లవంగం నీరు జుట్టుకు పెడితే ఏమౌతుంది..?
లవంగం వంటలకు రుచిని మాత్రమే కాకుండా.. జుట్టు అందాన్ని పెంచడానికి కూడా ఈ లవంగం ఉపయోగపడుతుందని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం…
clove water
భారతీయ వంటగదిలో లవంగం చాలా ఈజీగా దొరికే పదార్థాలలో ఒకటి. దీనిని మనం చాలా రకాల వంటల్లో మనం కామన్ గా వాడుతూ ఉంటారు. బిర్యానీ లాంటి వాటికి మాత్రం లవంగం వేస్తేనే రుచి వస్తుంది అనడంలో సందేహం లేదు. మరి వంటలకు రుచిని మాత్రమే కాకుండా.. జుట్టు అందాన్ని పెంచడానికి కూడా ఈ లవంగం ఉపయోగపడుతుందని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం…
లవంగాలు మన జుట్టు అందంగా మార్చడంతో పాటు, స్కాల్ప్ ఆరోగ్యానికి పోషకాలతో కూడిన ప్రయోజనాలను కలిగిస్తుంది. ఎందుకంటే… లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఐరన్, కాల్షియం, సోడియం, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జుజట్టును ఆరోగ్యంగా కాపాడుకోవడానికి సహాయపడతాయి. లవంగంలో బీటా కెరోటిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది స్కాల్ప్ ఆరోగ్యంగా చేయడంలో సహాయపడుతుంది. దీని ఫలితంగా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
Clove tea
లవంగం నీటిని జుట్టుకు అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు…
జుట్టు తిరిగి పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది
లవంగం నీరు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే అవసరమైన విటమిన్లు ,ఖనిజాలతో నిండి ఉంటుంది. లవంగాలలో విటమిన్ సి ,బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి మీ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి.
clove water
చుండ్రు సమస్యకు చెక్…
లవంగాల్లో యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. లవంగం నీరు చుండ్రు చికిత్సలో బాగా హెల్ప్ అవుతుంది.
కుదుళ్లు బలంగా…
లవంగం నీటిలో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు జుట్టు పెరుగుదలకు ఆటంకం కలిగించే బాక్టీరియా, శిలీంధ్రాల నుండి రక్షిస్తూ, జుట్టును శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇన్ఫెక్షన్లను నివారించడం ద్వారా, లవంగం నీరు హెయిర్ ఫోలికల్స్ ఆరోగ్యాన్ని, బలాన్ని ప్రోత్సహిస్తుంది, తద్వారా జుట్టు రాలడం అనే సమస్య ఉండదు.
clove tea
తెల్ల జుట్టు సమస్య..
జుట్టుకు లవంగాల నీరు వాడటం వల్ల తెల్ల జుట్టు సమస్య పెద్దగా ఉండదు. ఎందుకంటే అవి మీ సహజ జుట్టు రంగుకు కారణమైన పిగ్మెంట్ల ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి.