MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sweet Heart
  • Viral News
  • తాబేళ్ల అక్రమ రవాణాను ఎందుకు నేరంగా పరిగణిస్తారు.? దీని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటి..

తాబేళ్ల అక్రమ రవాణాను ఎందుకు నేరంగా పరిగణిస్తారు.? దీని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటి..

'తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న ముఠాను గుట్టురట్టు చేసిన పోలీసులు'.. ఇలాంటి వార్తలను ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటాం. అయితే తాబేళ్లను అక్రమ రవాణా ఎందుకు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా.? దీని వెనకాల ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..  

1 Min read
Author : Narender Vaitla
Published : Jan 26 2025, 12:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

భారతదేశంలో తేబేళ్లను స్మగ్లింగ్ చేయడం నేరంగా పరిగణిస్తారు. ఇలా చేస్తూ పట్టుబడితే శిక్ష విధిస్తారు. భారతదేశం సహా ప్రపంచమంతా తాబేళ్లను అక్రమంగా రవాణా చేస్తుంటారు. అంతర్జాతీయ మార్కెట్‌కు వీటిని దొంగతనంగా రవాణా చేస్తున్నారు. ఈ తాబేళ్లను అమ్మడం ద్వారా కేటుగాళ్లు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. వీటిలో కొన్ని తాబేళ్లకు మార్కెట్లో డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. 
 

23

వీటిలో నక్షత్ర తాబేలు ముఖ్యమైంది. నక్షత్ర తాబేలు వెనుక పసుపు, నలుపు మచ్చల వంటి అందమైన ఆకారం ఉంటుంది. నిజానికి ఇది పిరమిడ్ లాగా ఉంటుంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం భారతీయ జంతువులను అక్రమంగా రవాణా చేయడం, నిల్వ చేయడం నేరంగా పరిగణిస్తారు. వన్యప్రాణుల అక్రమ రవాణా లేదా కొనుగోలు, అమ్మకం గురించి ఏదైనా సమాచారం అందితే, వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ 9(44) కింద నేరం నమోదు చేస్తారు. 

ఇందులో శిక్ష విధించే నిబంధన కూడా ఉంది. అదేవిధంగా, అంతరించిపోతున్న వృక్షజాలం, జంతుజాలంలో అంతర్జాతీయ వాణిజ్యంపై అంతర్జాతీయ కన్వెన్షన్ ప్రకారం, ఏ జంతువును కొనడం, అమ్మడంపై నిషేధం ఉంది. విదేశీ జంతువుల రాకతో స్థానిక జంతువులు ప్రమాదంలో పడతాయనే ఉద్దేశంతో నిషేధించారు. ఇక తాబేలును అక్రమ రవణా చేసిన వారిని పట్టుకుంటే ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది. 

33

ఎందుకు అక్రమ రవాణా చేస్తున్నారు.? 

తాబేళ్లకు ఉన్న డిమాండ్‌ కారణంగానే వీటిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఆగ్నేయాసియాతో సహా అనేక ప్రదేశాల్లో, నక్షత్ర తాబేళ్లు అదృష్టానికి సంకేతంగా ప్రజలు నమ్ముతారు. వీటిని పెంచుకుంటే మంచి జరుగుతుందని కొందరు విశ్వసిస్తారు. ఈ కారణంగా వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక నక్షత్ర తాబేళ్ల నుంచి లైంగిక శక్తిని పెంచే మందులు తయారు చేస్తారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో వీటికి మంచి డిమాండ్‌ ఉంది. తాబేళ్లు వైద్యంలో ఉపయోగించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అక్రమ రవాణా జరుగుతోంది. 
 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dog in School: పెంపుడు కుక్కను కిండర్ గార్డెన్ స్కూల్ చేర్పించిన మహిళ, ఫీజు ఎంతో తెలుసా?
Recommended image2
PTM: అద్దెకు తల్లిదండ్రులు కావాలి.. బెంగళూరు విద్యార్థి వింత ప్రకటన.. రూ. 15,000 ఆఫర్ !
Recommended image3
Viral Video: ఫ్లైట్‌లో ఇలాంటి చెత్త పనులు చేస్తే విమానం నుంచి దించేయక మరేం చేస్తారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved