- Home
- Entertainment
- Gossips
- 700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?
700 కోట్ల ఆస్తికి యజమాని, సౌత్ తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ లో పాపులర్ అయిన హీరోయిన్, 40 ఏళ్లు దాటినా ఏమాత్రం ఇమేజ్ తగ్గని బ్యూటీ.. తన కంటే వయసులో 10 ఏళ్లు చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్ ఎవరో తెలుసా?

గ్లోబల్ ఇమేజ్ ఉన్న హీరోయిన్
సౌత్ లో కెరీర్ ను స్టార్ట్ చేసి.. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి.. హాలీవుడ్ లో హడావిడి చేస్తోంది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. బాలీవుడ్ పై విమర్శలు చేసి.. హాలీవుడ్ లో సెటిల్ అయిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ వారణాసిలో మహేష్ బాబు జోడీగా నటిస్తోంది. దాదాపు 1500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈసినిమాను రాజమౌళి రూపొందిస్తున్నారు.
10 ఏళ్లు చిన్నవాడిని పెళ్లాడిన ప్రియాంక..
బాలీవుడ్ లో స్టార్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా.. చిన్నగా హాలీవుడ్ చేరింది. బాలీవుడ్ లో తనకు కొన్ని అవమానాలు జరిగాయని బాధపడిన ఆమె.. హాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. అక్కడే నటుడు, పాప్ సింగర్ అయిన నిక్ జానస్ ను ప్రేమించి పెళ్లాడింది. అయితే నిక్ ప్రియాంక కంటే దాదాపు 10 ఏళ్లు చిన్నవాడు. అయిన సరే ప్రేమ ముందు ఇవన్ని లెక్కలోకి రావు అని నిరూపించింది ఈ జంట. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 7 ఏళ్లుగా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. లాస్ ఎంజిల్స్ లో దాదాపు 100 కోట్లతో ఇల్లు కట్టుకుని అక్కడే ఉంటున్నారు ఈ జంట.
విడాకుల వార్తలు..
సాధారణంగా బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స చాలామంది పెళ్లైన కొన్నేళ్లకే విడాకులు తీసుకున్న సంఘటనలు చాలా చూశాం. చిన్న చిన్న విషయాలకే వారు విడిపోతుంటారు. కాని అటుంటి వాటికి భిన్నంగా తమ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు ప్రియాంక చోప్రా, నిక్. వీరి మధ్య 10 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్నా.. ఈ విషయంలో ట్రోల్ చేస్తున్నా కానీ.. నిక్-ప్రియాంక జంట ఆ విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగుతోంది.నిక్, ప్రియాంకల ప్రేమ వయసుతో సంబంధం లేదని నిరూపిస్తోంది. విడాకుల పుకార్లు వ్యాపిస్తున్నా, ఈ జంట మాటలతో కాకుండా చేతలతో విమర్శకుల నోళ్లు మూయిస్తున్నారు.
ప్రియాంక రెమ్యునరేషన్.. ఆస్తి వివరాలు..
ప్రియాంక చోప్రా తన సొంతంగా కోట్లలో కూడబెట్టింది. ఆమెకు దాదాపు 700 కోట్ల వరకూ ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె సినిమాకు 30 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఇండియాతో పాటు అమెరికాలో కూడా ఆమెకు ప్రాపర్టీస్ ఉన్నాయి. లాస్ ఏంజిల్స్ లో 100 కోట్ల ఇంటితో పాటు.. 20 కోట్ల విలువైన జ్యూవెల్లరీ.. ఆమె కలిగి ఉన్నట్టు సమాచారం. అంతే కాదు కొన్ని అకేషన్స్ లో ప్రియాంక చోప్రా 50 లక్షల నుంచి .. 4 కోట్ల వరకూ విలువున్న దుస్తులు ధరించినట్టు తెలుస్తోంది. అటు నిక్ కూడా 12 వందల కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నట్టు సమాచారం. అయితే విలాసవంతమైన జీవితం అంటే ..ఖరీదైన కార్లు, బంగ్లాలు కాదు. "నా కుటుంబంతో ఇంట్లో ప్రశాంతంగా గడపడమే నాకు అసలైన లగ్జరీ. ఆ రోజు ఎక్కడికీ వెళ్లే తొందర ఉండదు" అని ప్రియాంక పలు సందర్భాల్లో అన్నారు.
బెడ్ రూమ్ సీక్రెట్ వెల్లడించిన ప్రియాంక..
విడాకుల పుకార్ల మధ్య, ఈ జంట తమ చేతలతో విమర్శకుల నోరు మూయిస్తున్నారు. కొన్ని నెలల క్రితం, ప్రియాంక తన బెడ్‌రూమ్ రహస్యాన్ని బయటపెట్టి అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఆదివారం ఉదయం నిద్రలేచి మంచం మీద తన భర్తను కౌగిలించుకోకపోతే ఆ రోజు మొదలైనట్టు అనిపించదని ప్రియాంక సిగ్గుపడుతూ చెప్పింది. వారం మొత్తం ఎంత బిజీగా ఉన్నా.. ఆదివారం సమయం మొత్తం పూర్తిగా తన కుటుంబానికే కేటాయిస్తానని ప్రియాంక వెల్లడించింది. ఇది వారి జీవితంలో ఒక సంప్రదాయంగా మారింది. అందుకే పెళ్లయి ఏడేళ్లయినా వారి ప్రేమ ఇంకా తాజాగా ఉంది. ఈ జంట ప్రస్తుతం తమ కుమార్తె మాల్తీ మేరీతో కలిసి అమెరికాలో సంతోషంగా జీవిస్తున్నారు.
వారణాసి షూటింగ్ లో ప్రియాంక బిజీ..
ఇక ప్రియాంక చోప్రా పెళ్లై పిల్లలు కలిగిన తరువాత కూడా ప్రియాంక చోప్రా తన స్టార్ డమ్ ను, ఇమేజ్ ను ఏమాత్రం కోల్పోలేదు. అంతకు మించిన డిమాండ్ తో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ నుంచి పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోన్న వారణాసి సినిమాలో నటిస్తోంది. రాజమౌళి డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈసినిమా లో మహేష్ బాబు జోడీగా ప్రియాంక, మందాకిని గా పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతోంది. ఈసినిమా 2027 సమ్మర్ లో రిలీజ్ కాబోతున్నట్టు సమాచారం.

