: పుదీనాతో వీటిని కలిపి రాస్తే ముఖంపై ఒక్క మొటిమ కూడా ఉండదు!
36
ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ :
Image Credit : Getty

ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ :

ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మం ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముల్తానీ మట్టి చర్మం నుంచి అదనపు నూనెను పీల్చుకుని రంధ్రాలను తెరవడానికి సహాయపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన రోజ్ వాటర్‌ చర్మాన్ని చల్లబరుస్తుంది. ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ కోసం.. 2 స్పూన్ల ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి.. ముఖానికి రాసుకోవాలి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తర్వాత ముఖం కడిగితే సరిపోతుంది.

46
శనగపిండి, పెరుగు, పసుపు ఫేస్ ప్యాక్ :
Image Credit : Getty

శనగపిండి, పెరుగు, పసుపు ఫేస్ ప్యాక్ :

జిడ్డు చర్మం ఉన్నవారికి శనగపిండి, పెరుగు, పసుపు ఫేస్ ప్యాక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ రాత్రి పూట వేసుకోవడం మంచిది. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి 2 స్పూన్ల శనగపిండిలో ఒక స్పూన్ పెరుగు, చిటికెడు పసుపు కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని అరగంట తర్వాత కడిగేయాలి. 

56
కలబంద జెల్, దోసకాయ ఫేస్ ప్యాక్ :
Image Credit : Getty

కలబంద జెల్, దోసకాయ ఫేస్ ప్యాక్ :

సెన్సిటివ్ చర్మం ఉన్నవారికి కలబంద జెల్, దోసకాయ ఫేస్ ప్యాక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కలబంద చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. దోసకాయ చర్మంలో పగుళ్లు రాకుండా చూస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి దోసకాయ రసంలో కలబంద జెల్ కలిపి ముఖానికి రాసుకోవాలి. 15-20 నిమిషాల తర్వాత కడిగిస్తే సరిపోతుంది.  

66
చందనం, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ :
Image Credit : Getty

చందనం, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ :

చందనంలో ఉండే క్రిమిసంహారక లక్షణాలు చర్మంపై దద్దుర్లు, మొటిమలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రోజ్ వాటర్ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. చందనం పొడిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకొని బాగా ఆరిన తర్వాత కడిగితే సరిపోతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
సౌందర్యం
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Related Stories
Recommended image1
Beauty Tips: 40 వయసులోనూ 20 లా కనిపించాలంటే తినాల్సిన ఫుడ్స్ ఇవే!
Recommended image2
Skin Care: పుదీనాతో వీటిని కలిపి రాస్తే ముఖంపై ఒక్క మొటిమ కూడా ఉండదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved