Nandamuri హీరో 35 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ, బాలకృష్ణకు ఆయన ఏమౌతాడో తెలుసా?
Nandamuri Hero: టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోలుగా వెలుగు వెలిగి మాయమైన వారు చాలామంది ఉన్నారు. చాలా కాలం తరువాత అందులో కొంత మంది మళ్లీ రీ ఎంట్రీలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి ఫ్యామిలీకి చెందిన ఓ హీరో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇంతకీ ఆయన ఎవరు?

రీ ఎంట్రీ ఇస్తోన్న ఒకప్పటి హీరోలు?
ఈ మధ్య కాలంలో ఒకప్పటి హీరోలు, హీరోయిన్లు మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది తారలు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో.. నందమూరి కుటుంబానికి చెందిన మరో మాజీ హీరో కూడా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీకి రెడీ అయ్యాడు. దాదాపు 35 ఏళ్ళ తరువాత వెండితెరపై సందడి చేయబోతున్న ఆ హీరో ఎవరో కాదు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి.
ఎవరీ నందమూరి కళ్యాణ్ చక్రవర్తి?
నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ఒకప్పుడు టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందిన నటుడు. ఆయన ఎవరో కాదు సీనియర్ ఎన్టీఆర్ సొంత తమ్ముడు నందమూరి త్రివిక్రమ్ రావు కుమారుడు. ఎన్టీ రామారావు కళ్యాణ్ చక్రవర్తికి స్వయానా బాబాయ్ అవుతారు. ఈ రకంగా నటసింహం నందమూరి బాలకృష్ణకు కళ్యాణ్ చక్రవర్తి తమ్ముడు అవుతారు. కళ్యాణ్ చక్రవర్తి నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించాడు.
కళ్యాణ్ చక్రవర్తి సినిమాలు
కళ్యాణ్ చక్రవర్తి హీరోగా అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు. దొంగ కాపురం, ప్రేమ కిరీటం, ఇంటిదొంగ, అక్షింతలు, అత్తగారు స్వాగతం, రౌడీ బాబాయ్, మేనమామ, కృష్ణ లీల, తలంబ్రాలు, జీవనగంగ, మామ కోడలు సవాల్ లాంటి సినిమాల్లో కళ్యాణ్ నటించారు. ఇక చిరంజీవి హీరోగా వచ్చిన లంకేశ్వరుడు వంటి అనేక సినిమాలలో సెకండ్ హీరోగా కూడా నటించారు కళ్యాణ్ .
సినిమాలకు బ్రేక్ ఇచ్చిన నందమూరి హీరో
1990 తర్వాత కళ్యాణ్ చక్రవర్తి వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. అసలు ఇండస్ట్రీలో కనిపించకుండాపోయారు. కళ్యాణ్ చక్రవర్తి సోదరుడు హరిన్ ఒక ప్రమాదంలో మరణించగా, అదే ప్రమాదంలో వారి తండ్రి త్రివిక్రమ్ రావు తీవ్ర గాయాలపాలై మంచానపడ్డారు. ఈ సంఘటనలు కళ్యాణ్ చక్రవర్తిపై తీవ్ర ప్రభావం చూపడంతో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు కళ్యాణ్. సినిమాలు వదిలేసి వ్యాపారంలో స్థిరపడ్డ ఈ హీరో చెన్నైలో నివసిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఈమధ్య కాలంలోనే మళ్లీ బయటక కనిపిస్తున్నాడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి
రోషన్ సినిమాలో ప్రముఖ పాత్ర
ఇన్నేళ్ల విరామం తర్వాత ఇప్పుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రోషన్ నటిస్తున్న ఛాంపియన్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ తాజాగా కళ్యాణ్ చక్రవర్తి లుక్‌ను విడుదల చేసింది. ఆ ఫోటో చూసిన నందమూరి అభిమానులు సంతోషిస్తున్నారు. అప్పట్లో కళ్యాణ్ సినిమాలు చూసిన ఫ్యామిలీ ఆడియన్స్.. ఇప్పుడు ఆయన లుక్ చూసి షాక్ అవుతున్నారు.

