ఆర్ఏసీ టికెట్ ప్రయాణికులకు రైల్వే శాఖ గిఫ్ట్: హమ్మయ్యా! హాయిగా ప్రయాణించొచ్చు
ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే మీకు ఆర్ఏసి (RAC) టికెట్ వచ్చిందా? సీటులోనే కూర్చొని ప్రయాణించాలని చింతిస్తున్నారా? రైల్వే శాఖ మీకు ప్రత్యేక సౌకర్యాల బహుమతి అందిస్తోంది. ఆ సౌకర్యాలతో మీరు హాయిగా, ప్రశాంతంగా ప్రయాణం చేయొచ్చు. అవేంటో తెలుసుకుందాం రండి.

రైల్వే టికెట్ బుక్ చేసేటప్పుడు కన్ఫర్మ్ అవ్వాలనే కోరుకుంటాం కదా.. కాని ఆర్ఏసీ(RAC) టికెట్ వచ్చిందంటే ట్రైన్ స్టార్ట్ అయ్యే టైమ్ కైనా టికెట్ కన్ఫర్మ్ అవుతుందని ఎదురు చూస్తుంటాం. టికెట్ కన్ఫర్మ్ కాకపోయినా RAC వల్ల కనీసం సీట్ దొరుకుతుందని, అందులో కూర్చొనైనా ప్రయాణం చేయొచ్చని సంతోషిస్తాం.
కాని చాలా మంది ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేయించుకొనేది బెర్త్ కోసం. హాయిగా పడుకొని అలసట లేకుండా వెళ్లొచ్చని ట్రైన్ టికెట్ రిజర్వ్ చేయిస్తారు. రిజర్వేషన్ కన్ఫర్మ్ కాకపోయినా RAC వస్తే చాలని కూడా చాలా మంది కోరుకుంటారు.
కాని ఆర్ఏసీ అంటే కేవలం సీట్ మాత్రమే ఇస్తారు కాబట్టి ఎక్కువ దూరం కూర్చొని ప్రయాణించడం కష్టంగా ఉంటుంది. అందుకే RAC టికెట్లతో ప్రయాణించే వాళ్లకి ఉపయోగపడేలా భారతీయ రైల్వే ఒక పెద్ద సౌకర్యాల బహుమతి తెచ్చింది.
బెర్త్ కోసం మొత్తం డబ్బులు కడితే సీటు మాత్రమే వచ్చిందని అనుకునే వాళ్లకి ఈ గిఫ్ట్ ఆనందాన్నిస్తుంది. కొత్త రూల్స్ ప్రకారం ఆర్ఏసీ(RAC) టికెట్టు ఉన్నవాళ్లకి ఫుల్ సీట్ ఇస్తారు. అంటే హాయిగా పడుకొని వెళ్లొచ్చన్న మాట.
ఇప్పటివరకు ఆర్ఏసీ ప్యాసింజర్స్ సైడ్ కింద బెర్త్ ని ఇంకొకరితో షేర్ చేసుకునే వాళ్ళు. ఈ కొత్త రూల్ వల్ల ఎవరితోనూ సీట్ షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కంఫర్ట్ గా రెస్ట్ తీసుకోవచ్చు.
అంతేకాకుండా కొత్త రూల్స్ ప్రకారం ఏసీ బోగీల్లో ఉండే ఆర్ఏసీ టికెట్ ఉన్నవాళ్లకి ఇకపై రెండు బెడ్ షీట్లు, ఒక దుప్పటి, ఒక దిండు, ఒక టవల్ కూడా ఇస్తారు.
ఆర్ఏసీ టికెట్ వల్ల ఇప్పటి వరకు ఒక సందిగ్ధం ఉండేది. అదేంటంటే.. ఆర్ఏసీ టికెట్ వస్తే చార్ట్ ప్రిపేర్ అయ్యేలోపు టికెట్ కన్ఫర్మ్ అవుతుందని ఆశగా ఎదురు చూసేవారు. సాధారణంగా ఆర్ఏసీ టికెట్ అంటే సగం మాత్రమే కన్ఫర్మ్ అయిన టికెట్ అని అర్థం. కనీసం సీట్ అయినా దొరికిందని ప్రయాణించేవారు.
కొత్త రూల్ ప్రకారం ఆర్ఏసీ టికెట్ ప్రయాణికులు ఎవరైనా తమ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే మరో ఆర్ఏసీ టికెట్ ప్రయాణికుడికి ఫుల్ బెర్త్ దొరుకుతుంది.
ప్రతి స్లీపర్ బోగీలో ఏడు ఆర్ఏసీ బెర్త్‌లు ఉంటాయి. బెర్త్‌ను షేర్ చేసుకునే 14 మంది ప్రయాణికులకు చోటు ఉంటుంది. కొత్త రూల్ ప్రకారం పక్కనే ఉన్న ప్రయాణికుడు తన టికెట్‌ను రద్దు చేసుకుంటే ప్రయాణికులు ఇక తమ సీటును షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫుల్ బెర్త్ వాడుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా డబ్బులేమీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.
ఈ మార్పు ఆర్ఏసి ప్యాసింజర్స్ కి మరింత సౌకర్యవంతమైన, ఒత్తిడి లేని ప్రయాణాన్ని లభిస్తుంది. భారతీయ రైల్వే తీసుకొచ్చిన ఈ సౌకర్యాలతో ప్రజలు మరింత క్షేమంగా ప్రయాణాలు చేయొచ్చు.
IRCTCలో ఇంత మంచి ఆప్షన్ ఉందా? ఇలా చేస్తే రిజర్వేషన్ సీట్ కన్ఫర్మ్