కలబందను డైరెక్ట్ గా ముఖానికి పెడితే ఏమౌతుంది?
కలబంద ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని ఉపయోగించి ఎన్నో చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. అందుకే దీని జెల్ ను డైరెక్ట్ గా ముఖానికి పెట్టేస్తుంటారు. కానీ కలబంద జెల్ ను తీసి అలాగే ముఖానికి పెడితే ఏమౌతుందో తెలుసా?
aloe vera gel
కలబంద జెల్ లో ఎన్నో ఔషద లక్షణాలుంటాయి. ఇది మనకు కెమికల్స్ లాగా ఎలాంటి హాని చేయడదు. అయినప్పటికీ.. దీన్ని డైరెక్ట్ గా అంటే కలబంద గుజ్జును తీసి ముఖానికి పెట్టుకుంటే కొన్ని సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుందని నిపుణఉలు చెబుతున్నారు.
aloe vera gel
కలబంద జెల్ లో మన శరీరానికి, చర్మానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఈ జెల్ ను అలాగే ముఖానికి పెట్టుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కలబంద జెల్ లో టీ ట్రీ ఆయిల్ తో పాటుగా కొన్ని సహజ పదార్థాలను కలపకుండా ముడి కలబందను ముఖానికి ఉపయోగిస్తే కొన్ని చర్మ సమస్యలు వస్తాయి. ఇది చర్మ రకం, సున్నితత్వం మీద ఆధారపడి ఉంటుంది.
కొంతమందికి ముడి కలబందను ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్యలు రాకపోవచ్చు. కానీ కొంతమందికి అలెర్జీ, దద్దుర్లు, దురద, చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు వస్తాయి. నిజమేంటంటే? కలబంద ప్రతి చర్మ రకానికి సరిపోదు. కాబట్టి దీన్ని ఉపయోగించే ముందు ఇది పడుతుందా? లేదా? అని చెక్ చేసుకోవాలి.
నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ హెల్త్ ప్రకారం.. చర్మానికి లోతైన కోతలు లేదా గాయాలు ఉంటే మాత్రం మీరు ఎట్టిపరిస్థితిలో కలబంద జెల్ ను ఉపయోగించకూడదు. ఎందుకంటే కలబంద జెల్ శస్త్రచికిత్సకు సంబంధించిన లోతైన గాయాలు నయం కావడానికి మీ చర్మ సహజ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
పలు నివేదికల ప్రకారం.. కలబంద జెల్ ను పెట్టుకునేటప్పుడు కొంతమందికి మంట, దురద వంటి సమస్యలు వచ్చాయి. ఒకవేళ దీనివల్ల దద్దుర్లు అయితే మాత్రం వెంటనే దీన్ని పెట్టడం ఆపేయాలి. అలాగే చర్మ అంటువ్యాధులు ఉంటే కూడా కలబంద జెల్ ను పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇది అంటువ్యాధులను మరింత పెంచుతుంది.
Image: Getty Images
ముడి కలబందను ముఖానికి అప్లై చేయడం వల్ల వచ్చే సమస్యలు
అలెర్జీ ప్రతిచర్య
కొంతమందికి కలబంద జెల్ కు అలెర్జీ ఉండొచ్చు. ఇలాంటి వారు కలబంద జెల్ ను డైరెక్ట్ గా పెట్టుకుంటే దద్దుర్లు, దరద, చర్మం ఎర్రగా మారడం వంటి సమస్యలు వస్తాయి. మీ చర్మంపై గనుక ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే దాన్ని వాడటం ఆపేయండి. విపరీతమైన దురద, దద్దుర్లు, శ్వాసకోశ సమస్య ఉంటే మాత్రం వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. కొంతమందికి కలబంద జెల్ ను ఉపయోగించిన వెంటనే చర్మపు సున్నితత్వం పెరుగుతుంది. అలాగే చికాకు కలుగుతుంది.
ముడి కలబంద జెల్ ను ముఖానికి ఎక్కువసేపు ఉంచితే మాత్రం చర్మం బాగా పొడిబారుతుంది. దీనివల్ల చర్మం మండుతున్న అనుభూతి కలుగుతుంది. అందుకే డైరెక్ట్ గా మొక్క నుంచి తీసిన కలబంద జెల్ ను వాడటానికి బదులుగా పలుచగా ఉన్న మార్కెట్ లో దొరికే కలబంద జెల్ ను వాడటం మంచిది.