అయ్యోపాపం.. వేదికపైనే కుప్పకూలిపోయింది: సింగర్ మోనాలి ఠాకూర్ కి ఏమైంది?
‘సవార్ లూ’, ‘మోహ్ మోహ్ కే ధాగే’ పాటలతో కుర్రకారుని ఉర్రూతలూగించిన గాయని మోనాలి ఠాకూర్ . వారణాసిలో జరుగుతున్న దిన్హతా ఉత్సవంలో ప్రత్యక్ష ప్రదర్శన ఇస్తున్న సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. హుటాహుటిన ఆమెని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వేదిక నిర్వహణ సరిగా లేకపోవడంతో ఆమె కచేరీని నిలిపివేసిన సంఘటన తర్వాత ఇది జరిగింది. అభిమానులకు ఆమె క్షమాపణలు చెప్పారు.
14

దిన్హతా ఉత్సవంలో ప్రదర్శన ఇస్తున్నప్పుడు గాయని మోనాలి ఠాకూర్‌కు ఆరోగ్య సమస్య ఎదురైంది. ఆమెకు తీవ్ర శ్వాస ఆడకపోవడంతో ప్రదర్శనను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది.
24
మోనాలి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, కానీ ఆమె ఆరోగ్యం గురించి ఎలాంటి అప్‌డేట్‌లను మీడియా, సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు.
34
కొన్నివారాల క్రితం, వారణాసిలో జరిగిన ఒక కచేరీని నిర్వహణ లోపం, వేదిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో మోనాలి అకస్మాత్తుగా ముగించారు.
44
ఈవెంట్ నిర్వాహకులను మోనాలి విమర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటానని అభిమానులకు హామీ ఇచ్చారు.
Latest Videos